Chandrababu naidu | English | Ministers | AP | national Media | Babu

Chandrababu naidu facing new language problems for english speaking

Chandrababu naidu, English, Ministers, AP, national Media, Babu

Chandrababu naidu facing new language problems for english speaking. In the chandrababu naidu cabinet, ministers didnt speaking english fluently.

మంత్రులూ.. నో టాకింగ్ అంటున్న చంద్రబాబు

Posted: 07/22/2015 07:22 PM IST
Chandrababu naidu facing new language problems for english speaking

ఇన్ ఫ్రంట్ క్రోకోడైల్ ఫెస్టివల్.. అంటే ముందుంది ముసళ్ల పంగడ. ఇది చదవగానే ఏదో సినిమాలో డైలాగ్ లా ఉందే అనిపించిందా..? అవును ఇది ఓ సినిమాలోని డైలాగే.. అది కూడా మెగాస్టార్ చిరంజీవి శంకర్ దాదా ఎంబిబియస్ సినిమాలోని డైలాగ్. అయితే ఇప్పుడు ఈ సినిమా డైలాగ్ ఎందుకు వాడాల్సి వచ్చింది అని అనుకుంటున్నారా..? ఏపి ముఖ్యమంత్రిగారి పరిస్థితి కాస్త అటు ఇటుగా ఇలానే ఉంది. ఏంటి ఎంతో వైభవంగా పుష్కరాలు నిర్వహిస్తున్నారు. అమరావతి సీడ్ క్యాపిటల్ ను ఎంతో సూపర్ గా తయారు చేయించారు మరి అలాంటి చంద్రబాబుకు ముందెందుకు ముసళ్ల పండగ ఉంది అనుకుంటున్నారా..? అయితే తన స్వంతగా కాదు లెండి.. తన మంత్రి వర్గంలోని మంత్రుల వల్ల. అది కూడా వారికి ఇంగ్లీష్ రాదు కాబట్టి.

ఏంటీ.. ఇంగ్లీష్ రాకపోతే అలా ఎలా అవుతుంది...? అనుకుంటున్నారా..? అసలు మ్యాటర్ ఏంటీ అంటే ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు నాయుడు మీద వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టాల్సి వచ్చి, ఏపి మంత్రులు జాతీయ మీడియాలో ఇంగ్లీష్ మాట్లాడాల్సి వచ్చింది. అయితే అసలే అంతంత మాత్రం ఇంగ్లీష్ తో ఎంతగా కవర్ చేద్దామని ప్రయత్నించినా కానీ వర్కవుట్ కాలేదట. ఇంకేముంది నీళ్లు నమలడం వారి వంతైంది.చ అందుకే చంద్రబాబు నాయుడుకు ముందుంది ముసళ్ల పండగ అని అన్నాం.

అయితే ఇంగ్లీష్ రాని మంత్రులతో కొత్త తలనొప్పి వచ్చిపడుతోంది ఇంగ్లీష్ ట్యుషన్ చెప్పించలేని చంద్రబాబు నాయుడు ఓ మాస్టర్ ప్లాన్ మాత్రం వేశారు. అసలే రాజకీయాల్లో తల, గడ్డం కూడా పండిన చంద్రబాబు అసలు మంత్రులు ఎవరూ ఇంగ్లీష్ లో మాట్లాడకండి అంటూ హుకుం జారీ చేశారట. ఇక గల్లా జయదేవ్ కు మాత్రం పూర్తి స్థాయి అవకాశం కల్పించినట్లు సమాచారం. జాతీయ మీడియాలో మాట్లాడాల్సి వస్తే జయదేవ్ మాత్రమే మాట్లాడాలని, భాష మీద పట్టులేకపోవడం వల్ల లేని ఇబ్బందులు వస్తాయని చంద్రబాబు గట్టిగా నమ్ముతున్నారు కాబోలు. అయితే దీని మీద కూడా విమర్శలు వస్తున్నాయి. పాపం మంత్రులు మాత్రం ఏం చెయ్యగలుగుతారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబే.. వాట్ ఐయమ్ సేయింగ్ అంటూ నీళ్లు నమిలారని అలాంటప్పుడు మంత్రులు మాత్రం ఏం చేస్తారని అంటున్నారు. మొత్తానికి చంద్రబాబు నాయుడుకు ఇంగ్లీష్ కష్టాలు వచ్చిపడ్డాయి మరి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu naidu  English  Ministers  AP  national Media  Babu  

Other Articles