TRS | Telangana | Chandrababu | Tapping | kcr | Revanth Reddy

Trs govt may get troulbes in phone tapping of chandrababu

TRS, Telangana, Chandrababu, Tapping, kcr, Revanth Reddy

TRS govt may get troulbes in phone tapping of chandrababu. Chandrababu naidu already complainted to central govt.

ట్యాపింగ్ లొ టిఆర్ఎస్ ఇరుక్కుంటోందా..?

Posted: 06/11/2015 04:10 PM IST
Trs govt may get troulbes in phone tapping of chandrababu

తెలంగాణ ప్రభుత్వం ఓటుకు నోటుకు వ్యవహారంలో ఎంతో చాకచక్యంగా వ్యవహరించింది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జరిగిన ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ కీలకనేతను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు స్టీఫెన్ సన్ తో మాట్లాడినట్లుగా  చెబుతున్న ఆడియోటేపులను విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. అయితే తాజా పరిణామాలు టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయా.? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ట్యాపింగ్ వ్యవహారంలో టిఆర్ఎస్ ఇరుక్కుంటోందా..? అంటే అవును అన్నట్లే ఉంది పరిస్థితి. అయితే ఇప్పిటికే నారా చంద్రబాబు నాయుడు కేంద్రంలో ప్రధానితో సహా, పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. తెలంగాణ ప్రభత్వం ట్యాపింగ్ కు పాల్పడింది అన్న విషయాన్ని ఆధారాలతో సహా వివరించినట్లు తెలుస్తోంది.

ఆడియో టేపుల్లో ఉన్న వాయిస్ చంద్రబాబువే నని టీఆర్ఎస్ ప్రభుత్వం గట్టిగా వాదిస్తే, ఆ ఆడియో టేపులు ఎక్కడివి? ఫోన్ ట్యాపింగ్ చేసినవా? అన్న సమాధానాలు చెప్పవలసి ఉంటుంది. ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డామంటే కేంద్ర టెలికాం మంత్రి రవి శంకర్ ప్రసాద్ కు సమాధానం ఇవ్వాలి. ఇప్పటికే ఈ విషయంలో ఆయన గుర్రుగా ఉండటమే కాకుండా, ఒక ముఖ్యమంత్రి ఫోన్ ట్యాపింగ్ చేయడం పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆ ఆడియో టేపుల్లో ఉన్న వాయిస్ చంద్రబాబువి కాదని టీఆర్ఎస్ ప్రభుత్వం మెలిక పెడితే మాత్రం రెండు రాష్ట్రాల మధ్య శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించినందున, పదేళ్ళ పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నందున హైదరాబాద్ పరిధిలో టీఆర్ఎస్ పాలన పోయి గవర్నర్ పాలన వచ్చే అవకాశం ఉంది. అప్పుడు టీఆర్ఎస్ కు మరిన్ని చిక్కులు తప్పవని చెప్పవచ్చు. రేవంత్ కేసు విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం గట్టిగా పట్టుకుంటే టీడీపీ అధినేత చంద్రబాబు కు ప్రతిపక్షాల నుంచి విమర్శలు తప్ప పెద్దగా ఒరిగేది ఏమీలేదని, ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని ఏపీ ప్రభుత్వం గట్టిగా పట్టుకుంటే మాత్రం టీఆర్ఎస్ అధినేత కెసిఆర్ తో పాటు, తెలంగాణ ప్రభుత్వానికి చిక్కులు తప్పవని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TRS  Telangana  Chandrababu  Tapping  kcr  Revanth Reddy  

Other Articles