AP cm chandrababu prepares himself for narco analysis test..?

Chandrababu gets ready to face narco test

chandrababu gets ready to face narco test, chandrababu prepares himself for narco analysis test, harikrishna interference, NTR followers, ntr son hari krishna, cashfor vote controversy case, chandrababu, chandrashekar Rao, KCR, Telangana government, Revanth reddy, Telangana TDP, Harikrishna, ntr legacy, note fot vote case, bribery case, Telangana mlc elections, stephen, nominated mla stephen, ACB, anti corruption bureau, AK Khan, KTR, nara lokesh, pavan kalyan, jr ntr, Ap government, ap cm chandrababu, ysrcp, ys jagan

As cash for vote rocks in telugu states, a doubt araises that andhra pradesh chief minister chandrababu prepares himself reasy to face narco analysis test to proove himself clean.

నార్కో పరీక్షలకు సిద్దమవుతున్న చంద్రబాబు..?

Posted: 06/08/2015 04:30 PM IST
Chandrababu gets ready to face narco test

ఓటుకు నోటు కుంభకోణం కేసులో తాను మిస్టర్ క్లీన్ నేతగా పేరు తెచ్చుకుని.. రెండు తెలుగు రాష్ట్రాలలో తెలుగు దేశం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సిద్దమవుతున్నారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. స్వర్గీయ ఎన్టీ రామారావు చేతి నుంచి తన చేతికి పార్టీ పగ్గాలు అందాక.. గత ఇరవై ఏళ్లుగా.. మునుపెన్నడూ లేని విధంగా.. పార్టీని క్రమశిక్షణలో పెట్టిన చంద్రబాబు.. పార్టీ కార్యకర్తలను సైతం క్రమశిక్షణలో వుండాల్సిందిగా పదే పదే చెప్పడంతో పాటు.. క్రమశిక్షణా రాహిత్యాన్ని పాటించిన తెలుగు తమ్ముళ్లకు వార్నింగ్ లు ఇవ్వడం.. అప్పటికీ వినకపోతే.. పార్టీ నుంచి సస్పెండ్ చేయడం లాంటి ఎన్నో చర్యలను తీసుకున్నారు. టీడీపీని అంతకంతూ బలోపేతం చేసుకుంటూ తనదైన ముద్ర వేసుకున్నారు.

అలాంటిది రాష్ట్ర విభజన జరిగిన తరువాత తాను క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడి.. తెలంగాణ ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుట్ర పన్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన సీరియస్ గా వున్నారు. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే తనపై ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేయడం పట్ల అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. అది చాలదన్నట్లు తన ఏడాది పాలనను పూర్తి చేసుకున్న క్రమంలో తనపై కక్ష గట్టి మరీ తెలంగాణ ప్రభుత్వం.. అవినీతి మకిలీ అంటించడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ తరుణంలో తాను మిస్టర్ క్లీన్ నేతగా.. కడిగిన ముత్యంలా బయటపడాలన్న తాపత్రయం బాబులో కనబడుతోంది.

తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ ముడుపుల వ్యవహారంతో చంద్రబాబు సంబాషణ పేరుతో లీకయిన ఆడియో టేపులోని మాటలు చంద్రబాబువి కావని ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ ఇప్పటికే స్పష్టం చేశారు. సీఎం సంభాషణ అంటూ... సీఎం ఎక్కడెక్కడో మాట్లాడిన మాటలు గుదిగుచ్చి ప్రజల్లో భావన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. టెలిఫోన్లు ఇంటర్‌సెప్ట్‌ చేసి, ట్యాపింగ్‌ చేసి బయటపెడితే నేరం. అక్కడక్కడ మాటలన్నింటినీ గుదిగుచ్చి చూపినా నేరమే. దీన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణిస్తోంది. దీని లోతు చూస్తాం. దీని అంతూ చూస్తాం. దీనిని మాములుగా వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు.
 
ఈ నేపథ్యంలో చంద్రబాబు తెలంగాణ మంత్రి, ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కేటీఆర్ చేసిన సవాల్ ను కూడా ఎదుర్కోనేందుకు సిద్దంగా వున్నారని సమాచారం. తనను తాను మిస్టర్ క్లీన్ నాయకుడిగా రుజువు చేసుకుంటే తప్ప.. ప్రజల్లోకి వెళ్లిన తప్పుడు సంకేతాలు తుడిచి పెట్టుకు పోవని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన నార్కో ఎలాసిస్ పరీక్షలకు కూడా సిద్దమవుతున్నారని తెలుస్తుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా, నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా కోనసాగుతున్న తనపై అపాదించిన అవినీతి మకిలీని తుడ్చుకునేందుకు చంద్రబాబు తనను తాను సిద్దం చేసుకుంటున్నారని సమాచారం.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles