APSRTC Employees cheap | government employess | RTC Unions | election promise | Tdp government

Government looks rtc employees cheap

chandrababu, Andhra Pradesh, chief minister, Apsrtc employees, government employess, RTC Unions, election promise, sakala janula samme, RTC Employees cheap, Tdp government, apsrtc employees srtike, High court

when government gives 43 percent fitment to government employees who salaries are already at peak, why can't to RTC employees questions unions

వారికిచ్చినప్పడు వీరికెందుకు ఇవ్వలేవు బాబు..?

Posted: 05/13/2015 03:35 PM IST
Government looks rtc employees cheap

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహర శైలి అయిన వారికి అకుల్లోను కాని వారికి కంచాల్లోనూ అన్నట్లు వుంది. ప్రభుత్వ ఉద్యోగులను ఒకళా మరోవైపు ఆర్టీసీ కార్మికులను మరోలా చూడటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత వారం రోజులుగా తమ డిమాండ్లను పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపడుతున్నా ప్రభుత్వం వారిని పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే కార్మికులు సమ్మె చేస్తున్న తొలిరోజు నుంచే చర్చల ప్ర్రక్రియ కోనసాగించివుంటే.. ఈ పాటికి సమస్య పరిష్కారమయ్యేదని, ప్రజలు ఇన్నాళ్లుగా ఇబ్బందులు పడుతున్నా.. అటు ప్రభుత్వం కాని, ఇటు ఆర్టీసీ యాజమాన్యం కానీ పట్టించేకోకపోవడంతోనే సమస్య మరింత జఠిలంగా తయారైందని కార్మిక సంఘాల నేతలు అరోపిస్తున్నారు.

రాష్ట్ర విభజన నేపథ్యంలో చేపట్టిన సకల జనుల సమ్మెను తాము మద్దతుగా బస్సు సర్వీసులను నిలిపేనప్పుడు మద్దతు పలికిన పార్టీ.. అధికారంలోకి వచ్చిన తరువాత ప్లేటు మార్చడంపై కూడా కార్మిక సంఘాలు భగ్గమంటున్నాయి. సమ్మె నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు తాము పాలుపంచుకున్నామన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు. మరోవైపు ఆ తరుణంలో వచ్చిన సార్వత్రిక ఎన్నికలలో తమ ఫిట్ మెంట్ బెనిఫిట్ ను పెంచుతామంటూ టీడీపీ పార్టీ తమకు హహీ కూడా ఇచ్చిందని చెప్పారు. ఈ నేపథ్యంలో తమను కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పరిగణించాలని కార్మిత సంఘాల నేతలు కోరుతున్నారు.

జీతాలు అధికంగా వుంటే ప్రభుత్వ ఉద్యోగులను అందాలన్ని ఎక్కించిన ప్రభుత్వమే.. తమను పక్కన పెడుతుందని ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు. సమ్మెకు పక్షం రోజుల ముందు నోటిసు ఇచ్చినా.. స్పందించని ప్రభుత్వాలు.. తమ సమ్మె నేపథ్యంలో ధిగివస్తాయంటున్నారు. తమ పార్టీకి చెందిన నేతలతో హైకోర్టులను ఆశ్రయించి.. కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను అణిచివేయాలని చూస్తుందన్నారు. తమను వాడుకుని వదిలేయాలని చూస్తే.. జైళ్లకు వెళ్లేందుకు కూడా సిద్దమంటున్నారు. ఇక ఇప్పుడు ప్రభుత్వం దిగివచ్చి తమ డిమాండ్లను పరిష్కరించినా.. అది తమ సమ్మె గెలుపు అవుతుందే కానీ.. ప్రభుత్వ గోప్పతనంగా మారదని కూడా అంటున్నారు కార్మిక సంఘాల నేతలు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : high court  rtc  employees  apsrtc srtike  

Other Articles