bjp calm over smriti irani hidden camera case ! Goa ! FabIndia store

Smriti irani hidden camera case calm down

Smriti Irani, FabIndia, Ministry of Human Resource Development (MHRD), Micheal Lobo, Goa, CCTV cameras, Crimes against women, violence against women, popular clothing chain FabIndia., Smriti Irani hidden camera changing room, Fabindia store in Candolim

An FIR has been registered in Goa after union HRDr Smriti Irani spotted a hidden camera inside a changing room at an outlet of popular clothing chain FabIndia.

స్మృతిఇరానీ కెమెరా కేసు.. చల్లారిందా.? చల్లార్చారా..?

Posted: 04/06/2015 03:54 PM IST
Smriti irani hidden camera case calm down

అది సరిగ్గా గుడ్ ఫ్రైడే.. రెండు రోజుల సెలవుపై వెళ్లిన కేంద్రమంత్రి స్మృతి ఇరానీ గోవాలోని ష్యాబ్ ఇండియా షాపింగ్ మాల్ లోకి వెళ్లి.. రహస్య కెమెరాను కనిపెట్టి.. దానిపై పోలీసులకు పిర్యాదు చేసింది. అ రోజుకు అది హాట్ టాపిక్.. ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతున్నాయిన దేశంమంతా వినిపించేలా కోడై కూసింది మీడియా. సరిగ్గా రెండు రోజులు గడిచి ఈస్టర్ వచ్చేసరికి చట్టుకున్న చల్లారింది. ఎందుకిలా జరిగింది..? ఇలాంటి కేసుపై కనీసం వారం పదిరోజుల పాటు కథనాలు, ప్రత్యక కథనాలతో ప్రసారం చేసే మీడియా.. స్వయంగా కేంద్రమంత్రికే ఇలాంటి ఘటన ఎదురైనా సోంత ఎంపీ, కేంద్ర మంత్రిని పార్టీ, పార్టీ నేతలు వదిలేయడానికి కారణమేంటి..? పార్టీయే ఇందుకు కారణమా..? లేక ఫ్యాబ్ ఇండియా బీజేపికి గుప్త దాత..? ఏమిటీ కారణం..?

స్మృతి వ్యవహారంలో అంటీముట్టనట్టుగానే వ్యవహరించింది. సరిగ్గా అదే రోజు ( ఏప్రిల్ 3న ) బెంగళూరులో బీజేపీ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభకావడం.. దానిని పక్కకు పెట్టిన మీడియా స్మృతి ఇరానీ కేసుపైనే అధిక ప్రాధాన్యత కేంద్రీకరించింది. కేంద్ర మంత్రి హోదాలో అమె ఎదుర్కొన్న పరిణామం.. ఎలాంటి హోదాలేని ఎందరో అమ్మాయిలో కూడా ఎదుర్కోంటున్నారని మీడియా కథనాలను ప్రసారం చేసింది. అయితే స్మృతి ఎపిసోడ్ పై స్పందిస్తే.. జాతీయ సమావేశాలపై నుంచి దృష్టి యావత్తు.. పక్కకు సడలుతుందని అటు పార్టీ కానీ, ఇటు మంత్రులు కానీ, కనీసం కేంధ్ర హోం శాఖ కూడా పట్టించుకోలేదు.

సరిగ్గా శనివారం సీన్ మారింది ఫ్యాబ్ ఇండియా యాజమాన్యం తమ దుకాణంలో కెమెరాలు లేవని స్పష్టం చేసింది. ఘటన రోజు అరెస్టయిన నలుగురు ఉద్యోగులకు కూడా తెల్లవారి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. అయితే మరోవైపు ఫ్యాబ్ ఇండియా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి క్షమాపణలు చెప్పారు. ఎందుకిలా సీన్ మొత్తం మారిందో తెలియదు. ఇదిలావుండగా, ఘటన జరిగిన రోజున గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు అదేశాలు ఇచ్చిన మరుసటి రోజున మాట మార్చారు. వస్త్రాలు మార్చుకునే గదిలో కావాలని కెమెరాలు పెట్టినట్టు లేదని, అంతకుముందు కూడా వెళ్లిన మహిళలు ఆ గదిలోకి వెళ్లారని చెప్పారు. అనుకోకుండా అలా జరిగి ఉండొచ్చునని వ్యాఖ్యానించారు.

ఇదిలా వుండగానే సీన్‌లోకి ప్రవేశించిన బీజేపీ అధికార ప్రతినిధి మీనాక్షి లేఖి.. ఈ ఘటనలో బీజేపీ వైఖరిని ఆమె పరోక్షంగా బయటపెట్టారు. ‘‘పనికిరాని అంశాలను ముందుకు తీసుకువచ్చి పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల ప్రాధాన్యం తగ్గించే ప్రయత్నం ఏమైనా జరుగుతోందా..’’ అని ఆమె ట్వీటర్‌లో పేర్కొన్నారు. అంటే కేవలం తమ జాతీయ సమావేశాల కోసమే అంశంపై ప్రాధాన్యత తగ్గిందా..? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. కాగా గత పది నెలల క్రితం జరిగిన ఎన్నికలలో ఫ్యాబ్ ఇండియా అధినేత అమెరికన్ విలియమ్ బిసెల్లీ బీజేపి గుప్తదాతగా వ్వవహరించి వుంటారా..? అందుకే ఈ కేసును సాధ్యమైతనంత త్వరగా అటెకెక్కించారా..? అన్న అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Smriti Irani  FabIndia  hidden camera  Goa  FabIndia store  

Other Articles