PM's 2nd Cabinet Reshuffle Soon, PDP Chief Maybe Nominated

Cabinet reshuffle likely soon 3 ministers of state may be elevated sources

union cabinet reshuffle, 3 Mos likely to get elevated, PM's 2nd Cabinet Reshuffle Soon, PDP Chief, PM Narendra modi cabinet reshuffle, Mukhtar Abbas Naqvi, Rajiv Pratap Rudy, Manoj Sinha, Minority Affairs Minister Najma Neptullah, Shiv Sena MP Anil Desai, united National Democratic Alliance,

Ministers of State Mukhtar Abbas Naqvi, Rajiv Pratap Rudy and Manoj Sinha are likely to be included in the Modi Cabinet, said sources, adding Minority Affairs Minister Najma Neptullah may be dropped.

విస్తరణ దిశగా మోడీ క్యాబనెట్..? నజ్మా ఔట్..?

Posted: 04/04/2015 05:50 PM IST
Cabinet reshuffle likely soon 3 ministers of state may be elevated sources

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోమారు తన మంత్రివర్గంలో మార్పలు, చేర్పులతో కూర్ప చేయనున్నారు. సరిగ్గా పది నెలల మాసంలో ఆయనతో పాటు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు ముందు మరోమారు మంత్రివర్గ విస్తరణ చేపట్టారు. ఇప్పుడు తాజాగా రెండోసారి మంత్రివర్గాన్ని విస్తరించనున్నారని వార్తలు అందుతున్నాయి. వచ్చేవారం ఆయన యూరప్, కెనడా దేశాల్లో పర్యటించనున్నారు. దాంతో విదేశీ పర్యటనకు ముందే మంత్రి వర్గంలో  కొన్ని మార్పులు చేయాలని మోదీ భావిస్తున్నట్లు పార్టీ సీనియర్ నేత ఒకరు శనివారం తెలిపారు. కేంద్ర సహాయ మంత్రులు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, రాజీవ్ ప్రతాప్ రూడీ, మనోజ్ సిన్హాలను కేబినెట్ లోకి తీసుకొనున్నట్లు తెలుస్తోంది.

తన కేబినెట్ లోకి బీజేపీతో పాటు మిత్రపక్షాలు  శివసేన, పీపుల్స్ డెమక్రటిక్ పార్టీల నేతలకు చోటు కల్పించాలని యోచిస్తున్నట్లు పార్టీ నేత ఒకరు చెప్పారు. శివసేన ఎంపీ అనిల్ దేశాయ్ కి చోటు దక్కుతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో పాటు పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీకి కూడా స్థానం దక్కనుందని సమాచారం. ఇక తొలి క్యాబినెట్ విస్తరణలో భాగంగా అప్పటి కేంద్ర మంత్రి సదానంద గౌడ తన కేంద్ర మంత్రి పదవిని కోల్పోగా, ఈ పర్యాయం మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి నజ్మా హెఫ్తుల్లాకు పదవి గండం వున్నట్లు వార్తలు అందుతున్నాయి.

పార్లమెంట్ బడ్జెట్ మొదటి విడత సమావేశాలలో కీలకమైన భూసేకరణ సవరణ బిల్లు ప్రవేశపెట్టగా రాజ్యసభలో ఇబ్బందులు తలెత్తాయి. కాగా, రెండో విడత బడ్టెట్ సమావేశాలు యునైటెడ్ నేషనల్ డెమోక్రటిక్ కూటమిగా జరగాలని బీజేపీ ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆ పార్టీ నేత ఒకరు తెలిపారు. గత డిసెంబర్ లో జరిగిన మంత్రి వర్గ విస్తరణలో రక్షణ మంత్రి మనోహర్ పారికర్ సహా 21 మంది కొత్త వాళ్లకు మంత్రివర్గంలో చోటుకల్పించిన విషయం తెలిసిందే. ప్రస్తుత మంత్రివర్గంలో మోదీతో సహా 27 మంది కేబినెట్, 26 మంది స్వతంత్ర, 13 మంది సహాయ హోదా మంత్రులున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cabinet reshuffle  3 Ministers of State  Pm narendra modi  

Other Articles