Ap cm chandrababu naidu facing anganwadi strike

anganwadi, ap, chandrababu, aasha, protest, rally, hyderabad, inderapark

ap cm chandrababu naidu facing anganwadi strike. in ap anganwadi protesters demand to increase the salarys as per telanagana govt did. last time when babu on power he compressed the anganwadi strike.

చంద్రబాబుకు అంగన్ వాడీల గండం ఉందా..?

Posted: 03/17/2015 03:56 PM IST
Ap cm chandrababu naidu facing anganwadi strike

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అంగన్ వాడిల మధ్య గతంలో జరిగిన వార్ గురించి అందరికి తెలుసు. తమ వేతనాలను పెంచాలని అంగన్ వాడిలు చేసిన ఆందోళనలను కఠినంగా అణచివేశారు చంద్రబాబు. అప్పుడు అంగన్ వాడిలు, విద్యుత్ కోసం రైతులు చేసిన ఉద్యమాలను అణిచివేసి వార్తల్లో కెక్కారు. తరువాత ఎన్నికల్లో దాని ప్రభావాన్ని కూడా చూశారు. అయితే పదవికి చాలా కాలం దూరమైన చంద్రబాబు మళ్లీ ఇప్పుడు అంగన్ వాడిల పోరుబాటతో కాస్త భయంగా ఉన్నట్లున్నారు. తెలంగాణ ప్రభుత్వం అంగన్ వాడీ టీచర్లకు 2800, అంగన్ వాడీ ఆయాలకు 2050 మొత్తాన్ని ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో అంగన్ వాడిలకు పెంచిన జీతాల్లాగా మాకూ జీతాలు పెంచాలంటూ ధర్నాలకు దిగుతున్నారు.

తెలంగాణ రాష్ట్రం అంగన్ వాడిల గురించి ప్రకటనలు చేస్తున్నా,ఇంతవరకు ఏపి ప్రభుత్వం ఎలాంటి చర్యలకు పూనుకోకపోవడంపై ఆంధ్రప్రదేశ్ అంగన్ వాడీలు మండిపడుతున్నారు. అందుకే వారు ఆంధ్రప్రదేశ్ శాసనసభను ముట్టడించడానికి పిలుపునిచ్చారు. తమకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున అంగన్ వాడీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి హైదరాబాద్ తరలివచ్చారు. సుందరయ్య పార్క్అంగన్ వాడీలను అరెస్టు చేశారు. ఇందిరా పార్క్ , హిమాయత్ నగర్, బషీర్ బాగ్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద పోలీసులు అంగన్ వాడీలను అరెస్టు చేశారు. అయితే గతంలో ఓ సారి అంగన్ వాడీల దెబ్బను రుచి చూసిన చంద్రబాబు మరి ఈ సారి ఎలా మసులుకుంటారా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఒకవేళ బాబు వైఖరిలో ఎలాంటి మార్పు లేకపోతే పదవిపోటు ఖాయం అని గుసగుసలు వినిపిస్తున్నాయి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : anganwadi  ap  chandrababu  aasha  protest  rally  hyderabad  inderapark  

Other Articles