Is mim party deferences from trs party

trs, mim, muslims, telanagana, assembly, budget

is mim party deferences from trs party?. on the telanagana assembly sessions mim party mla and mim main leader akbaruddin fire on trs for new budget. mim oppose the budget.

నిన్న భాయ్ భాయ్.. నేడు నై.. నై??

Posted: 03/16/2015 04:08 PM IST
Is mim party deferences from trs party

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి, ఎంఐఎం పార్టీకి మధ్య ఎన్నికల ముందు నుండి మంచి స్నేహసంబందాలు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటు సందర్భంగా కూడా కెసిఆర్ ఓవైసీ సోదరులకు అందరి కన్నా ఎక్కువే ప్రధాన్యత ఇచ్చారు. లోక్ సభ ఎన్నికల్లో మోదీ నాయకత్వంలో చేరకుండా ముస్లిం మైనార్టీలకు చేరువ అయ్యేందుకు చేసిన టిఆర్ఎస్ చేసిన ప్రయత్నాలు రెండు పార్టీల మధ్య దూరాన్ని బాగా తగ్గించింది. అందుకే రెండు పార్టీల మధ్య సానిహిత్యం కూడా పెరిగింది. అయితే తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కెసిఆర్ ఎన్నిక తర్వాత హైదరాబాద్ అభివృద్దిపై, అందులో చార్మినార్ పాత బస్తీ ప్రాంతంపై మరింత దృష్టి సారించారు.

ఓవైసీ సోదరులకు, వారి పార్టీకి ఎక్కువ పట్టున్న ప్రాంతాల అభివృద్దికి ఎక్కువ నిధులను విడుదల చేస్తూ తెలంగాణ ప్రభుత్వం వేగంగా నిర్ణయాలను కూడా తీసుకుంది. అలా రెండు పార్టీలకు చెందిన నేతలు నిన్నటి దాకా పాలు నీళ్లలా కలిసిపోయారు. అయితే తెలంగాణ శాసనసభలో బడ్జెట్ గురించి జరుగుతున్న చర్చ రెండు పార్టీ మధ్య దూరం పెరిగిందా అనే అనుమానాన్ని లేవనెత్తుతోంది. టిఆర్ఎస్ కు మిత్రపక్ష్యంగా బావిస్తున్న ఎంఐఎం పార్టీకి చెందిన అక్బరుద్దీన్ ఓవైసీ తెలంగాణ బడ్జెట్ పై పెదవి విరవడం సభలో అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. తెలంగాణ సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ గత బడ్జెట్ కు కాపీ అని అన్నారు. పాత విషయాలనే మళ్లీ ప్రస్తావించారని అన్నారు. అయితే నిన్నటి దాకా మిత్రపక్షంగా భావించిన ఎంఐఎం కి చెందిన కీలక నేత అక్బరుద్దీన్ ఓవైసీ ఇలా టిఆర్ఎస్ సర్కార్ పై విమర్శలకు దిగడం కొత్త చర్చకు దారిస్తోంది. టిఆర్ఎస్, ఎంఐఎం పార్టీల మధ్య దూరం పెరుగుతుందా అనే అనుమానాలను రేకెత్తించింది. మరి ఈ అనుమానాలు నిజమా కాదా అని ఓ క్లారిటీ రావాల్సి ఉంది.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : trs  mim  muslims  telanagana  assembly  budget  

Other Articles