Law and order under control of governor narasimhan in hyderabad

Governor ESL Narasimhan, , Special Power, GHMC, Law and Order, Internal Security, Common Capital, Law And Order Under Control Of Governor Narasimhan In Ghmc, kcr, trs praty, cm kcr, telangana cm kcr,

law and order under control of governor narasimhan in hyderabad: Andhra Pradesh E S L Narasimhan to gain control over law and order, internal se. ... under Greater Hyderabad Municipal Corporation (GHMC) limits

భాగ్యనగరంలో పవర్ బాస్ రిలీజ్ !

Posted: 08/09/2014 10:21 AM IST
Law and order under control of governor narasimhan in hyderabad

భాగ్యనగరంలో పవర్ బాస్ రిలీజ్ అయ్యింది. కేంద్రం నుండి హక్కులు సంపాదించుకున్న నయా పవర్ బాస్ గా భాగ్యనగరంలో హల్ చల్ చేయటానికి సిద్దమవుతున్నాడు. ఇంతకీ ఆ నయా పవర్ బాస్ ఎవరో కాదు.. రాష్ట్ర విభజన సమయంలో ముఖ్యపాత్ర పోషించిన పాలిటిక్స్ తో తలపండిన గవర్నర్ నరసింహన్.

ఉమ్మడి రాష్ట్రానికి గవర్నర్ గా.. తెలుగు ప్రజలకు సేవలు అందిస్తున్నాడు. భక్త కన్నప్పగా మంచి పేరు తెచ్చుకున్న గవర్నర్ నరసింహన్ కు కేంద్రం స్పెషల్ పవర్స్ ఇవ్వటం జరిగింది. గులాబీ నేతలకు, టీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటూ.., ఉచిత సలహా ఇస్తూ..రహస్యంగా తెలంగాణ పై ప్రేమ కురిపిస్తున్న విషయం తెలుగు ప్రజలకు తెలుసు. అలాంటి గవర్నర్ నరసింహన్ కు భాగ్యనరగం పై పవర్ ఇవ్వటంతో తెలగాణ సర్కార్ సీరియస్ అవుతుంది.

భాగ్యనగరం పవర్ బాస్ పై.. గులాబీ నేతలు మండిపడుతున్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం మంచిదికాదని అంటున్నారు.

* ఉమ్మడి రాజధానిలో నివసిస్తున్న ప్రజల ఆస్తుల రక్షణకు సంబంధించి హైదరాబాద్, రంగారెడ్డి కలెక్టర్లు, జీహెచ్‌ఎంసీ కమిషనర్లతో ఫిర్యాదుల విభాగం ఏర్పాటుచేయాలి. ఫిర్యాదుదారుల ఆస్తుల రక్షణ, హక్కులపై ప్రభుత్వ అధికారులకు గవర్నర్ అవసరమైన ఆదేశాలు జారీచేస్తారు. వాటిని అమలుకు చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరారు. ఈ లేఖ ప్రతిని గవర్నర్ ప్రత్యేక కార్యదర్శికీ పంపారు.

governor-narasimhan-power

* తెలంగాణ డీజీపీ హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లతో పోలీసు సర్వీస్ బోర్డును ఏర్పాటు చేయాలి. ఈ బోర్డు ద్వారానే డీసీపీలు, ఏసీపీలు, ఎస్‌హెచ్‌ఓల వరకు బదిలీలు, పోస్టింగ్‌లు ఇవ్వాలి. ఈ బోర్డు చేసిన ప్రతిపాదనలపై గవర్నర్ సలహాలు, సూచనలతో మార్పులు చేసే అధికారం గవర్నర్‌కు ఉంటుంది.

* అత్యవసర పరిస్థితుల్లో బలగాల మోహరింపుపై గవర్నర్ చేసే సూచనలను టీ సర్కారు పరిశీలించి మళ్లీ గవర్నర్‌కు పంపించాలి. దీనిపై గవర్నర్‌దే తుది నిర్ణయం. ఉమ్మడి రాజధాని పరిధిలో చట్టాల ఏర్పాటు, కమిషన్ల నియామకం, చట్టాల్లో సెక్షన్ల తొలగింపునకు సంబంధించిన నివేదికను చట్టప్రకారం చర్యలు తీసుకునే అధికారం గవర్నర్‌కు ఉంటుంది. చట్టాల రూపకల్పన, కమిషన్ల ఏర్పాటునకు సంబంధించి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై నివేదిక కోరే అధికారం ఉంటుంది.

* అంతర్గత భద్రత, ముఖ్య సంస్థల రక్షణకు జంట కమిషనరేట్లలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి వీరందరిపై సీనియర్ అధికారిని నియమించాలి. ఈ సెల్ సున్నితమైన సంస్థలను గుర్తించి తెలంగాణ ప్రభుత్వం ద్వారా గవర్నర్‌కు నివేదించాలి. ప్రస్తుతం ఈ సంస్థలకు ఎస్‌పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్ ద్వారా కల్పిస్తున్న సెక్యూరిటీని సమీక్షించి, పటిష్ట భద్రతను కల్పించాలి. రక్షణ బలోపేతానికి గవర్నర్ చేసే సూచనలను విధిగా అమలు చేయాలి. ఇందుకోసం సీనియర్ అధికారిని నియమించి భద్రతా పరిస్థితిని ఎప్పటికప్పుడు గవర్నర్‌కు నివేదించాలి.

* ఆ రెండు కమిషనరేట్లలో ఐజీ ర్యాంకుకు తగ్గని సీనియర్ అధికారులతో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలి. వీరితోపాటు రంగారెడ్డి ఎస్పీ కార్యాలయంలోనూ ఏర్పాటు చేయాలి.

governor-power

* బలవంతపు వసూళ్లు, విద్వేషాలు రెచ్చగొట్టే నేరాలపై సత్వర విచారణ నిర్వహించాలి. కోర్టుల్లో వేగంగా విచారణ జరిగేలా చర్య తీసుకోవాలి. ఈ సెల్‌లోని అధికారుల సెల్‌ఫోన్ నంబర్లతోపాటు, చిరునామాలకు విస్తృత ప్రచారం కల్పించాలి.

* అవసరాన్ని బట్టి ఉద్యోగుల తాత్కాలిక పద్ధతిలో పునర్నియామకానికి ప్రభుత్వాన్ని గవర్నర్ కోరవచ్చు. ఇరు రాష్ట్రాలకు భవనాల కేటాయింపునకు సంబంధించి ఉన్నతస్థాయి అధికారుల కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం సలహాలతో గవర్నర్ నిర్వహణ సాగిస్తారు.

భాగ్యనగరంలో పవర్ బాస్ విడుదలపై ఆంద్ర నేతలు ఆనందం వ్యక్తం చేయటం లేదు. దానికి కారణం ఉందని టిడిపి నేతలు బలంగా అంటున్నారు. పవర్ గవర్నర్ చేతిలో ఉన్న.. తెలంగాణ ముఖ్యమంత్రి చేతిలో ఉన్న ఒక్కటే.. నగరంలో ఎలాంటి మార్పులు ఉండని నగరంలోని ప్రజలు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles