Indian youth congress mp rajeev satava congress party love story

congress party youth president rajeev satava, congress leader rajeev satava news, rajeev satava comments congress party, indira gandhi news, sonia gandhi news, rahul gandhi news, rajeev satava comments indira gandhi, modi twitter sarkar, rajeev satava comments bjp party

indian youth congress mp rajeev satava congress party love story : The Indian Youth Congress and Mp Rajeev Satava creates a new sensation love story of his own on congress party. he criticised the natwar singh book comments

‘‘కాంగ్రెస్’’ నాయకుడి వింత ‘‘ప్రేమకథ’’!

Posted: 08/05/2014 02:55 PM IST
Indian youth congress mp rajeev satava congress party love story

కాంగ్రెస్ పార్టీలో మనం గతం కామరాజుల కథలు, వారు చేసిన అక్రమాల కథల గురించి చాలానే విన్నాం!!! కానీ ప్రస్తుతం చర్చించుకోబోయే ఒక నాయకుడి ప్రేమకథ మాత్రం కొంచెం వింతగా వుంటుంది! ఆయన ఏం చెప్పబోతున్నాడో.. ఏం చెబుతున్నాడో.. అసలెందుకు చెబుతున్నాడో.. ఆయన ఉద్దేశం ఏమిటి..? అన్న విషయాలు మాత్రం ఎవ్వరికి తలకెక్కవు! జరిగిన విషయాలను మళ్లీ మళ్లీ తెరపైకి తీసుకొస్తూ.. జరగని విషయాలులాగా మాట్లాడి కాంగ్రెస్ పార్టీ మీద తనకున్న ప్రేమాభిమానం ఏంటో నిరూపించుకున్నాడు. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే... ఇతను ప్రేమిస్తున్నది ఏ మహళనో, అమ్మాయినో కాదు... తాను నాయకుడిగా కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీని!

ఇండియన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎంపీ అయిన రాజీవ్ సటావా... తనకు కాంగ్రెస్ పార్టీ అంటే ఎంత అభిమానమో, ఎంత ప్రేముందో నిరూపించుకోవడానికి నానాతంటాలు పడ్డారులెండి! ‘‘అప్పుడు ఇందిరాగాంధీని విమర్శించారు... తర్వాత సోనియా గాంధీని... అనంతరం ఇప్పుడు తాజాగా రాహుల్ గాంధీని విమర్శిస్తూనే వున్నారు. ఇలా చేయడం ఎంత న్యాయమో మీరే చెప్పండి’’ అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని కొంతమంది కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన పరోక్షంగా అన్నిపార్టీలవారిని ఆరోపించారు.

ఇటీవల నట్వర్ సింగ్ పుస్తకంలో సోనియా, రాహుల్ ప్రస్తావన దేశంలో పెద్ద దుమారంగా అయిన సందర్భంలో కాంగ్రెస్ వర్గాలు ఎదురుదాడికి దిగిన సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలోనే సటావా మీడియాతో మాట్లాడుతూ... తమకు సోనియా, రాహుల్ అన్ని విషయాల్లోనూ మార్గదర్శకులుగా తమ విధేయతను చాటుకున్నారని, అటువంటి నాయకులు ఎక్కడా లభించరని ఆయన ప్రకటించేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకోసం ఎన్నో పథకాలను అమలు చేసిందని... పెద్దపెద్ద సిటీలను అభివృద్ధి చేయడంలో కాంగ్రెస్ దే కీలకపాత్రని ఆయన వెల్లడించారు.

‘‘1977లో షా కమిషన్ సాయంతో ఇందిరాగాంధీని వేధించారు. 1999లో సోనియా స్థానికతను ప్రశ్నించారు. ఇప్పుడు తాజాగా రాహుల్ గాంధీని లక్ష్యం చేసుకుని తిట్టరాని తిట్లు తిడుతున్నారు. మాపై దాడి జరిగిన ప్రతిసారి మేము ధీటుగానే నిలబడ్డాం. ఇదే కాంగ్రెస్ పార్టీ బలం’’ అని సటావా వివరించారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రతి అంశంపైనా నియంత్రణకోసం పాకులాడుతోందని.. పేదలకోసం కాకుండా ‘‘ట్విటర్ సర్కార్’’లా తయారైందని ఆయన బిజేపీని విమర్శించారు. సామాన్యుడిని ప్రభావితం చేసే ప్రతి అంశంపైనా తాము ముందుండి పోరాడుతామని ఆయన పేర్కొన్నారు.

గతంలో జరిగిన విషయాలు, కాంగ్రెస్ పార్టీ మీద వెల్లువెత్తుతున్న విమర్శల విషయాల గురించి ఆయన వివరించడం బాగానే వుంది కానీ... ఆయన ఏ ఉద్దేశంతో ఇలా వ్యాఖ్యానించాడో అర్థం కావడం లేదురో ముర్రో అంటూ రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ఏదేమైనా.. ఈయనకు కాంగ్రెస్ పార్టీ మీద ఎంత అభిమానం వుందో... ఆ పార్టీ మీద తనకెంత ప్రేముందో ఇలా మాటల ద్వారా వ్యక్తపరిచాడని అనుకుంటున్నారు. దీంతో అందరూ... అందరూ కాంగ్రెస్ నాయకుడిలాగే ఇతనిది కూడా ఇదో వింత కథ అంటూ అందరూ గుసగుసలాడుకుంటున్నారు!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles