Priyanka gandhi dominating rahul gandhi congress party

Rahul gandhi latest news, Indian national congress party, congress party senior leaders, congress party news, priyanka gandhi latest news, priyanka gandhi rahul gandhi, problems to rahul gandhi, rahul gandhi vice president, sonia gandhi latest news, sonia gandhi rahul gandhi, sonia gandhi priyanka gandhi

Priyanka gandhi dominating rahul gandhi congress party : The vice-president of indian national congress party Rahul gandhi facing problems from his own party senior leaders. And some rumours coming out that priyanak gandhi may lead party in the place of rahul gandhi because rahul failed to improve the party and attract the people

రాహుల్ గాంధీని అడ్డుపడుతున్న మహిళ ఎవరు..?

Posted: 08/05/2014 12:50 PM IST
Priyanka gandhi dominating rahul gandhi congress party

కాంగ్రెస్ పార్టీలో నవయువ యోధుడిగా,  ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా పదవిని చేపట్టిన రాహుల్ గాంధీని రానురాను ఇబ్బందులు మరీ ఎక్కువగా పెరిగిపోతున్నట్టు కనిపిస్తున్నాయి. ఇంతవరకు పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగానే కాలం గడుపుతున్న ఈ యువ నాయకుడికి ఇప్పుడు ఓ మహిళ నుంచి ఎక్కువ సమస్యలు వచ్చి పడుతున్నాయి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా పరాజయం చెందిన కాంగ్రెస్ పార్టీ... ఇంకా ఆ షాక్ నుంచి కోలుకోకముందే రాహుల్ గాంధీకి ఒక మహిళ రూపంలో కష్టాలు ఎదురయ్యాయి. నిన్నమొన్నటివరకు ఈయనే కాంగ్రెస్ వారధి అని అనుకున్న నేపథ్యంలో... ఒక మహిళ దానిని చెరిపేసేలా కనిపిస్తోంది. ఆమె ఎవరో కాదు... స్వయానా రాహుల్ గాంధీ చెల్లెలు ప్రియాంకా గాంధీ!!

ఇటీవల సార్వత్రిక ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీ అస్తత్వాన్నే సవాల్ చేస్తున్నట్టు కనిపిస్తున్నాయి. ఎందుకంటే... ఆ ఎన్నికల ఫలితాల ప్రభావంతో కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది నాయకులు వున్నప్పటికీ.. లోక్ సభలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని స్థితిలో వుంది. ఏం చేయాలో కూడా తెలియక నాలుగువైపులా బిక్కుబిక్కుమంటూ ఇతర పార్టీల పొత్తుకోసం బేల చూపులు చూస్తోంది. కానీ కాంగ్రెస్ తో పొత్తు కాదుకదా... మద్దతునివ్వడానికి కూడా ఏ పార్టీ ముందుకు రావడం లేదు. దీంతో కాంగ్రెస్ పార్టీలో అంతర్మథనం మొదలైపోయింది. పార్టీలో కొత్తగా ఏమైనా మార్పులు తీసుకొస్తేనే తిరిగి పుంజుకోవచ్చుననే భావనను వ్యక్తం చేస్తోంది.

ఈమేరకు కొంతమంది సీనియర్ నాయకులు ‘‘పార్టీకి కొత్త గ్లామర్ తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతో వుందని’’ కాంగ్రెస్ పార్టీ అధినేత్రిని సోనియాను కలిసి వివరించారని సమాచారం! ఇన్నాళ్లవరకు ప్రత్యక్ష పార్టీ కార్యకలాపాలకు దూరంగా వున్న ప్రియాంకగాంధీని... తమ పార్టీలో కీలకపాత్ర పోషించేలా చేయాలని కొంతమంది నేతలు ఒక కొత్త వ్యూహం పన్నుతున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి గ్రౌండ్ వర్క్ కూడా పూర్తయిపోయిందని స్పస్టంగా వార్తలు వెలువడుతున్నాయి. ఎలాగైనా ప్రియాంకగాంధీని పార్టీ బాధ్యతలు అప్పగించేలా చేయాలని కాంగ్రెస్ నేతలు పూర్తిగా శ్రమిస్తున్నట్టు కనిపిస్తోంది.

కాంగ్రెస్ పార్టీని నడిపించడంలో రాహుల్ గాంధీ పూర్తిగా విఫలం అయ్యారని... ప్రజలను ఆకట్టుకోవడంలో ఆయన ఛరిష్మా అస్సలు పనిచేయలేదని గతంలో కొంతమంది సీనియర్ నాయకులు వ్యాఖ్యలు గుప్పించిన సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీని పార్టీ నుంచి పక్కకు తప్పించి... ప్రియాంకను మెయిన్ ట్రాక్ పై నడిపించేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తున్నట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. రాహుల్ గాంధీ ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకుని, తన గ్లామర్ చెల్లెలకు అప్పగించాల్సిందేనని ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరు గుసగుసలాడుకోవడం మొదలుపెట్టేశారు కూడా! అయితే... ఇవన్నీ కేవలం వదంతులేనని... రాహుల్ గాంధీ నాయకత్వంలోనే ప్రియాంక పనిచేస్తుంది తప్ప... ఆయనను పోటీగా ప్రియాంక బరిలోకి రావడం లేదని పార్టీ పెద్దలు ప్రెస్ మీట్ లు పెట్టి మరీ స్పష్టం చేస్తున్నారు.

ఇదిలావుండగా... త్వరలోనే నాలుగు ప్రధాన రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం కూడా విదితమే! ఈ ఎన్నికల సందర్భంలోనే ప్రియాంక, రాహుల్ గాంధీకి మధ్య వ్యత్యాసం ఏంటో తెలిసిపోతుందని కొంతమంది ప్రముఖులు చర్చించుకుంటున్నారు. ఈ ఎన్నికల అనంతరం ప్రియాంకకు పార్టీ ప్రధాన కార్యదర్శి లేదా ఉత్తరప్రదేశ్ ఇన్ ఛార్జ్ గా బాధ్యతలు అప్పజెప్పే అవకాశాలు పూర్తి వున్నాయని పార్టీ నుంచి స్పష్టంగా వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఈ ఎన్నికల్లో ప్రియాంకకు మంచి ఆదరణ లభిస్తే.. రాహుల్ గాంధీ రాజకీయాల నుంచి తప్పుకోవడం ఖాయమని కొంతమంది విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వ్యవహారం ఎంతవరకు నడుస్తుందో చూడాలి..?

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles