తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. సీమాంద్ర ముఖ్యమంత్రిగా పదవి చేపట్టే సమయంలోపు.. తన పార్టీ ఎంపీలకు కొన్నిసరికొత్త షరతులు పెట్టినట్లు తెలుస్తోంది. గెలిచిన ఆనందంలో పండగ చేసుకుంటున్న ఎంపీలు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. అంతేకాకుండా చంద్రబాబు పెట్టిన షరతూ..పార్టీలో ప్రతి ఒక్కరి పాటించాలని స్టాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు పార్టీ కార్యకర్తలు ఎన్టీఆర్ భవన్ లో చెవులు కోరికేసుకుంటున్నారు.
సీమాంద్ర ప్రజలు కూడా బాబు పెట్టిన షరతూలకు ఓకే చెప్పటంతో.. ఆ పార్టీ ఎంపీలు ఇప్పుడు పరుగులు తీస్తున్నారు. సీమాంద్ర నాయకులపై కేంద్రం చూసిన చిన్న చూపు.. భవిష్యత్తులో ఎవరికి జరగకూడదనే ఉద్దేశంతో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పార్టీలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు బాబు షరతూలకు సిద్దయ్యారు.
గతంలో చంద్రబాబు నాయుడు బావమరిది అయిన హరిక్రిష్ణకు .. పార్లమెంట్ లో జరిగిన అవమానమే బాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన పై పార్లమెంట్ లో చర్చ జరుగుతున్న సమయంలో.. హరిక్రిష్ణ , తెలుగు లో మాట్లాడటం, స్పీకర్ అభ్యతరం చెప్పటం, ఇతర రాష్ట్రాల నాయకులు నవ్వటం లాంటి చర్యలు భవిష్యత్తులో జరగకూడదని ఉద్దేశంతో.. బాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీలోని సీనియర్ నాయకులు అంటున్నారు.
ఇక నుండి టిడిపి ఎంపీలు., ఎమ్మెల్యేలు.. తెలుగు భాషతో పాటు.. హిందీ, ఇంగ్లీష్ తప్పనిసరిగా మాట్లాడాలి, చదవాలి? నేషనల్ మీడియా ముందు హిందీలోనే మాట్లాడాలని బాబు ప్రధాన షరతూ పెట్టడంతో పార్టీలోని ఎంపీలకు, ఎమ్మెల్యేలకు తెలుగు బాషతో ఇతర బాషలు కూడా ముఖ్యమని అర్థమైంది. దీంతో ఇప్పుడు పార్టీలోని నాయకులు హిందీ నేర్చుకోవటానికి సిద్దమయ్యారు అంతేకాకుండా.. మోడీ సహకారంతో.. ఢిల్లీ నుండి ..కొంతమంది హిందీ పండితులను సీమాంద్రకు వచ్చినట్లు తెలుస్తోంది.
దీంతో సీమాంద్రలోని తెలుగుదేశం పార్టీ కార్యలయల్లో హిందీ క్లాసులు నిర్వహిస్తున్నట్లు పార్టీలోని సీనియర్ నాయకులు అంటున్నారు. హిందీ తప్పనిసరిగా నేర్చుకోవాలని చంద్రబాబు పట్టుపట్టడంతో.. ఎంపీలకు , ఎమ్మెల్యేలకు కొత్త కష్టాలు వచ్చినట్లు కనబడుతుంది. కొంతమంది ఈ వయసులో మాకు హిందీ బాష అవసరమా? అని బాబు ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
దీంతో చంద్రబాబు తమ నేతలకు.. గతంలో తెలంగాణ నేతలు కలిసి మనతో ఉన్నారు కాబట్టి, పార్లమెంట్ లో ఒకరు లేక ఇద్దరు హిందీ మాట్లాడే వారు, కానీ ఇప్పుడు రాష్ట్ర విడిపోయింది కాబట్టి మన నేతలు తప్పనిసరిగా హిందీ నేర్చుకోవాలని చెప్పటం జరిగింది. ఉదాహరణకు ..హరిక్రిష్ణ పార్లమెంటులో మాట్లాడి తీరు గురించి చెప్పినట్లు తెలుస్తోంది.
చంద్రబాబు ఆలోచన చాలా బాగుందని.. పార్టీలోని సీనియర్ నాయకులు, సీమాంద్ర ప్రజలు అంటున్నారు. తెలంగాణ ప్రాంతంలో చాలా మంది రాజకీయ నాయకులు హిందీ అవలీలగా మాట్లాడేస్తారు. అదే వారికి ఢిల్లీలో ఫ్లస్ పాయింట్ అవుతుందని, పార్టీలోని కార్యకర్తలు అంటున్నారు. రాష్ట్ర విభజన సమయంలో.. హిందీ మాట్లాడే నేతలకు కాంగ్రెస్ హైకమాండ్ ఇచ్చిన గౌరవం తెలిసిందే. అందుకే సీమాంద్ర నేతల మాటలు .. సోనియా గాంధీ చెవులకు ఎక్కకుండా కేంద్రంలో హిందీ లో మాట్లాడే నేతలు చేయటం జరిగిందని. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు.
చంద్రబాబుకు పదవి చేపట్టడానికి కొంచెం సమయం ఉండటంతో.. ముందుగా ఎంపీలు హిందీ నేర్చుకోవాలని పట్టుపట్టినట్లు సమాచారం. అందుకే ప్రతి రోజు హిందీ క్లాసుల గురించి బాబు వాకబు చేస్తూ .. మోడీ నుండి కొన్ని సలహాలు తీసుకొని .. హిందీ మాట్లాడే ఎంపీలను సిద్దం చేస్తున్నట్లు పార్టీలోకి కార్యకర్తలు అంటున్నారు.
ఇప్పటికే బాలయ్య ఒక హిందీ మాష్టారు ఇంటికి పిలిపించుకోని హిందీ నేర్చుకుంటున్నట్లు ఫిలింనగర్ వాసులు అంటున్నారు. ఇక ఎంపీలైతే.. హిందీ నేర్చుకోవటానికి రోజుకు 10 గంటలు కేటాయిస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. బాబు ఆలోచన సక్సెస్ అయితే.. ఇక సీమాంద్రలో హిందీ నేర్పే సెంటర్లు పెరిగిపోతాయని సీమాంద్ర ప్రజలు అంటున్నారు. బాబు ఏం చేసిన తెలుగు ప్రజలకోసమే అని పార్టీలోని సీనియర్ నాయకులు అంటున్నారు. పార్లమెంట్ సమావేశాల నాటికి తెలుగుదేశం పార్టీలో ఎంత మంది హీందీ మాట్లాడతారో చూద్దాం.
కొసమెరుపు.. ఈ నెల జరిగే మహానాడులో.. టిడిపి ఎంపీలకు హీందీ పరీక్షలు ఉంటాయని పార్టీలోకి పెద్దలు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more