జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎదుగుతున్న రోజులు. నిన్నటి వరకు పవన్ కళ్యాణ్ అంటే మన రాష్ట్రం వరకే తెలుసు. అందులో సినిమా అభిమానులకు బాగా తెలుసు. 2009 లో రాజకీయ ప్రవేశం చేసిన పవన్ కళ్యాన్ రాజకీయ నాయకులకు కొంచెం దగ్గరయ్యాడు. కానీ తన పని తాను చేసుకుంటూ పోతున్న విషయం తెలిసిందే. గబ్బర్ సింగ్ సినిమాతో.. టాలీవుడ్ ను షేక్ చేసి, ఆ తరువాత అత్తారింటికి దారేది సినిమాతో.. టాలీవుడ్ బాక్స్ బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. పుల్ జోష్ లో ఉన్న పవన్ కళ్యాణ్ లో ఒక్కసారి కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. పవన్ మనసు 2014 ఎన్నికలపై పడింది.
పవన్ కళ్యాణ్ 2009 ఎన్నికల్లో తన అన్న చిరంజీవి (ప్రజారాజ్యం) పార్టీ కి ప్రచారం చేసిన విషయం తెలిసిందే. కానీ అప్పట్లో అన్న పార్టీ అధికారంలోకి రాలేకపోయింది. దీంతో పవన్ కొన్ని అనివార్యకారణాల వల్ల పార్టీకి దూరంగా ఉండాల్సి వచ్చిందని ఆయన ముఖ్య సన్నిహితులు అంటున్నారు. ‘‘సింహం ఐదడుగులు వెనక్కి వేసింది’,. దీంతో పవన్ పై అనేక రాజకీయ కామెంట్లు వినిపించాయి. కానీ పవన్ మాత్రం ‘‘ఎన్నికలకు దారేది’’ అంటూ సమయం కోసం ఎదురుచూసి, సింహం సింగిల్ గా.. ‘‘జనసేన పార్టీ పెట్టి ’’ ప్రజల మద్య రావటం జరిగింది.
జనసేన పార్టీ పై, పవన్ కళ్యాణ్ పై కొంత మంది రాజకీయ నేతలు.. అవహేళనగా మాట్లాడి, మీడియా ముందు వేకిలి నవ్వులు నవ్వటం జరిగింది. ఇలాంటి వాటిని ఆయన మౌనం భరించి ప్రజల కోసం అడుగు వేయటం జరిగింది. ఈ సమయంలోనే తనకు నచ్చిన, తన సిద్దాంతాలకు దగ్గరగా ఉన్న కొంతమంది రాజకీయ నేతలను పవన్ మనస్పూర్తిగా ఒప్పుకోవటం జరిగింది. అలాంటి వారిలో మన (గెడ్డం)జగ్గారెడ్డి ఒకరు.
సంగారెడ్డి గడ్డం పై.. సమైక్యాంద్ర సింహం, రాష్ట్రం విడిపోయిన.. తెలుగు ప్రజలు కలిసిమెలిసి అన్నదమ్ముల్లా ఉండాలని సాటి చెప్పిన ఒకే వ్యక్తి జగ్గారెడ్డి ఒక్కరే. అయితే పవన్ రాకతో.. కొంతమంది రాజకీయ నేతలకు ‘పవర్‘ దక్కుండా పోయింది. మరికొంతమందికి అయితే.. డిపాజిట్లు కూడా దక్కలేదు.
దీంతో 2014 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పవర్ ఎలా వీసిందో అందరికి అర్థమైంది. పవన్ మద్దతు పొందిన పార్టీలు, నాయకులు అధికారంలోకి రావటం జరిగింది. ‘‘ఎన్ని సినీ సింహాలు వచ్చిన.. అధికారం మాదే అని యువనేత జగన్ రొమ్ము విరుచుకొని చెప్పటం జరిగింద’’. గెలుపు పై ఎన్నో ఆశలో ఆయన ఆ పార్టీ నాయకులు పెట్టుకున్నారు. కానీ చివరకు నిరాశే మిగిలిందని ఆపార్టీలోకి కార్యకర్తలే గుసగుసలాడుకుంటున్నారు.
అయితే రీసెంట్ తెలంగాణలో బలమైన రాజకీయ నేతల జగ్గారెడ్డి.. పవన్ కళ్యాణ్ ను కలవటం జరిగింది. దీంతో రాజకీయాల్లో కొత్త పుకార్లు పుట్టాయి. జగ్గారెడ్డి జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే పవన్ తో జగ్గారెడ్డి, అనేది రాజకీయ చర్చగా మారింది. ఈ ఇద్దరికి కలియకలో..కొత్త కోరికలు పుట్టినట్లు తెలుస్తోంది. ఓడిపోయిన జగ్గారెడ్డికి మరో ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఛాన్స్ ద్వారా గెలవటానికి పవన్ సాయం కోరినట్లు సమాచారం.
అంటే కేసిఆర్ మెదక్ ఎంపీ గా గెలిచిన విషయం తెలిసిందే. ఆయన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతున్న తరుణంలో.. మెదక్ ఎంపీ పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం ఉన్న విషయం తెలిసిందే. కేసిఆర్ రాజీనామా చేస్తే.. అక్కడ .. పవన్ కళ్యాన్ మద్దతో.. జగ్గారెడ్డి బిజేపి పార్టీ తరుపున ఎంపీగా పోటీ చేయటానికి సిద్దమైనట్లు తెలుస్తోంది.
అందులో బాగంగానే.. జగ్గారెడ్డి పవన్ తో మంతానాలు జరిపినట్లు గడ్డం రెడ్డి వర్గీయులు అంటున్నారు. పవన్ , చంద్రబాబు, మోడీ తో నిన్న ఢిల్లీలో జగ్గారెడ్డి కోరికను వివరించినట్లు సమాచారం. మోడీ నుంచి సానుకూల సమాధానం వచ్చినట్లు మెధక్ జిల్లా బిజీపే నాయకులు అంటున్నారు. అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గడ్డంరెడ్డి కోరిక తీర్చాటానికే.. ఢిల్లీ వెళ్లినట్లు రాజకీయ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.
కొసమెరుపు : గడ్డం రెడ్డి పవన్ మద్దతుతో.. మెదక్ ఎంపీ ఎన్నికల్లో గెలిస్తే మాత్రం .. తెలంగాణలో జనసే పార్టీకి బలం మరింత పెరుగుతుందని.. రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
RS
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more