Sonia gandhi sacrifice

Sonia Gandhi sacrifices country for Rahul, Congress Vice President Rahul Gandhi, Gandhi family grip on politics

Sonia Gandhi sacrifice

సోనియా త్యాగనిరతి!

Posted: 05/19/2014 12:50 PM IST
Sonia gandhi sacrifice

మహాభారతంలో కొడుకుని సార్వభౌమునిగా చూడటమే లక్ష్యంగా పెట్టుకున్న అంధరాజు ధృతరాష్ట్రుడు అతనికి అమితమైన స్వేచ్ఛనిచ్చి, చివరకు ఏమీ దక్కకుండా చేస్తాడు.   కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పుత్రవాత్సల్యంతో రాహుల్ గాంధీని దేశంలో అత్యున్నత పీఠం మీద కూర్చోబెట్టాలన్న ఏకైక లక్ష్యంతో పార్టీకి పరాజయం కలిగేట్టుగా చేసిందని రాజకీయ విశ్లేషకులే కాదు సామాన్య ప్రజలు కూడా అనుకుంటున్నారు.

ఎన్నికల ప్రచారంలో తన వారసత్వ ధోరణిని సమర్థించుకుంటూ, భాజపా వెనక ఆర్ఎస్ఎస్ ఉందని ఆరోపిస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ,  ఆ పార్టీ వెనకనున్న కుటుంబాన్ని మాత్రం త్యాగశీల నాయకుల కుటుంబంగా పేర్కొంటూవచ్చింది.  ఆ త్యాగాలకు ప్రతిగా దేశ ప్రజలంతా ఆ పార్టీకే పట్టం కట్టాలంటూ చెప్పే ప్రయత్నం చేసింది.  

దేశాన్ని తమ గుప్పిట్లోనే ఉంచుకోవటానికి ఒక రాజకీయ పార్టీ ప్రయత్నం చేస్తే అది తప్పు కాదు.  కానీ ఆ పార్టీ వెనుకనున్న కుటుంబమే ఆ ఆలోచనతో ముందుకు సాగితే ఆ పార్టీకే తీని నష్టం కలుగుతుందని ఎన్నికల ఫలితాలు చెప్తున్నాయి.  దానికి త్యాగనిరతి పేరు పెట్టి ఇతర నాయకులను కానీ పార్టీలను కానీ పైకి రాకుండా చేద్దామనే తలంపే ఆ పార్టీ అధినాయకురాలిని రాహుల్ గాంధీని గద్దె మీద కూర్చోబెడదామని ప్రేరేపించింది.  ఒకపక్క భాజపా తరఫున నరేంద్ర మోదీ సూర్యుడిలా ఉదయిస్తుంటే, దాని ముందు దివిటీలాంటి రాహుల్ గాంధీని నిలబెట్టినప్పుడు పోలికలో ఎవరి సమర్థత ఎంతవుందో దేశ ప్రజలకు అర్థమైపోయింది. 

రాహుల్ గాంధీని ఉపాధ్యక్షుడిగా ప్రకటించిన తర్వాత ఆ రోజు రాత్రి రాహుల్ గాంధీ దగ్గర సోనియా గాంధీ కంటతడిపెట్టుకున్నారట!  ఆ విషయాన్ని రాహుల్ గాంధీ పార్టీ సభ్యులకు వివరిస్తూ, నాయకత్వాన్ని అందరూ కోరుకోవటం విషమయమవుతుందని అన్నారు.  అంటే, అందరూ కోరుకోవద్దు, కేవలం గాంధీ కుటుంబానికే ఆ హక్కుందని ఆయన ఉద్దేశ్యం! 

చివరకు తల్లీ కొడుకులే మిగిలారు! 

పాత దివార్ సినిమాలో అమితాభ్ బచ్చన్, శశి కపూర్ ల  పంచ్ డైలాగ్స్ ఉన్నాయి.  "నా దగ్గర డబ్బుంది, బ్యాంక్ బ్యాలన్స్ ఉంది, భవనం ఉంది, కారుంది నీదగ్గరేముంది?" అని అమితాభా అడిగిన ప్రశ్నకు, "నాదగ్గర అమ్మ ఉంది" అని చెప్తాడు శశి కపూర్! 

"బాబూ మీ అమ్మను మీ దగ్గరే ఉంచుకోండి, జాతీయ సంపదను మాత్రం వదిలిపెట్టం" డంటూ భారతదేశ ప్రజలు తీర్పునిచ్చినట్టుగా ఉంది 2014 ఎన్నికల ఫలితాలు! 

కొడుకు మీద ప్రేమతో దేశాన్నే త్యాగం చేసిన ఘనత సోనియా గాంధీకే చెల్లింది!  ఇక ఆమెకు గుళ్ళు కట్టినవారేమంటారో చూడాలి!

చివరకు సోనియా గాంధీ ఓటమికి బాధ్యురాలినని కూడా చెప్పకుండా దాన్ని కూడా త్యాగం చేస్తున్నారు.  సిడబ్ల్యుసి మొత్తం ఎన్నికలలో ఓటమికి బాధ్యత వహిస్తూ మూకుమ్మడిగా రాజీనామాలు చెయ్యటానికి సిద్ధమవుతున్నారట. ఎందుకంటే సిడబ్ల్యుసి మీటింగ్ లో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఓటమిని సమిష్టి వైఫల్యంగా ఆమె ప్రకటించారు.  పైగా రాహుల్ గాంధీని వెనకేసుకురావటం కోసం ఆయన మద్దతుదార్లు ఎవరినైనా బలిపశువుని చేసే అవకాశం ఉందన్నది వాళ్ళ భయం!

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles