Ysrcp leaders in dilemma

YSRCP leaders in dilemma, TRS trying to woo YSRCP leaders, YSRCP meeting at Idupulapaya on 21st, YSRCP Idupulapaya meeting to decide Assembly leader

YSRCP leaders in dilemma

భయం అంచున వైకాపా నాయకులు!

Posted: 05/19/2014 10:54 AM IST
Ysrcp leaders in dilemma

ఎన్నికలయ్యాయి కానీ ఇంకా ప్రమాణ స్వీకారం కూడా కాలేదు కానీ శక్తివంతమైన ప్రభుత్వాన్ని ఏర్పరచే దిశగా తెరాస పావులు కదుపుతోందని సమాచారం.  అందుకు ఊతమిస్తోంది వైకాపా నాయకులలోని అభద్రతా భావం.  కొందరు వాళ్ళే దారి వెతుక్కుంటుంటే, కొందరికి పిలుపులు వస్తున్నాయి.  
ఖమ్మం జిల్లాలో ఒక ఎంపీ, మూడు ఎమ్మల్యే స్థానాలను గెలుచుకున్న వైకాపా రాజకీయ స్థానం నిజానికి పటిష్టంగానే వుంది.  కానీ తెరాస వాళ్ళని కలుపుకుందామని చూస్తోంది.  తెరాస నాయకుడు ఈటెల రాజేందర్, వైకాపా తరఫున ఎంపీగా ఎన్నికైన పొంగులేటి శ్రీనివాసరెడ్డిని, పినపాక ఎమ్మల్యే పాయ వెంకటేశ్వర్లు, వైరా ఎమ్మల్యే బానోతు మదన్ లాల్ ను, అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లును సంప్రదించినట్లుగానూ, వారిని తెరాస పార్టీలోకి ఆహ్వానించినట్లుగానూ సమాచారం.  

తెలంగాణాలో తెరాస ప్రభుత్వం ఏర్పడుతున్నప్పుడ వైకాపా లో ఉండి ఏం చేస్తారు, మా పార్టీలకి వస్తే మీకు మంచి అవకాశాలను కల్పిస్తాం, మీ నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోవటానికి వెసులుబాటు కల్పిస్తాం అంటూ వైకాప నాయకులకు తెరాస నచ్చజెప్తున్నట్లుగా తెలుస్తోంది.  

తెరాస కు ఇప్పటికే 63 స్థానాలుండి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నెలకొల్పే అవకాశం ఉన్నా, ఆ పార్టీ 70 మంది ఎమ్మెల్యేలు ఉంటే బావుంటుందనే ఆలోచనలో పావులు కదుపుతున్నట్లుగా సమాచారం.  

సీమాంధ్రలో పరిస్థితి ఇంకా ఘోరంగానే వుంది.  ఎందుకంటే సీమాంధ్రలో వైకాపా అధికారంలోకి వస్తుందనే నమ్మకంతోనే ఆయన జైల్లో ఉన్నప్పడు కూడా పార్టీకోసం పనిచేసినవాళ్ళు తీరా ఎన్నికలైన తర్వాత ఇప్పుడు పార్టీకి అధికారం చిక్కకపోవటంతో ఓడిపోయిన నాయకులు ఎలాగూ మధనపడుతూనేవున్నారు, ఎన్నికైనవాళ్ళు కూడా పార్టీ మారిస్తే ఎలావుంటుందన్న ఆలోచనలో పడ్డట్టుగా కనిపిస్తోంది.  

జగన్ మరోసారి జైలుకి వెళ్ళరన్న గ్యారెంటీ ఏమీ లేదు.  ఎందుకంటే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పడిపోయింది.  ఇలాంటి పరిస్థితుల్లో పార్టీనే అంటిపెట్టుకునివుండేదానికంటే, కంచె దూకితే ఐదుసంవత్సరాలు హాయిగా రాజకీయ జీవితాన్ని గడవచ్చు కదా అనే ఆలోచన కూడా వారిని మధనంలోకి నెట్టి వేస్తోంది.  

21 వ తేదీన వైయస్ఆర్ సమాధి వద్ద నివాళులర్పించి, ఇడుపులపాయలో నిర్వహిస్తున్న సమావేశంలో శాసనసభాపక్ష నేత, పార్లమెంటరీ నేతను కూడా ఎన్నుకోనున్నారు.  ఆ రోజు వస్తేకాని ఎంతమంది మిగిలివుంటారన్నది తెలియదంటున్నారు విశ్లేషకులు.  అక్కడకు హాజరైనవారంతా కూడా కొనసాగుతారన్న గ్యారెంటీ ఏమీ లేదని కూడా అంటున్నారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles