Trs mla harish rao fire on congress party

trs mla harish rao, harish rao, ys jagan, trs party, congress party, ysrcp, cbi, kcr, vijayashanthi, election 2014.

trs mla harish rao fire on congress party

జగన్ మాటే ..టీఆర్ఎస్ హరీష్ రావు మాట?

Posted: 04/25/2014 04:16 PM IST
Trs mla harish rao fire on congress party

ఏదైన తనదాక వస్తే గానీ .. ఆ రుచి, ఆ చిక్కదనం, ఆ రంగు, ఆ  వాసన తెలియదు..  ఇప్పటు టీఆర్ఎస్ పార్ట పరిస్థితి కూడా అలాగే ఉంది.  గతంలో  వైఎస్ జగన్మోహన్ రెడ్డికి  ఎలా జరిగిందో.. సేమ్ టూ సేమ్  ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ  అధినేత , కల్వకుంట్ల చంద్రశేఖరరావు కు,  ఆయన మేనల్లూడు టి. హరీష్ రావు కు జరుగుతుంది.  వీరితో పాటు..  తెలంగాణ రాములమ్మ( విజయశాంతి) కాంగ్రెస్ పార్టీ నేత ఆ మరకలు అంటాయి. 

తెలుగు రాష్ట్రంలో  తెలివిగల రాజకీయ నాయకులు చాలా ఎక్కువు. దేశ రాజకీయాల మొత్తం ఒకేత్తైతే ..  మన తెలుగు రాజకీయ నాయకులు  తెలివి ఒకేత్తు. ఇప్పటి వరకు  తెలుగు రాజకీయ నాయకులను కొన్ని రాష్ట్రాల నాయకులు లెక్కలోకి పెద్దగా తీసుకోరు.కానీతెలుగు రాజకీయ నాయకులు అంటే మాత్రం చాలా మంది భయపడతారు.  అవినీతి కి  అడ్డాగా ఆంద్రప్రదేశ్ మారిందని అందరికి తెలుసు. 

గతంలో సిబీఐ వారు.. వైఎస్ జగన్  ఆస్తుల పై విచారణ చేస్తున్న సమయంలో.. ఇది కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీల  కుట్ర అని  తన సొంత మీడియాలో  పేపర్లో  తాటికాయంత అక్షరాలతో  రాసి ప్రజలకు వినిపించేవారు, చూపించారు. కాంగ్రెస్ కుట్ర అని పదే పదే ప్రతి రోజు మీడియా  జగన్ పార్టీ  నాయకులు  భజన చేసిన విషయం తెలిసిందే. 

ఇప్పుడు అదే బాటలో మన టీఆర్ఎస్  ఎమ్మెల్యే  టి.హరీష్ రావు కూడా ఈరోజు మీడియ ముందు ..  మా  ఆస్తుల విచారణ చేపట్టడం అనేది కేవలం కాంగ్రెస్ పార్టీ కుట్రే అని  అంటున్నారు.   అసలు  మీవి నిజమైన ఆస్తులైతే .. మీడియా ముందు భుజాలు  తడుముకోవటం ఎందుకు హరిష్ రావు అని  ఓటు హక్కు  ఉన్న యువకులు అడుగుతున్నారు.  గతంలో జగన్ కూడా ఇలాగే మాట్లాడటం జరిగింది.  కానీ ఈడి మాత్రం  జగన్ సంబంధించిన  ఆస్తులను జప్తు చేసిన విషయం తెలిసిందే.

గత రెండు రోజుల క్రితం ..ఆస్తుల విచారణకు   తెలంగాణ  పీసీసీ సిద్దమా అంటూ సవాల్  విసిరిణ విషయం ఎలా మరిచిపోయ్ హరిష్ రావు అని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. ఇంతలోనే  ఇన్ని మాయ మాటలు చెబితె..తెలుగు ప్రజలు ఏమానుకుంటారో ఒక్కసారి ఆలోచించి మీడియా ముందుకు రావాల్సిందని  .. ఆ పార్టీ  కార్యకర్తలు  అంటున్నారు. 

ఏమైన  గుమ్మడికాయ దొంగలు ఎవరు అంటే.. వెంటనే హరిష్ రావు  భుజాలు తడుముకోవటంతో  టీఆర్ఎస్ ఆస్తుల పై అందరికి అనుమానం కలుగుతుందని .. పార్టీలోని  సీనియర్ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు.  అయినా   కేసిఆరే కదా.. ఒక ఏకరపోలంలో  కోటీరూపాలయ ఆదాయం వస్తుందని మీడియాలో చెప్పటం జరిగింది.  ఈ ఒక్క మాటే  తెలంగాణ ప్రజల  చేవ్వుల్లో .. గులాబీ పువ్వులు పెట్టినట్లు తెలుస్తోంది.  

అయినా  సిబిఐ విచారణ చేయాలి.. మీ ఆస్తులు గురించి ప్రజలు చెప్పాలి, ఇది జరగలాంటే.. చాలా సమయం పడుతుంది కాబట్టి..  కేసిఆర్ కంగారు పడకుండా,  హరిష్ రావు ఆదైర్యపడకుండా.. కారులో కూర్చోని  ఎన్నికల ప్రచారం చేసుకోండి..?  విచారణ జరిగినప్పుడు చూద్దాం...  ముందు ఎన్నికల పై ద్రుష్టి పెట్టండని .. పార్టీలోని  సీనియర్  నాయకులు  ఉచిత సలహాలు ఇస్తున్నారు.  

తెలంగాణ రాములమ్మ మాత్రం ..  సిబిఐ విచారణకు నేనుసిద్దమే తన పార్టీ కార్యకర్తలతో  చెప్పినట్లు తెలుస్తోంది.  ఇక కేసిఆర్, హరీశ్ రావు..?? 

ఆర్ఎస్ 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles