Harikrishna stopping jr ntr from campaigning for tdp

Harikrishna, Jr NTR, TDP, Harikrishna stopping Jr NTR, Junior NTR withdraws, Nandamuri Harikrishna, eleciton 2014.

Harikrishna stopping Jr NTR from Campaigning for TDP, Junior NTR withdraws campaign plan

ఎన్టీఆర్ కు అడ్డుపడిన హరిక్రిష్ణ?

Posted: 04/25/2014 07:04 PM IST
Harikrishna stopping jr ntr from campaigning for tdp

తెలుగుదేశం పార్టీ తరపున జూనియర్ ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారానికి వస్తున్నాడని  గత రెండు రోజుల నుండి మీడియాలో వార్తలు వస్తున్నాయి. జూనియర్  ఎన్టీఆర్ కోసం రూట్ మ్యాప్ సిద్దం చేస్తున్నట్లు  ఆయన అభిమానులు  చెప్పటం జరిగింది.  కానీ  ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ  తరుపున ఎన్నికల ప్రచారానికి రావటం లేదనే  పుకార్లు టాలీవుడ్ లో బలంగా వినిపిస్తున్నాయి. 

ఒక పక్క పిల్లనిచ్చిన మామ నార్నే శ్రీనివాసరావు స్వయంగా ఎన్టీఆర్ ను కలిసి  టిడిపి తరుపున ఎన్నికల ప్రచారం చేయమని చెప్పటం జరిగింది. కానీ ఎన్టీఆర్ నుండి ఇప్పటి వరకు ఎలాంటి మీడియా  ప్రకటన రాలేదు. అసలు ఇంటి నుండి బయటకు రావటంలేదని  ఫిలింనగర్ వాసులు అంటున్నారు.  కానీ ఎన్టీఆర్  ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండటానికి కారణం  ఆయన తండ్రి హరిక్రిష్ణయే అని ..తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. 

తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడిగా చేసిన హరిక్రిష్ణ, ఎన్టీఆర్ ను ఎందుకు వద్దన్నాడంటే.. దానికి బలమైన కారణం ఉందని తెలుస్తోంది. ‘‘టిక్కెట్ ఇవ్వని పార్టీకి.. నీ ప్రచారం ఎందుకు’?  నాకు టిక్కెట్ ఇవ్వనప్పుడు .. నువ్వు వెళ్లి ఎందుకు ప్రచారం చెయ్యలని ఎన్టీఆర్ కు మైండ్ వాష్  చేసినట్లు టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది.  మామ  మాటలను పక్కన పెట్టి, తండ్రి మాటకు ప్రాదాన్యం ఇచ్చి..  ఇంట్లోనే.. తన భార్యతో  హాయిగా గడుపుతున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. 

ఈ మద్య  ఒక పదం బాగా  వినబడుతుంది.. ‘‘ ఎన్టీఆర్ వద్దు.. పవనే ముద్దు ’’ అంటూ  తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రచారంలో సందడిచేస్తున్నారు.  బహుశ .. ఇది కూడా .. ఎన్టీఆర్ , హరిక్రిష్ణ మనసులను గాయం చేసింది ఉంటుందని పార్టీలోని సీనియర్  నాయకులు ఎన్టీఆర్ భవన్ లో  నాలుగంగుళాల నాలుకను పదె పదే తడుపుకుంటున్నారు.  

ఈ విషయం పై ఎన్టీఆర్ గానీ, చంద్రబాబు గానీ మీడియా ఒక క్లారిటీ ఇస్తే.. ఇలాంటి పుకార్లు ..తెరపడుతుంది. లేకపోతే.. మరో కొత్త పుకారు  పురుడుపోసుకుంటుందని తెలుగుదేశం పార్టీ అభిమానులు అంటున్నారు. 

ఆర్ఎస్ 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles