Shobha nagireddy car accident mystery

Shobha Nagi Reddy, YSRCP leader Shobha Nagi Reddy, shobha nagireddy car accident, YSR Congress leader shobha, election 2014, ar accident mystery, car driver nagendra, ys jagan, shobha nagireddy death.

shobha nagireddy car accident mystery?

శోభా నాగిరెడ్డికి యాక్సిడెంట్ జరిగిందా? లేక చేశారా?

Posted: 04/25/2014 01:14 PM IST
Shobha nagireddy car accident mystery

కర్నుల జిల్లా బలమైన రాజకీయ నాయకురాలు  శోబా నాగిరెడ్డి.  రాజకీయల్లో అంచలెంచలుగా ఎదుగుతున్న సమయంలోనే ఆమె కు రాజకీయ శత్రువులు  పెరిగినట్లు తెలుస్తోంది.  ఇటీవల  ఒక సంస్థ  రాజకీయ నాయకులకు రక్షణ లేకుండా పోతుందని,  నమ్మిన వారే రాజకీయ నేతల ప్రాణాలు తీస్తున్నారనే విషయాన్ని  చెప్పటం జరిగింది.  

వైకాపాలో సినీయర్ నాయకురాలు  శోభా నాగిరెడ్డి.  రాజకీయలపై మంచి పట్టు ఉన్న నేతగా గుర్తింపు తెచ్చుకుంది.  ఆమె అకాల మరణం పై అనేక అనుమానాలు  రేకేత్తున్నాయి.  ఈ అనుమానాలకు కారణం  శోభా నాగిరెడ్డి  కారు డ్రైవర్  నాగేంద్ర  అనే ఆమె అభిమానులు అంటున్నారు.  పోలీసులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.  

ప్రమాదానికి కారణమైన శోభానాగిరెడ్డి కారు డ్రైవర్ నాగేంద్ర కనిపించకుండా పోవడం ప్రతిఒక్కరి అనుమానం బలపడుతుంది. ప్రమాదం అనంతరం నంద్యాలలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నాగేంద్ర ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ప్రమాదంలో గాయపడిన అతన్ని పోలీసులు  తొలుత ఆళ్లగడ్డలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. బంధువులు మెరుగైన వైద్యం కోసం అర్ధరాత్రి  నంద్యాలకు తరలించారు. 

శరీరంపై  గాయాలు లేకపోయినా కడుపు, ఛాతీలో నొప్పితో బాధపడుతుండటంతో వైద్యులు చికిత్స చేశారు. డ్రైవర్ పరారీ వెనుక కుట్ర ఏమన్నా దాగి ఉందా అన్న కోణంలో ఆలోచిస్తే మంచిదేమో. శోభా నాగిరెడ్డి సొంత డ్రైవర్ ఒంట్లో బాగాలేకపోవటంతో తాత్కాలిక డ్రైవర్ నాగేంద్ర విదులు నిర్వర్తించాడు.

అయితే నాగేంద్ర తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. వెంటనే మేడమ్‌ను చూడాలని ఆసుపత్రి సిబ్బందికి చెప్పి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఇతను ఎక్కడా కనిపించకపోవడం పోలీసు వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. అదృశ్యమైన నాగేంద్ర స్వస్థలం ఆళ్లగడ్డ మండలంలోని కోటకందుకూరుగా, తండ్రి సుబ్బరాయుడుగా ఆసుపత్రిలో వివరాలు నమోదయ్యాయి. 

డ్రైవర్ నాగేంద్ర ఆసుపత్రి నుంచి పారిపోయాడా? లేక ఎవరైన తప్పించారా?  అసలు శోభా నాగిరెడ్డి కారు నిజంగా యాక్సిండెంట్  జరిగిందా?  లేక కావాలనే యాక్సిడెంట్ చేశారా?  ఆమె రాజకీయ ఎదుగుదలను చూసి ఎవరైన ఇలాంటి ఘాతుకానికీ  ఒడిగడ్డారా?  అనే యాక్ష ప్రశ్నలు  ఆమె అభిమానుల మదిలో సుడులు తిరుగుతున్నాయి.   ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే.. పోలీసు మామలు ..రంగంలోకి  దిగి  డ్రైవర్ నాగేంద్ర నుపట్టుకుంటే .. అసలు నిజం బయటకు వస్తుందని ఆమె రాజకీయ అభిమానలు అంటున్నారు.  నిజం నిలకడమీద తెలుస్తోందని  పోలీసులు బాస్ లు అంటున్నారు. 

ఆర్ఎస్ 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles