Vijayashanthi fire on kcr life history 2014

vijayashanthi, ramulamma, congress party, kcr, harish rao, trs party, vijayashanthi fire on kcr life history 2014, vijayashanthi vs kcr, telangana election 2014, Harish rao vs vijayashanthi, congress party vijayashanthi, kcr life history.

vijayashanthi fire on kcr life history 2014, ramulamma fire on kcr, vijayashanthi fire on trs party, vijayashanthi fire on harish rao

కేసిఆర్ నిద్రలేని రాత్రులు -రాములమ్మ ఫైర్ ?

Posted: 04/24/2014 11:28 AM IST
Vijayashanthi fire on kcr life history 2014

తెలంగాణ రాములమ్మ (విజయశాంతి)  చేతిలో  శిశుపాలుడు(కేసిఆర్)  పాపల చిట్టా దాగి ఉందని  చెబుతుంది.  జరుగుతున్న ఎన్నికల సమయంలో  కల్వకుంట్ల చంద్రశేఖరరావు పై  రాములమ్మ త్రీవస్థాయిలో  విరుచుకుపడ్డారు. గత కొంత కాలం కేసిఆర్ అన్నయ్య సన్నిదిలో పెరిగిన తులసి మొక్క రాములమ్మ.  కానీ రాజకీయ విభేదాలతో   కేసిఆర్ అన్నయ్య కారు దిగి..  జగ్గారెడ్డి పార్టీలో కలిసి పోయిన విషయం తెలిసిందే. 

ఇప్పుడు  రాములమ్మ  పాత అన్నయ్య కేసిఆర్ పై కయ్యానికి కాలుదువ్వి విమర్శలు గుప్పిస్తుంది.  టీఆర్ఎస్ పార్టీలోచేరిన కొద్ది రోజులకే..రాములమ్మకు నరకం చూసినట్లు చెబుతుంది. కేసిఆర్ ద్రుష్టి మొత్తం  సమైక్యవాదులపైనే ఉంటుందని, వారి నుండి  కోట్లు ఎలా దండుకోవాలనే ఆలోచనలతోనే ఆయన నిద్రలేస్తాడని  తెలంగాణ రాములమ్మ మీడియా ముందు చెప్పటం జరిగింది. 

కేసిఆర్ టార్గెట్ .. నెలకు 20 కోట్లు  దండుకోవాలి అనే ఆలోచన మొదలు పెట్టి,  ఎవడిని, ఎలా దోచుకోవాలని ప్రణాళికలు సిద్దం చేస్తాడని  రాములమ్మ బహిరంగంగా చెప్పటం జరిగింది.  కేసిఆర్ కు అన్ని వైపుల  సమాచారం అంత తీసుకొచ్చి తనదైనా శైలిలో బెదిరించి కోట్లు వసుల్ చేసే పని  ఆయన మేనల్లుడు హరిష్ రావు చూసుకుంటాడని  రాములమ్మ అంటుంది. 

హైదరాబాద్ లో పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే ఎంతటివారైనా  కెసిఆర్ తన దగ్గరికి రావాలని హుకుం జారీ చేస్తారని తెలిపింది. ఇప్పుడే ఇంత చేస్తుంటే కెసిఆర్ తెలంగాణాకు సిఎం అయితే సామాన్యుడు బ్రతకలేడని... దయచేసి తెరాస పార్టీ ఓటు వేయ్యోద్దని పిలుపునిచ్చింది. 

కెసిఆర్ తీవ్రమైన పదవీకాంక్షతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని, ఈ కారణంగానే ఆయన మానసిక స్థితి  బలహీనపడిపోయిందన్నారు. గుజరాత్ లో షిప్ యార్డులు, పోర్టులు చాలానే ఉన్నాయని... కెసిఆర్ బ్రతుకు అంత తన చేతుల్లో ఉందని విజయశాంతి తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. 

అయిన  రాములమ్మ చెబుతున్న వ్యాఖ్యలను నమ్మలేమని కొందరు అంటున్నారు. కారణం  కొన్ని రోజులు  కేసిఆర్ తో, టీఆర్ఎస్ పార్టీలో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే.  ఇప్పుడు పార్టీ మారింది కాబట్టి ఇలాంటి విమర్శలు చేస్తుంది. అదే టీఆర్ఎస్ పార్టీ లో ఉంటే  కేసిఆర్ ఇలాంటి విమర్శలు, ఆయన చేసిన పనులు ఇలా బయట పెట్టేదా?     కేసిఆర్ దగ్గర రాములమ్మ ఆటలు సాగలేదు కాబట్టి.. ఇలా బయటపడి చెప్పుకుంటుందని  తెలంగాణలో చదువుకున్న వారు గుసగుసలాడుకుంటున్నారు. 

అయిన కేసిఆర్ నెలకు 20 కోట్లు దండుకుంటే.. అందులో..రాములమ్మ బాగం ఎంత చెబితే బాగుండేది. ఎందుకంటే..  ప్రతినెల రాములమ్మ ఖర్చు..రెండులక్షలని ..టీఆర్ఎస్ నాయకులు అప్పట్లో పార్టీలో ఆఫీసులో చెవులు కొరికేసుకున్నారు. ఖాళీగా ఉండే .. రాములమ్మకు  కేసిఆర్ నెల, నెల రెండు లక్షలు ఇవ్వకపోవటంతో.. ఇలా మీడియా ముందు  చిటపటపేలుతుందని  తెలంగాణ అభిమానులు అంటున్నారు.  చెల్లెమ్మ విమర్శలపై .. అన్నయ్య  కేసిఆర్  ఏలాంటి సమాదానం చెబుతాడో చూద్దాం. (అయిన దొందు దొందేలే  అని తెలుగు ప్రజలు సర్థుపోతున్నారు)

ఆర్ఎస్ 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles