Jaitley responds to priyanka s vadra defence

Priyanka Vadra, sonia gandhi, congress party, Stop personal attacks, bjp, narendra modi, rahul gandhi, Jaitley responds to Priyanka-s Vadra defence.

Jaitley responds to Priyanka-s Vadra defence, Stop personal attacks

ఓదార్పుకోసం ప్రియాంక వాద్రా ఎదురుచూపులు?

Posted: 04/23/2014 01:14 PM IST
Jaitley responds to priyanka s vadra defence

సోనియా గాంధీకి నచ్చని తెలుగు పదం ‘‘ఓదార్పు’’ . ఆ పేరు వినిపిస్తే చాలు.. అగ్గిమీద గుగ్గీలం అవుతుందని .. సీనియర్ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.   అంటే  ఓదార్పు అంటే  సోనియా గాంధీకి వెంటనే గుర్తుకు వచ్చేది..  కాంగ్రెస్ నేత  దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగనే అని  ఢిల్లీ పెద్దలు అంటున్నారు. 

అసలు ఓదార్పు అంటే ఏమిటి?  బాధలో ఉన్నవారి మనస్సుకు ఓదార్చే మాటలు, మనిషి  అవసరం. అలాంటి వారికి   ఆత్మీయులు ఓదార్చుతుంటారు. కానీ జగన్ విషయం అలా జరగలేదు..  ఇక్కడ ఈయన ఓదార్పు అంటే..  తలనిమారటం,  బుగ్గలపై ముద్దులు పెట్టడం, ఆత్మీయంగా కౌగిలించుకోవటమే తెలుసు. అందుకే  జగన్ ఓదార్పు అంటే.. ప్రజలు భయపడుతున్నారని  ..కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు. 

అయితే ఇప్పుడు  సోనియా గాంధీ కూతురు ప్రియాంక వాద్రాకు  ఓదార్పు కావాలట, ఆమెను ఓదార్చటానికి   ఆత్మీయమైన మనిషి కోసం  ప్రియాంక వాద్రా ఆశగా ఎదురుచూస్తుంది.  ఆమె ఓదార్పు గల కారణం ఉందని కాంగ్రెస్   నాయకులు అంటున్నారు. సోనియా గాంధీ, రాహుల్  గాంధీ ఎన్నికల ప్రచారంలో చాలా బీజీగా ఉన్న విషయం తెలిసిందే.  

ఇటీవల  ప్రియాంక  వాద్రా భర్త రాబర్డ్ వాద్రాపై  రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు విచిత్రమైన కామెంట్లు చేస్తున్న విషయం తెలిసింది. ఆ విమర్శలకు  ప్రియాంక వాద్ర చాలా బాధపడుతున్నట్లు  కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకులు అంటున్నారు.  ఆమె ఇప్పుడు ఓదార్పు కోసం ఎదురుచూస్తుంది.

తన భర్తపై రాజకీయ విమర్శలు తనను బాధిస్తున్నాయంటూ గోడును వెళ్లబోసుకున్న ప్రియాంకకు బీజేపీ నేత అరుణ్ జైట్లీ ఓ సలహా చెప్పినట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. వ్యక్తిగత వ్యాఖ్యలు చేయకుండా సోదరుడు రాహుల్ గాంధీ తో  సహా కాంగ్రెస్ నేతలకు సూచించాలని ప్రియాంకకు హితవు చెప్పినట్లు తెలుస్తోంది. 

అంతేకాకుండా మోడీ చిన్నతనంలో జరిగిన పెళ్లిపై రాహుల్ విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే  రాహుల్ నిజంగా అర్థం చేసుకుంటే మోడీపై పెళ్లి విషయంలో వ్యక్తిగత విమర్శలు చేసేవారు కాదని జైట్లీ చెప్పినట్లు సమాచారం. ఇలాంటి  వ్యక్తిగత విమర్శలు బాధిస్తాయన్న ప్రియాంక అభిప్రాయంతో ఏకీభవించి, కొంచెం కొత్తగా ప్రియాంకకు సలహా ఇవ్వటం జరిగింది. 

అయితే నా సలహ నచ్చితే,   ముందుగా  మీ ఇంటి నుంచే పాటించమని చెప్పినట్లు సమాచారం.  అప్పుడు  ఎవరికి ఓదార్పు అవసరం ఉండదని .. బీజేపి నాయకులు చెప్పటం జరిగింది.  ఈ విషయం తెలుసుకున్న సోనియా గాంధీ  ఓదార్పు అనే పదం పై మండిపడినట్లు కాంగ్రెస్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. 

ఆర్ఎస్ 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles