Congress mla jaggareddy scales a wall

Congress MLA Jaggareddy scales a wall, Sangareedy MLA Jagga Reddy violation of Election code, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections 2014

Congress MLA Jaggareddy scales a wall

గోడదూకి పారిపోయిన కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి!

Posted: 04/13/2014 12:06 PM IST
Congress mla jaggareddy scales a wall

సికింద్రాబాద్ గన్ రాక్ ఫంక్షన్ హాల్లో శనివారం వోటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నంలో సెల్ ఫోన్లు, కుక్కర్లు, మైక్రో ఒవెన్లు మొదలైన వస్తువులను పంపిణీ చేస్తున్న మెదక్ జిల్లా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి విషయం తెలిసి అక్కడికి పోలీసులతో చేరుకున్న స్టాటిక్ సర్వెలెన్స్ బృందం చేరుకోవటం చూసి ఫంక్షన్ హాల్ గోడ దూకి పారిపోయారు.  ఆ దృశ్యం అక్కిడ సన్నివేశాన్నంతా పోలీసులు చేసిన వీడియో రికార్డింగ్ లో నిక్షిప్తమైంది. 

రంగారెడ్డి  జిల్లాలోని ఒక ఎమ్మెల్యేకి చెందిన ఆ ఫంక్షన్ హాల్లో భారీ సంఖ్యలో పంపిణికీ పెట్టిన వస్తువులు ఇవి- సెల్ ఫోన్లు, మిక్సీలు, కుక్కర్లు, డివిడి ప్లేయర్లు, గ్యాస్ స్టౌలు, వంట సామగ్రి మొదలైనవి.  ఎక్కడివాళ్ళక్కడ పారిపోతుండగా ఒక మహిళతో సహా ముగ్గురు పోలీసులకు చిక్కారు.  అక్కడ మిగిలివున్న 80 సెల్ ఫోన్లు, కుక్కర్లు, మిక్సీలు మొదలైన వస్తువులతో పాటు మద్యం సీసాలను కూడా కంటోన్మెంట్ నియోజకవర్గ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిణి లక్ష్మి సారధ్యంలో దాడికి వచ్చిన పోలీసులు స్ఫాధీనం చేసుకున్నారు. 

ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కింది కేసు నమోదు చెయ్యటం జరుగుతుందని, అసలు ఆ ఫంక్షన్ హాల్ లో జరుగుతున్న కార్యక్రమానికి అనుమతి విషయంలో కూడా దర్యాప్తు జరుగుతుందని లక్ష్మి అన్నారు. 

ఆ ఫంక్షన్ హాల్లో సంగారెడ్డి నియోజక వర్గంలోని వోటర్ల సమక్షంలో జరపదలచుకున్న ఆ పంపిణీ కార్యక్రమం సంగారెడ్డి మహిళా నాయకురాలు నెక్కంటి స్వరూప పుట్టినరోజు వేడుకగా చూపించదలచుకున్నారు.  కానీ పోలీసులు దాడికి రావటంతో వోటర్లు నాయకులు ఎక్కడికక్కడ పిక్క బలం చూపించి అక్కడి నుండి పారిపోయారు.

ఇదే జగ్గారెడ్డిని పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావ సభలో తనకి ఇష్టమైన నాయుకుడిగా పొగిడారు.  దానికి స్పందించిన జగ్గారెడ్డి అప్పట్లో, తను పవన్ కళ్యాణ్ ని కలవలేదని, అయితే ఆయన తెరాస గురించి చెప్పిందంతా నూటికి నూరు శాతం నిజమని మీడియాలో ప్రకటించారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles