Triangular fight in telangana

Triangular fight in Telangana, TRS, Congress party, BJP, Kishan Reddy, Sonia Gandhi, Sushma Swaraj, KCR

Triangular fight in Telangana, TRS, Congress party, BJP

తెలంగాణాలో అసలు పోటీ ప్రారంభం

Posted: 02/19/2014 10:03 AM IST
Triangular fight in telangana

తెలంగాణా వేదికైతే ముస్తాబవుతోంది కానీ దాన్ని అధిరోహించటానికి పోటాపోటీలు ప్రారంభమౌతున్నాయి.  ప్రముఖంగా త్రిముఖపోటీ ఉండబోతోంది.

అందులో అందిరకంటే ముందున్న తెరాస 25 వ తేదీన ఢిల్లీ నుంచి రాష్ట్రానికి తిరిగి వస్తున్న కెసిఆర్ కి ఘన స్వాగతం పలికేందుకు సన్నాహాలు సిద్ధమౌతున్నాయి.  కనీసం లక్షమందైనా ఆ సభకు హాజరవాలని కెసిఆర్ ఆదేశాలిచ్చినట్టుగా సమాచారం.  దానితోపాటు తెలంగాణా ఆవిర్భావానికి తెరాస కృషే కారణమని తెలంగాణా ప్రజల్లోకి లోతుగా ఇంకే విధంగా ప్రచారాలు సాగాలని కూడా కెసిఆర్ తెలియజేసారు తన పార్టీ సభ్యులందరికీ.  పార్టీ సభ్యులు కూడా కాంగ్రెస్ తో విలీనం పొత్తుల విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని కెసిఆర్ కి చెప్పారు.  భాజపాకు జాతీయ స్థాయిలో పెరుగుతున్న ఖ్యాతి వలన కాంగ్రెస్ తో పొత్తు కేవలం కాంగ్రెస్ కి ఉపయోగపడుతుంది కానీ తెరాస కు కాదన్నది ఒక అభిప్రాయం.

బిల్లు ముందుకు సాగి ఎన్ని అడ్డంకులు వచ్చినా వెరవకుండా పట్టుదలతో లోక్ సభలో పాస్ చేయించిన ఘనత సోనియా గాంధీకి దక్కుతున్నా, ఆ విషయాన్ని తెరాస కూడా అంగీకరిస్తున్నా, తెరాసకు అనుకూల పవనాలు తెలంగాణాలో తీవ్రంగా వీస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు తెరాస విలీనం మీదనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు.  కానీ విలీనం విషయం కెసిఆర్ తేల్చటం లేదు.  పైగా కాంగ్రెస్ తో పొత్తుతో ఎన్నికలకు పోవటానికి కూడా ఒక ఆలోచన సాగుతోంది.  పొత్తు లేకుండా కూడా తెరాస ఆధిక్యతను సంపాదిస్తుందన్న సంకేతాలు వచ్చినట్లయితే పొత్తు కూడా పెట్టుకోకపోవచ్చు.

ఇక మరో పార్టీ భాజపా.  భాజపాకున్న గట్టి వాదన ఏమిటంటే భాజపా పట్టుదలతోనే కాంగ్రెస్ కి తెలంగాణా బిల్లు విషయంలో ముందడుగు వెయ్యవలసి వచ్చింది.  మీరు ఇవ్వక పోతే మేము తెలంగాణాను ఇస్తామన్న సవాల్ కాంగ్రెస్ ను పరుగులు పెట్టించింది.  ఎన్నికల తర్వాత ఎలా ఉంటుందో, తెలంగాణా ఘనత భాజపా ఖాతాలో జమవుతుందేమో అన్న భయం కాంగ్రెస్ ని వేధించసాగింది.  అందువలన భాజపా అంత గట్టిగా చెప్పుండకపోతే కాంగ్రెస్ తెలంగాణా విషయంలో అంతకు ముందులాగానే నాన్చుడు ధోరణిలో ఉండేదన్నది భాజపా వాదన.  రాష్ట్రంలో భాజపా అధ్యక్షుడు కిషన్ రెడ్డి అందుకు తగ్గట్టుగా వేదికను తయారు చేసుకుంటూ, తెలంగాణా విషయంలో స్పష్టమైన వైఖరితో ఉండాలని జాతీయ నాయకులకు చెప్పి ఒప్పించటం జరిగింది.  దానికి తోడుగా భాజపాకి ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ ఆకర్షణ ఒకటి ప్రస్తుతం దేశవ్యాప్తంగా బాగా ఉంది. 

ఇలా పై మూడు పార్టీలు తమ తమ వ్యూహరచనల్లో ఉండగా తెరాస రాకముందు నుంచీ ఉద్యమ బాటలో ఉన్నామని చెప్పుకునే నాయకులు, పార్టీలు, సంఘాలు కూడా పైకి లేచే అవకాశం ఉంది.   ఒకవేళ కాంగ్రెస్ తెరాసల మధ్య పొత్తు కుదిరినా సీట్ల కేటాయింపులు కూడా తలనొప్పులు తెచ్చే ప్రమాదం ఉంది.  అలిగిన నాయకులు కేవలం అలకతో సరిపెట్టుకోరు, పార్టీ విడిచీ ఊరికే ఉండరు.  బయటకు పోగానే పార్టీ గురించి, పార్టీలోని నాయకుల గురించి తమ దగ్గర ఎన్నో రహస్యాలున్నాయి, వాటి గుట్టు విప్పుతామంటూ ప్రచారాలు చేస్తారు. 

అందువలన వీటన్నిటి దృష్ట్యా చూస్తే ఏ పార్టీకీ తెలంగాణాలో ఎన్నికల సమయంలో పరిచిన దుప్పటి, వడ్డించిన విస్తరి, పూలతో వేసిన బాటలు కావు.  ఏమరుపాటు లేకుండా ప్రతి అడుగూ ఆచితూచి వెయ్యవలసిన సందర్భం. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles