Ponnam prabhakar touched sonia feet in lok sabha

Ponnam Prabhakar, sonia gandhi, sonia feet touched mp, telangana bill, telangana state.

Ponnam Prabhakar touched Sonia feet in Lok Sabha, Telangana MP touched Sonia feet in Lok Sabha

అమ్మకు పాదాభివందనం చేసిన ఎంపీ

Posted: 02/18/2014 07:33 PM IST
Ponnam prabhakar touched sonia feet in lok sabha

కాంగ్రెస్ పార్టీ   తెలంగాణ ప్రకటన చేసిన నాటి నుండి  నేటి వరకు ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేస్తున్న  తెలంగాణ నాయకుడిగా  ఎంపీ  పొన్నం ప్రభాకర్   పేరు తెచ్చుకున్నారు.   తెలంగాణ పై సొంత పార్టీ అధినేత సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయం ఆయన ఆనందం వ్యక్తం చేయటం జరిగింది.  

కరీంనగర్ జిల్లా ప్రజలకు  అత్యంత  సేవలు చేస్తూ.. తెలంగాణ ప్రజల ఆకాంక్ష  నేరవేరాలని  ఆయన నిత్యం పోరాటం చేయటం జరిగింది. అంతే కాకుండా  మొట్టమొదటి సారిగా   కాంగ్రెస్ అధినేత్రి  సోనియా గాంధీకి  అట్టముక్కలతో   గుడికట్టి పుజాలు  భక్తుడు  పొన్నం ప్రభాకర్ .  

కాంగ్రెస్ ఎంపీగా ఉంటూనే తెలంగాణ సాధనం కోసం ఆయన కష్టపడారు.   మొన్న తెలంగాణ బిల్లు ను   పార్లమెంటు లో ప్రవేశపెడుతున్న సమయంలో .. సమైక్య వాదులు చేసిన ప్రయోగంలో.. గాయపడిన  నాయకుడు  పొన్నం ప్రభాకర్.  

తెలంగాణ వస్తున్న తరుణంలో సీమాంద్ర నేతలను అడ్డుకోవద్దని..నిత్యం చెబుతూ.. ప్రత్యేక తెలంగాణను సాధించుకున్నారు.  ఈరోజు రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి తెలంగాణ ఎంపీ పొన్నం ప్రభాకర్ పాదాభివందనం చేశారు. 

సభ నుంచి ఆమె వెళుతుండగా ఈ ఘటన జరిగింది. రాజకీయ పదవి కోసం  సీఎం ముఖ్యమంత్రి  నల్లారి కిరణ్  కుమార్ రెడ్డి  సోనియా గాందీకి  పాదాభివందనం చేస్తే,  పొన్నం ప్రభాకర్ మాత్రం ..తెలంగాణ ప్రజల కోసం  అమ్మకు పాదాభివందనం  చేయటం  జరిగిందని  తెలంగాణ నేతలు  అంటున్నారు.

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles