Ashok babu failed

APNGOon president ashok Babu, telangana bill, samaikyandhra movement, t-bill, ashok babu, cm kiran kumar reddy, seemandhra leaders, congress party, trs party, kcr, chandhra babu, ys jagan.

Ashok Babu failed,

అశోక్ ‘బాబు ’ఇది అవసరమా?

Posted: 02/07/2014 11:36 AM IST
Ashok babu failed

సమైక్యాంద్ర కోసం నిరంతరం పోరాటం చేస్తున్న వ్యక్తిగా వార్తల్లో ఎక్కిన ఎపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్ బాబు  మరో సారి సమ్మె బాట పట్టారు. అయితే  అశోక్ బాబు చేపట్టిన సమ్మె ఎవరి కోసం చేస్తున్నారో, ఎందుకోసం చేస్తున్నారో, ఎవరికి అర్థం కావటంలేదని .. రాజకీయ మేథావులు అంటున్నారు.  రాష్ట్రాన్ని  సమైక్యాంగా ఉంచటం కోసం ఆయన పోరాటం చేస్తున్నారనే విషయం తెలుసు.  అయితే  గత కొన్ని రోజుల నుండి  అశోక్ బాబు  ఎందుకు మౌనం వహించారో  ఎవరికి అర్థం కావటం లేదు.   పేపర్ పులి మాదిరి  రోజుకోక ప్రకటన చేస్తూ.. కాలం వెల్లబుచ్చిన విషయం తెలిసిందే.  తెలంగాణ బిల్లు  అసెంబ్లీకి  వస్తే .. యుద్దం చేస్తాం, బీభత్సం స్రుష్టిస్తాం అన్న అశోక్ బాబు..  అసెంబ్లీలో   తెలంగాణ బిల్లు పై చర్చ జరుగుతున్న సమయంలో ఎందుకు సైలెంట్ గా ఉండిపోయారు అర్థం కావటంలేదని .. రాజకీయ మేథావులు అంటున్నారు.   

అసెంబ్లీ నుండి తెలంగాణ బిల్లు.. పార్లమెంట్ కు చేరుకున్న తరువాత గానీ  అశోక్ బాబు నిద్రలేవలేదా? . అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి  ఢిల్లీలో మౌన దీక్ష చేసి, జై సమైక్యాంద్ర అంటే గానీ  అశోక్ బాబు మళ్లీ సమ్మెబాట పట్టాలేదు.  అంటే అశోక్ బాబుకు ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి దిక్కు సూచిగా ఉన్నాడనే విషయం అర్థమవుతుంది. అయితే.. అశోక్ బాబు ఏమీ ఆశించించి ఈ ఏపీఎన్జీవోల సమ్మె చేస్తున్నాడు తెలియదు గానీ,  దీనివలన సీమాంద్ర ప్రజలు పూర్తిగా నష్టపోతున్నారనే విషయం బాగా అర్థమవుతుంది. గతంలో 100 రోజులు ఉద్యమం చేసి అశోక్ బాబు  సాధించింది ఏమీ లేదు గానీ, ఆయన ఇమేజ్ మాత్రం  బాగా పెంచుకున్నాడనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అయిన  రాత్రి పూటే  కలలు కనాలి. అలా కాదని పగలు కలలు కంటానంటే.. అది మీ ఇష్టం అంటారు.  పగటి కలలు  నేరవేరవనే విషయం  అశోక్ బాబు  తెలుసుకోవాలి. ఎందుకంటే  తెలంగాణ బిల్లు  .. అసెంబ్లీ (హైదరబాద్) కి వచ్చినప్పుడు .. ఒక సమైక్యవాదిగా.. మీరు, మీరు సైన్యం ఏమీ చేయలేకపోయేరనే  విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసు. 

అలాంటి.. ఇప్పుడు   తెలంగాణ బిల్లు  అసెంబ్లీ (హైదరాబాద్ )దాటి పార్లమెంట్ (ఢిల్లీ)కి వెళ్లిపోయిన తరువాత.. మీరు .. ఎంత సమైక్య సునామీ పుట్టించిన  ఫలితం శూన్యమే అని రాజకీయ మేథావులు అంటున్నారు.  ఇప్పుడు తెలంగాణ బిల్లు  చివరి దశలో ఉన్న విషయం మీకు తెలుసు.. ప్రజలకు తెలుసు.. సీమాంద్ర నాయకులకు తెలుసు.. ఇలాంటి సమయంలో  ఇప్పుడు సమ్మె అవసరమా? అశోక్ బాబు ఆలోచించుకోవాలని ..  సమైక్య రాష్ట్రం కోరుకునే అభిమానులు ప్రశ్నిస్తున్నారు.  అసలు నిజం చెప్పలంటే.. సీమాంద్ర నాయకులు  గెలిచి.. ఓడిపోయారనే విషయం తెలుసుకోవాలి.  ఎందుకంటే తెలంగాణ కోసం మొదటి నుంచి పోరాటం చేస్తున్న వ్యక్తి .. ఒకే ఒక్క కేసిఆర్.  

ఇక సమైక్య రాష్ట్రం కోరుకునేవారు.. రాష్ట్ర  ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి,  చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్, అశోక్ బాబు. ఇంతమంది నాయకులు ఉండి కూడా.. సమైక్యాంద్ర ఉద్యమాన్ని నడిపించటంలో  ఘోరంగా విఫలం అయ్యేరనే విషయం తెలుగు గడ్డమీద పుట్టిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది.  అంటే ఇక్కడ స్వార్థం రాజకీయాలకు .. సీమాంద్ర నాయకులు ఆజ్యాం పోయటంతో.. ఈరోజు మనకు  ఇలాంటి ఖర్మ పట్టిందని .. సీమాంద్ర ప్రజలు  బాధపడుతున్నారు.  ఇక మన చెయి దాటిపోయిన తరువాత ..ఎన్ని ఉద్యమాలు, సమ్మెలు, దీక్షలు, చేసిన ఫలితం ఉండదనే విషయం తెలుసుకోవాలని .. రాజకీయ మేథావులు అంటున్నారు. 

-ఆర్ఎస్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles