Daggubati nota button pressed in rs polls

Daggubati Venkateswra Rao, Kiran Kumar reddy, NOTA Button, Rajyasabha election, congress party, cm kiran kumar reddy, minister daggubati purandeswari, daggubati.

Daggubati nota button pressed in RS polls

దగ్గుబాటి ఆ బటన్ నొక్కేసాడు?

Posted: 02/07/2014 12:24 PM IST
Daggubati nota button pressed in rs polls

కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి భర్త  దగ్గుబాటి  వెంకటేశ్వరరావు..  ఆ బటన్ నొక్కేసాడు. అంటే.. ఈరోజు  రాజ్యసభ ఎన్నికలు  జరుగుతున్న విషయం తెలిసిందే.   అయితే  రాజ్యసభ ఎన్నికల్లో  దగ్గుబాటి  వెంకటేశ్వరరావు  ‘నోటా’ బటన్ నొక్కేసాడు. అంటే ఆయన  రాజ్యసభ ఎన్నికల్లో  ‘తిరస్కరణ ఓటు ’  వేయటం జరిగింది,  కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు అభ్యర్థులను బరిలో పెట్టిన విషయం తెలిసిందే. అయితే  దగ్గుబాటి  వెంకటేశ్వరరావు మాత్రం  ఆ ముగ్గురికి ఓటు  వేయకుండా.. తిరస్కరణ ఓటు  వేశారు.  ఇటీవల ఎన్నికల కమిషన్  ప్రవేశపెట్టిన   ‘నన్ ఆఫ్ ది  ఎబౌ ’ అనే నోటా బటన్ ను దగ్గుబాటి ఉపయోగించారు. దీంతో ఆ ముగ్గురికి దగ్గుబాటి ఓటు చేందకుండా పోయింది.    ఆయన ఇలా చేయటం వెనుక కారణం ఉందని అంటున్నారు.  

రాష్ట్ర విభజన  ను వ్యతిరేకిస్తూ.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు  దగ్గుబాటి చెప్పటం జరిగింది.   అంటే సీమాంద్ర ప్రజల మనోభావాలను  కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదనే కారణంతో.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు  సమాచారం. అయితే  ఈ విషయన్ని ముందుగా  రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కి చెప్పిన తరువాతనే  ఇలా చేయటం జరిగిందని  దగ్గుబాటి  స్పష్టం చేశారు.   కాంగ్రెస్ అధిష్టానం  ఇలాంటివి జరుగుతాయేని ముందుగానే ఊహించి .. తగు చర్య తీసుకున్నట్లు  సమాచారం.  

ఇక దగ్గుబాటి బాటలో  ఎంత మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు .. నోటా బటన్  నొక్కి ఉంటారోనని..   రాజ్యసభకు పోటీ చేసిన అభ్యర్థులు భయపడుతున్నారు.   దగ్గుబాటి  నోటా బటన్  నొక్కిని విషయం  కాంగ్రెస్ పార్టీలో  హాట్ టాఫిక్ మారిందని కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు. దగ్గుబాటి  నోటా బటన్ నొక్కటం వెనుక ఎలాంటి రహస్యం ఉందో తెలుసుకోవాలంటే.. కొంచెం సమయం వేచి చూడాలి. 

-ఆర్ఎస్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles