Cm kiran out after rs polls

Cm kiran kumar reddy, cm kiran, Digvijay Singh, Kiran Kumar reddy, Seema andhra, telangana, congress party, telangana bill, tdp, ysrcp, samaikyandhra, samaikyandhra movement, telangana leaders, rajya sabha election, rajya sabha election 2014.

CM Kiran Out After RS Polls?

కరుడుగట్టిన సమైక్యవాదిని పీకేస్తారట?

Posted: 02/06/2014 03:30 PM IST
Cm kiran out after rs polls

సమైక్య వీరుడుగా  సీమాంద్ర ప్రజలకు పరిచయం అయిన రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి  ఇప్పుడు  కష్టకాలం రాబోతుందని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచటం కోసం ఆఖరి బంతి వరకు అలుపేరగని పోరాటం చేస్తానని సీమాంద్ర ప్రజలకు భరోసా ఇవ్వటం జరిగింది.  నిన్న ఢిల్లీలో  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి  సమైక్య రాష్ట్రం కోసం  మౌన దీక్ష చేయటంతో..  కాంగ్రెస్ అధిష్టానం ద్రుష్టిలో.. కరుడుగట్టిన సమైక్యవాదిగా ముద్రపడినట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు. ఇప్పటి వరకు  అధిష్టానికి వ్యతిరేకంగా వ్యవహరించిన వారు ఇన్ని రోజులు  లేరాని పార్టీలోని సినీయర్ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు.  

సమైక్యవాది అయిన  సిఎం కిరణ్ కు.. చెక్ పెట్టేందుకు .. కేంద్రం పావులు కదుపుతుంది.  అంటే  కరుడుగట్టిన  సమైక్యవాది అయిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని పీకేస్తారనే వార్తలు.. ఢిల్లీ లో హల్ చల్ చేస్తున్నాయి.  నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి  పై అధిస్టానం చాలా సీరియస్ గా ఉందని  కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్,  సీమాంద్ర కాంగ్రెస్ నాయకులతో చెప్పినట్లు  సమాచారం. అయితే ముఖ్యమంత్రి మార్పు ఖచ్చితంగా ఉంటుందని దిగ్విజయ్  సింగ్ అన్నట్లు కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.  అయితే రాజ్యసభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు వుంటుందనే సంకేతాలు పంపుతోంది కాంగ్రెస్‌ అధిష్టానం. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ నేతలకు ‘ముఖ్యమంత్రి మార్పు’కి సంబంధించి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌ సమాచారం ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. 

అయితే ఈ వార్తల్లో నిజమెంతోగానీ, ఇప్పుడు సిఎంని మార్చడం వల్ల కాంగ్రెస్‌కి ఒరిగేదేమీ లేదని .. సీనియర్ కాంగ్రెస్ నాయకులు బహిరంగగానే అంటున్నారు.  అయితే  సీఎంని  పీకేయటంతో .. ఒకరంగా తెలంగాణ నేతలు  విజయం సాధించినట్లు అవుతుందని   కాంగ్రెస్ పెద్దలే అంటున్నారు.  ఇప్పుడు సిఎంని మార్చటం వల్ల  కాంగ్రెస్ పార్టీకి  భారీ నష్టం జరిగే అవకాశం  ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే  సీమాంద్రలో  కాంగ్రెస్ జెండ కనిపిస్తే .. కాల్చిపారేస్తున్నా రోజులివి. ఇలాంటి  సమయంలో  కాంగ్రెస్ అధిష్టానం  సీఎంను మార్చి  మరో పెద్ద తప్పు చేస్తుందని  కాంగ్రెస్ కార్యకర్తలే  అంటున్నారు. 

సిఎం పై కాంగ్రెస్ పార్టీ  చర్యలు తీసుకున్న వెంటనే.. ఆయన సమైక్యవాదిగా మారి, సమైక్య ఉద్యమాన్ని మరింత  ఉద్రుతం చేస్తాడని, దీంతో  కాంగ్రెస్ పార్టీ సీమాంద్రలో కనిపించకుండా పోతుందని  రాజకీయ విశ్లేషాకులు అంటున్నారు.  అయిన  సీఎం కిరణ్ కు  కాంగ్రెస్ పార్టీలో ఉంటే  బలం. అలాంటి ఆయన కాంగ్రెస్ పార్టీని కాదని బయట తన ఏజెండాను ఎగురవేయగలడా? అనే అనుమానం  కూడా కలుగుతుంది?  ఇప్పటికే  సమైక్యవాదులం అని చెప్పుకొని సీమాంద్రలో తిరుగుతున్న  తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల దెబ్బ కు   సిఎం కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యవాదం నిలబడుతుందా?  ఏమైన సీఎంను పీకేయటంతో.. కొత్త సమస్యలను కాంగ్రెస్ కొని తెచ్చుకున్నట్లే అవుతుందని  సీనియర్ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు.  అయిన ఏ నిమిషానికి  కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగును.. ఆ పార్టీ నాయకులకే తెలియాని పరిస్థితుల్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే చివరి నిమిషంలో ఏం జరుగుతుందో  చూద్దాం. 

 

ఆర్ఎస్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles