గణతంత్ర దిన సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి భవన్ లో తన నివాసంలో నిర్వహించిన ఎట్ హోం కార్యక్రమానికి ఎందరో ప్రముఖులు హాజరయ్యారు. అయితే అందులో సాధారణ దుస్తులలో హాజరైన ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వాహకుడు అరవింద్ కేజ్రీవాల్ విశేషాకర్షణగా నిలవటం విశేషం. అక్కడకు విచ్చేసినవారిలో చాలామంది కేజ్రీవాల్ ని కలిసి ఆయనతో మాట్లాడి ఆయనతో కరచాలనం చెయ్యటానికి ఆత్రుత చూపించారు. అందులో చాలా మంది ఆయన ఆటోగ్రాఫ్ కోసం ఎగబడ్డారు. దీనితో కేజ్రీవాల్ మీద క్రేజ్ ఏ స్థాయిలో పెరిగిపోయిందన్నది అర్థమౌతోంది.
సామాన్య ప్రజలకోసం పనిచేసే పార్టీగా ఆవిర్భవించిన ఆమ్ ఆద్మీ పార్టీ ని స్థాపించి ఢిల్లీ గద్దెను అధిరోహించిన కేజ్రీవాల్ సామాన్య ప్రజానీకంతో పాటుగా అధికారుల దృష్టిలో కూడా హీరో అయ్యారని ఈ సన్నివేశం తెలియజేస్తోంది.
కాకపోతే పెరుగుతున్న ఆదరణ వైరి వర్గాలలో అలజడి కూడా సృష్టిస్తుందని అదే రోజు పంజాబ్ లో జరిగిన గణతంత్ర ఉత్సవాలలో నిరూపితమైంది. అక్కడ హాజరైన ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలను కొన్ని బృందాలు దాడిచేసి అక్కడినుండి తరిమికొట్టాయి. ఆ పార్టీ నేత అశోక్ తల్వార్ మాట్లాడుతూ పథకం ప్రకారమే కార్యకర్తల మీద దాడి జరిగిందని అన్నారు.
హిందూ క్రాంతి కారి సేనగా ప్రకటించుకున్న ఆ అల్లరి బృందం అమృత్ సర్ లో రాంబాగ్ గార్డెన్ లో జరిగిన గణతంత్ర వేడుకలకు హాజరైన కార్యకర్తల మీద కర్రలతో దాడి చేసి అక్కడి నుండి తరిమికొట్టారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more