సీనియర్ సినీ నటి, సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జయసుధ త్వరలో టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్దం అయినట్లు సమాచారం. రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం జయసుధ మహబూబునగర్ జిల్లాకు చెందిన సీనియర్ మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే అయిన ద్వారా ఆ పార్టీలో చేరడానికి మార్గం సుగమం చేసుకుందని అంటున్నారు.
రాబోయే ఎన్నికల్లో మహబూబునగర్ జిల్లా నుండి తప్పకుండా టీఆర్ఎస్ టిక్కెట్ ఇప్పిస్తానని సదరు ఎమ్మెల్యే హామీ కూడా ఇచ్చాడని సమాచారం. ఇక పోతే జయసుధ కూడా గత కొన్ని రోజుల నుండి కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు రావాలనే చూస్తుంది. గతంలో ఈమె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతుందనే ప్రచారం కూడా జరిగింది.
కాంగ్రెస్ లో ఉన్న గ్రూపు రాజకీయాలు, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడే అవకాశాలు చాలా తక్కువగా ఉండటంతో తన గెలుపు కూడా కష్టమనే భావించిన తన రాజకీయ భవిష్యత్తును ద్రుష్టిలో పెట్టుకొని ఈమె టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు అన్నీ సిద్దపడటమే కాకుండా మల్కాజిగిరి ఎంపీ టిక్కెట్ కూడా అడగటమే కాకుండా, అక్కడ పోటీ చేస్తే తప్పకుండా విజయం సాధిస్తాననే ధీమాను కూడా వ్యక్తం చేసిందట.
ఎందుకంటే కంటే ఎక్కువ మంది ఓటర్లు సెటిలర్స్, మైనారీ వర్గాలకు చెందిన వారు ఉండటమే కారణం అని టీఆర్ఎస్ పెద్దలకు చెబితే పార్లమెంటులో తెలంగాణ బిల్లు తేలిన తరువాత ఎంపీ టిక్కెట్ పై నిర్ణయం తీసుకుంటామని జయసుధకు చెప్పారని పార్టీ వర్గాలు అంటున్నాయి. మొత్తానికి జయసుధ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లోపు గుడ్ బై బెబుతుందన్నమాట.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more