Can chief minister stage a protest

can chief minister stage a protest, Arvind Kejriwal, Delhi Chief Minister Kejriwal, Jan Lokpal bill, Delhi Ramlila grounds

can chief minister stage a protest

ముఖ్యమంత్రి ధర్నా చెయ్యవచ్చా?

Posted: 01/25/2014 05:34 PM IST
Can chief minister stage a protest

ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఢిల్లీలో ధర్నా చేసిన అరవింద్ కేజ్రీవాల్ మీద భాజపాయే కాకుండా ఆఆపా కి మద్దతిచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా విమర్శల వర్షం కురిపించింది.

ఢిల్లీ ముఖ్యమంత్రైయ్యిండి ధర్నాల వలన ఢిల్లీ ప్రజలకు ఇబ్బంది కలిగించారని కొందరంటే ఆ స్థాయిలో మనిషి చెయ్యదగ్గ పని కాదని, ఇంతా హడావిడి చేసింది కేవలం ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేయించటానికేనా అని, మంకు పట్టుతో పిచ్చిగా ప్రవర్తించారని మరి కొందరు వ్యాఖ్యానించారు.

నేను రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా చదివాను, ముఖ్యమంత్రి ధర్నా చెయ్యగూడదని అందులో ఎక్కడా లేదని అన్నారు కేజ్రీవాల్.  

ధర్నా ఎందుకు చేస్తారసలు, ఆందోళన ఎందుకు ప్రదర్శిస్తారు అంటే ఎవరైనా జరిగిన అన్యాయం పట్ల వాళ్ళ నిరసనను తెలియజేసే హక్కుంది కాబట్టి.  ముఖ్యమంత్రి తన ప్రభుత్వం మీదనే నిరసన తెలియజేసినట్లయితే అది వింతగా ఉందని అనవచ్చు కానీ కేజ్రీవాల్ నిరసన ధ్వజం ఎత్తింది కేంద్ర ప్రభుత్వం మీద.  ఎలుగెత్తి చాటింది తన ప్రభుత్వానికి చట్టాన్ని అమలుపరచే సేన లేని విషయాన్ని.   ఆ మూడు రోజులు దీక్ష చెయ్యటమే కాకుండా పనులు ఆగిపోకుండా కేజ్రీవాల్ ఫైళ్ళను అక్కడికే తెప్పించుకుని పూర్తి చేసారు.  మంత్రి వర్గ సమావేశం కూడా దీక్షాస్థలిలోనే జరిగింది.  

ఆ పోలీసుల మీద కేజ్రీవాల్ కి పగేమీ లేదు.  కానీ చెప్పిన మాట వినని బంట్లు ఉండి ఎందుకు?  తన ఆందోళన ద్వారా రాజ్యాంగ ఉల్లంఘనేమీ జరగలేదని చెప్పారు కేజ్రీవాల్ మీడియా ప్రతినిధుల సమావేశంలో.  దానితో పాటుగా జన్ లోక్ పాల్ బిల్లు తయారయిందని, ఫిబ్రవరిలో రామ్ లీలా మైదాన్ లో సభను నిర్వహిస్తామని, జన్ లోక్ పాల్ బిల్లుని తెస్తామని కేజ్రీవాల్ అన్నారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles