Karunanidhi son may join jayalalitha party

Karunanidhi son May join Jayalalitha party, Alagiri join Jayalalitha, PoliticalPlay,Politics,Stalin,Tamil Nadu

Karunanidhi son May join Jayalalitha party, Alagiri join Jayalalitha, PoliticalPlay,Politics,Stalin,Tamil Nadu

జయలలిత పార్టీలోకి అళిగిరి ?

Posted: 01/13/2014 06:04 PM IST
Karunanidhi son may join jayalalitha party

కొన్ని దశాబ్ధాలుగా పచ్చగడ్డ వేస్తే భగ్గుమనే రీతిలో కొనసాగుతున్న  తమిళనాడు ముఖ్యమంత్రి  జయలలిత, మాజీ ముఖ్యమంత్రి  కరుణానిధి  ల వైరం ఇప్పుడు మరోమారు  తెరమీదికొచ్చింది. దీనికి కారణం డిఎంకె అధినేత కరుణానిధి  తనయుడు  అళగిరి జయలలిత చెంతకు చేరనున్నాడని  తెలుస్తోంది. తండ్రితో ఎంతో కాలంగా విభేదాలతో రగిలిపోతున్న అళగిరి ఇప్పుడు జయలలిత  దగ్గర తీర్థం పుచ్చుకోబోతున్నాడు.

ఈ నేపధ్యంలో తమిళనాట రాజకీయాలు  తారాస్థాయికి  చేరుకుంటాయని  విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే వారసత్వ రాజకీయాలతో అట్టుడికిపోతున్న  తమిళ తంబిలకు  ఇప్పుడు మరో కొత్త  సమస్య తెర మీదకు  వచ్చింది. కరుణానిధి  కొడుకుల వ్యవహారం పార్టీలో పలు విభేధాలకు కారణమవుతోంది. పార్టీలో పట్టుకోసం  ఎంతగానో ప్రయత్నిస్తున్న అళగిరికి ఎదుదెబ్బలే  తగులుతున్నాయి. 

పార్టీ అధికారంలో  ఉన్న సమయంలో  అళగిరి, స్టాలిన్ల మధ్య తీవ్ర వైరం నెలకొంది. గతంలో కరుణానిధి సైతం స్టాలిన్ ను దగ్గరకు తీసుకుంటున్నట్లు  వార్తలు వచ్చాయి. దీంతో అళగిరి  తీవ్ర అసంత్రుప్తితో రగిలిపోతూ  కరుణపై కాలుదువ్వడానికి  సిద్ధమవుతున్నాడు. అందుకే  అతను జయలలితతో చేతులు కలుపుతున్నట్లు తెలుస్తోంది . అదే జరిగితే తమిళనాడు రాజకీయాల్లో  పెను సంచలనం అవుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles