Kejriwal attacks narendra modi and congress

kejriwal,narendra modi issue, aam admi parthy, aam attack bjp, 2014 election seen, congress position, narendra modi and kejriwal

Kejriwal attacks Narendra Modi and Congress

మోడీతో కయ్యానికి కేజ్రీవాల్

Posted: 01/15/2014 03:37 PM IST
Kejriwal attacks narendra modi and congress

 

 

 

మొన్న డిల్లీలో  అధికారాన్ని చేజిక్కించుకున్న ఆమ్ ఆద్మి పార్టీ ఇతర పార్టీలకు  సవాల్ విసురుతోంది. తమ సత్తాను వచ్చే ఎన్నికల్లో  పూర్తి స్థాయిలో చాటుతామని  భుజాలు  ఎగరేస్తోంది. కాంగ్రెస్ ను మట్టి కరిపించిన  ఉత్సాహంలో  ఉన్న ఆమ్ ఆద్మి పార్టీ వచ్చే ఎన్నికల్లో  బిజెపి పనిపడతామని  ప్రగల్భాలు పలుకుతోంది. ప్రజాదర్భార్  తో ప్రజలను నేరుగా కలుస్తామని  చెప్పిన ఆ పార్టీ  అధినాయకుడు  ఆదిలోనే దానికి మంగళం పలికి అనేక విమర్శలు  ఎదుర్కొన్నారు.

రాబోయే ఎన్నికల్లో బిజెపి, ఆమ్ పార్టీల మధ్యనే  పోటీ ఉంటుదని, కాంగ్రెస్  ఎన్నికల చిత్రంలోనే  కనిపించదని  కే్జ్రీవాల్ చెప్పకొచ్చాడు.  దేశంలో ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితుల్లో  ఎన్నికల అనంతం  కాంగ్రెస్  కనుచూపుమేరలో  కూడా కనిపించదని , కాంగ్రస్ లో వెలికివస్తున్న అవినీతి బాగోతాలే అందుకు  కారణమని  కేజ్రీవాల్ సెలవిచ్చారు. అదేవిధంగా గత 15 సంవత్సరాలనుండి  కాంగ్రెస్ పాలనను భరిస్తున్న ప్రజలు ఇకపై దానినుండి విముక్తి కోరుకుంటున్నాదని,   అందు కే పరో ప్రత్యామ్నాయాన్ని వెతుకుతున్నారని  పేర్కొన్నారు.

అదేవిధంగా బిజెపిలోనూ అవినీతి వేళ్లు నాటుకుపోయాయని  దానికీ బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని  అన్నారు. ఇవన్నీ తమకు కలిసి వస్తాయని  కేజ్రీవాల్ అంటున్నారు. అయితే దీనికి స్పందించిన  కాంగ్రెస్ నాయకులు  మాత్రం ఢిల్లీలో ఎన్నికలకు  వివిధ రాష్ర్టాల్లో జరిగే ఎన్నికలకు  ఎంతో వ్యత్యాస మంటుందని, ఇక్కడి లెక్కలే వేరని కేజ్రీవాల్ వ్యాఖ్యలను కొట్ట పారేస్తున్నారు. అయితే మోడీ సారధ్యంలో బిజెపి మరింత పుంజుకుందని  ఎన్నికల్లో విజయం తమదేనని  వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఢిల్లీలోని  ప్రస్తుత పరిస్థితులు  ఆమ్ ఆద్మి పార్టికి కలిస వచ్చాయి తప్పా మరొకటి కాదని వారంటున్నారు. ఏది ఏమైనప్పటికీ 2014 ఎన్నికలు  రసవత్తరంగా ఉంటాయనడంలో ఎంతమాత్రం సందేహం లేదు.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles