Devyani khobragade returns india

Devyani Khobragade returns India, Devyani visa fraud case in US, Ministry of External Affairs, US State Department

Devyani Khobragade returns India

బ్రతుకు జీవుడా

Posted: 01/10/2014 10:48 AM IST
Devyani khobragade returns india

ఒక పెద్ద మనిషి చేసిన దొంగతనం ఫిర్యాదు మేరకు ఆ ఇంట్లో పనిచేసే మనిషిని పట్టుకుని పోలీసులు చావు దెబ్బలు కొట్టారు.  కానీ దొంగ వేరే అని తెలుసుకున్న పోలీసులకు ఆ పనిమనిషిని వదిలి పెట్టటం కూడా పోలీసు దర్పానికి భంగం కలుగకుండానే చేసారు. 

ఆ ఇల్లు, ఈ ఊరు కూడా వదిలిపెట్టిపో.  అయ్యగారు వచ్చేలోపులో దూరంగా వెళ్ళిపో లేకపోతే ఇంకా కుళ్ళబొడుస్తారు అని చిన్న అధికారి అతగాడిని వదిలి పెట్టాడు.  పోలీసు దెబ్బలకు కుంటుకుంటూ వెళ్ళిపోయే ఆ పనిమనిషి తలెత్తి చూడకుండా బ్రతుకు జీవుడా అనుకుంటూ ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. 

దేవయాని ఖోబ్రాగడే కేసు అంతస్తులో తేడా ఉన్నా అంతకంటే భిన్నమైనదేమీ కాదు.  తప్పు చేసిన అధికారి తన తప్పుని ఒప్పుకోలేదు.  అధికారుల ప్రవర్తనకు బాధ్యత వహించవలసిన స్టేట్ డిపార్ట్ మెంట్ జరిగినదానికి సంజాయిషీ ఏమీ ఇచ్చుకోలేదు.  ప్రభుత్వం తరఫునుంచి ఎటువంటి స్వాంతనపూర్వకమైన మాటలూ రాలేదు.  దేశం వదిలిపెట్టి పోవటమే నీకు శ్రేయస్కరం అని దేవయానికి నచ్చచెప్పారు. 

కేసు ఇంకా నడుస్తూనేవుంది కానీ పూర్తి ఇమ్యూనిటీతో డిప్లామాట్ భారత్ కి వెళ్ళిపోయారు అని 13 న కోర్టుకి రావలసిన ప్రాధమిక విచారణ గురించి లేఖ పంపించారు ప్రాసిక్యూషన్ విభాగంవారు.  అలా ముఖం చెల్లేట్టుగా చేసుకోవటానికి అమెరికాకు మన ప్రభుత్వం కూడా సహకరించింది.  ఆమెను మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్ టర్నల్ అపైర్స్ కి బదిలీ చేసారు.  ఆమె ఉద్యోగంలో బదిలీ వలన భారతదేశం వచ్చేస్తోంది (బ్రతుకు జీవుడా అనుకుంటూ).

అమెరికాకు ఇంక రాం రాం (మేమిక రాము అని) అంటూ దేవయాని కుటుంబ సమేతంగా భారత్ కి తిరిగి వచ్చేస్తున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles