ఏనుగు తొండం పట్టిన మొసలి.. ఎవరు రక్షించారో చూడండి | How Baby elephant escaped from Crocodile.

Baby elephant escaped from crocodile

Baby Elephant Video, Elephant Crocodile Video, Malawi Baby Elephant Video, Liwonde National Park Baby Elephant, Baby Elephant Trunk Crocodile, Baby Elephant Rescued, Crocodile Baby Elephant, Elephant Save Baby Elephant, Gajendra Moksham Video

Crocodile Grabs Baby Elephant's Trunk. Luckily escaped with the help of Another Elephant. The incident took place at Liwonde National Park in Malawi. Mr Makanga, a biomedical scientist, captured the scene from his safari boat.

ITEMVIDEOS:దేవుడు దిగి రాకపోయినా సరే...

Posted: 04/18/2017 09:45 AM IST
Baby elephant escaped from crocodile

వర్ణనాతీతమైన రీతిలో ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో.. తేడా వస్తే అంతే భయంకరంగా కూడా మారిపోతుంటుంది. కానీ, తమ మనుగడ కోసం మరోక జీవిపై ఆధారపడి బతకటం అనే సిద్ధాంతం మాత్రం ఎప్పటికీ మారదు. అలాంటి సమయంలోనే రక్షణ కోసం కొన్ని జంతువులు గుంపులుగా బతకటం చూస్తుంటాం.

ఇక్కడ ఓ వీడియో చూడండి. పిల్ల ఏనుగును రక్షించేందుకు ఏనుగుల మంద ఎంత సాహసం చేశాయో. నీళ్లలో ఏనుగు బలాన్ని అంచనా వేసి కూడా దాన్ని రక్షించేందుకు మూకుమ్మడిగా ముందుకు కదిలాయి. అలెగ్జాండర్ మకంగా తన సోషల్ మీడియాలో షేర్ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళ్లితే... మలావీలోని లివోండే జాతీయ పార్కులో ఓ ఏనుగుల గుంపు నీరు తాగటానికి వెళ్లింది. అందులో ఓ ఏనుగు పిల్ల నీళ్లు తాగేందుకు తొండాన్ని నీటిలో చాచగానే అప్పటికే కాచుకుని ఉన్న మొసలి దానిని పట్టుకుంది. దీంతో ఆ గున్నేనుగు ఘీంకారం చేస్తూ వదిలించుకునే ప్రయత్నం చేసింది. అయితే మొసలి వదలకపోవడంతో దానిని పట్టుకుని ఒడ్డుకు లాక్కొచ్చేందుకు ఏనుగు ప్రయత్నించింది. ఇంతలో గుంపులో ఉన్న మిగతా ఏనుగులు అరుస్తూ మొసలిని భయపెట్టే యత్నం చేశాయి. ఇంతలో మరో గజరాజు మకరం పని పట్టేందుకు ముందుకు అడుగేసింది. అంతే, భయంతో మొసలి చిన్న ఏనుగును వదిలేసింది.

 

గజేంద్ర మోక్షంలో మహావిష్ణువు అవసరం లేకుండా ఈ పిల్ల ఏనుగు ప్రాణాలు కాపాడాయి తోటి ఏనుగులు. కొన్ని రోజుల క్రితం ఓ గుర్రం మొసలిని చెడుగుడు ఆడుకున్న వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Malawi  Liwonde National Park  Baby Elephant Video  

Other Articles