chandrababu naidu narrates the full drama on call money

Chandrababu naidu narrates the full drama on call money

Chandrababu Naidu, Call money, jagan, Jagan on Call Money, Roja, yanamala Ramakrishnudu, AP, Assembly

chandrababu naidu narrates the full drama on call money. AP CM Chandrababu Naidu sucessfully operating the assembly sessions on call money issue.

కాల్ మనీ ఖతం.. అసెంబ్లీలో చంద్రబాబు చాణిక్యం..?

Posted: 12/19/2015 11:56 AM IST
Chandrababu naidu narrates the full drama on call money

కాల్ మనీ వ్యవమారాన్ని తొక్కేశారు...? తెలుగు ఆడపడుచుల వ్యధను కనీసం చర్చించను కూడా చర్చించలేదు. ఏపి ముఖ్యమంత్రి సాక్షిగా ప్రతిపక్షాలు ఎంత మొత్తుకున్నా దానికి ప్రతిఫలం లేకుండా పోతోంది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన కాల్ మనీ వ్యవహారం మీద కనీసం కండితుడుపు చర్చకు కూడా దారి తీయని. అసెంబ్లీ సమవేశాలను చాణిక్యంగా నడిపించిన టిడిపి సర్కార్ ను ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. కాల్ మనీ వ్యవహారం మీద రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా చర్చ సాగుతోంది. జాతీయ మీడియాలో కూడా దీని మీద కథనాలు వచ్చాయి. డబ్బులతో పాటు సెక్స్ తో ముడిపడిన ఈ వ్యవమారం మీద తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి. అయితే చంద్రబాబు సర్కార్ మాత్రం దీని మీద ఏ మాత్రం స్పందించరు.

Also Read: రోజా... ఓ ఆడదా..? చంద్రబాబు నాయుడు 

చంద్రబాబు నాయుడు చాణిక్యం గురించి అందరికి తెలుసు. ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ.. రాజకీయరంగంలో తలపండిన మేధావి. అయితే రాజకీయాలు చేసే వారికి యుక్తులు, కుయుక్తులు ఉండాల్సిందే. అయితే వాటిని మంచిగా వాడాలి కానీ ప్రతి రాజకీయ అంశానికి వాడుకుంటే బాగుండదు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన కాల్ మనీ అండ్ సెక్స్ రాకెట్ మీద ప్రతిపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. ఎలాగైనా కాల్ మనీ వ్యవహారం మీద ప్రభుత్వాన్ని నిలదీయడమే కాకుండా.. దాని మీద ప్రకటన రాబట్టాలని ప్రతిపక్షాలు కంకణం కట్టుకున్నాయి. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం దీని మీద ఎలా స్పందించాలో.. ఎలా రాజకీయంగా దీన్ని అణగదొక్కోలో అలా చేస్తున్నారు.

Also Read: ఏపి అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతు నొక్కుతారా..? 

అసెంబ్లీ సమావేశాలను కేవలం ఐదు రోజులు పెట్టడం దగ్గరి నుండి.. అసెంబ్లీలో అంబేద్కర్ చర్చ వరకు చంద్రబాబు చాణిక్యం కనిపించింది. అంబేద్కర్ చర్చకు అడ్డుతగులుతున్నారని చంద్రబాబు నాయుడు లేని రాద్దాంతం చేశారు. అయితే అంబేద్కర్ మీద, కాల్ మనీ వ్యవహారం మీద చర్చించడానికి అసెంబ్లీ సమావేశాలను మరో రెండు మూడు రోజులు పొడగించండి దానికి తాము సహకరిస్తామని జగన్ ప్రకటన చేసినా కానీ ప్రభుత్వం మాత్రం అందుకు సిద్దపడలేదు. ఎందుకంటే సభను మరిన్ని రోజులు పొడిగిస్తే ఇబ్బందులు తప్పదని చంద్రబాబుకు బాగా తెలుసు.. అందుకే దాని మీద స్పందించలేదు.

Also Read: అసెంబ్లీ వద్ద రోజా హల్ చల్.. పోలీస్ స్టేషన్ కు తరలింపు 

కాల్ మనీ వ్యవహారం మీద ముందు చర్చించి, ఆ తర్వాత సిఎం గారు ఏదో ప్రకటన చెయ్యాలని జగన్ డిమాండ్ చేశారు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం దాన్ని పట్టించుకోలేదు. మంత్రి యనమల రామకృష్ణుడు దాని మీద స్పందిస్తూ.. ముందు ప్రకటన తర్వాత దాని మీద క్లారిఫికేషన్ అంటూ ప్రతిపక్షాలు ఏం చెయ్యాలో కూడా నిర్దేశించారు. ఇక సిఎం ప్రకటన చేసే క్రమంలో వైసీపీ నాయకులు ఆందోళన చెయ్యడం దాని మీద ప్రభుత్వం సీరియస్ కావడం.. తర్వాత రోజాను సస్పెండ్ చెయ్యడం అంతా రాజకీయ చక్రంలో భాగంగా సాగింది.

Also Read: బుల్లెట్ దిగిందా లేదా అని అసెంబ్లీలో అనొచ్చా..? 

రోజాను సస్పెండ్ చెయ్యడం వరకు రెండు రోజుల అసెంబ్లీ సమావేశాలు వృధా అయ్యాయి. అయితే మూడో రోజు అసెంబ్లీలో అదే సీన్లు రిపీట్ అయ్యాయి. అసలు కాల్ మనీ మీద చర్చ జరగకుండా.. రోజా మీద, జగన్ మీద అనవసర రాద్దాంతం జరిగింది. అయితే రోజా మీద వివాదం రేగడంతో.. అచ్చెన్నాయుడు ప్రతిపక్షాలకు వార్నింగ్ ఇచ్చారు.. తీరు మార్చుకోవాలని లేదంటే రోజా గతేపడుతుందని. ఇలా చంద్రబాబు నాయుడు ఓ పద్దతి ప్రకారం కాల్ మనీ చర్చ అసెంబ్లీలో తలెత్తకుండా తొక్కేశారు. ఇక గందరగోళం మధ్యన కొన్ని బిల్లులను ప్రవేశపెట్టి.. వాటిని ఆమోదించుకోవడం టకటకా జరుగుతున్నాయి. అయితే కాల్ మనీ వ్యవహారం మీద ఎవరిని వదిలిపెట్టం.. ఎంతటి వారికైనా శిక్ష తప్పదు అంటూ ఓ ప్రకటన తప్ప చంద్రబాబు నాయుడు కాల్ మనీ మీద ఎలాంటి ప్రకటన చెయ్యకపోవడం.. తెలుగుదేశం నాయకులు కూడా దీని వెనక ఉన్నారన్న దాని మీద మాట్లాడటం కానీ చెయ్యలేదు. మరి దీన్ని చంద్రబాబు మార్క్ రాజకీయం అని అనరా..? ఏంటి..?

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu Naidu  Call money  jagan  Jagan on Call Money  Roja  yanamala Ramakrishnudu  AP  Assembly  

Other Articles