AP govt not giving any chance for opposition to speak

Ap govt not giving any chance for opposition to speak

AP, Assembly, Chandrabbabu, Jagan, Call Money, Call Money in AP

In AP assembly the govt not giving the chance to speak on call money issue. The opposition leader jagan slams govt and chandrababu naidu.

ఏపి అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతు నొక్కుతారా..?

Posted: 12/18/2015 09:29 AM IST
Ap govt not giving any chance for opposition to speak

ఏపి అసెంబ్లీలో కాల్ మనీ మీద దుమారం రేగుతోంది. నిన్న కాల్ మనీ మీద వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెడితే స్పీకర్ దాన్ని తిరస్కరించారు. నిన్నటి లాగా నేడు కూడా కాల్ మనీ తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. అయితే దీని మీద ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. కాల్ మనీ మీద ఎందుకు చర్చకు మీరు సిద్దంగా లేరని.. ప్రతిపక్షనాయకుడు జగన్ నిలదీశారు. అయితే ఏపి అసెంబ్లీలో ప్రతిపక్షాల వాదనకు స్పీకర్ అనుమతి నిరాకరిస్తుండటం వివాదాస్పద మవుతోంది. నిన్న ప్రభుత్వమే.. సాక్షాత్తూ చంద్రబాబు నాయుడే.. రేపు కాల్ మనీ మీద మాట్లాడదామని అన్నారు. కానీ నేడు మాత్రం దాని ఊసులేకుండా చేస్తున్నారు.

ముందుగా ఏపి సిఎం చంద్రబాబు నాయుడు కాల్ మనీ మీద ప్రకటన చేస్తారని.. ఆ తర్వాత దాని మీద క్లారిటీ ఇస్తారని.. ఆ తర్వాత ప్రతిపక్షాలకు ఏమైనా సందేహాలు ఉంటే క్లారిటీ ఇస్తామని యనమల రామకృష్ణుడు ప్రకటించారు. దీని మీద జగన్ ఫైరయ్యారు. ప్రతిపక్షాలు ఏం మాట్లాడాలో కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుందా అని మండిపడ్డారు. కేవలం సిఎం ప్రకటన. తర్వాత దాని మీద చర్చ అని కాకుండా మొత్తం వ్యవహారం మీద ముందు చర్చ జరిపి.. మా పక్ష వాదనలు విన్న తర్వాత సిఎం ప్రకటన చెయ్యాలని జగన్ వాదించారు. అయితే సభా నియమాలకు అనుగుణంగానే తాము ఇలా చేస్తామని యనమల రామకృష్ణుడు తన వాదనను వెనకేసుకు వచ్చారు. మొత్తంగా ప్రభుత్వం ప్రతిపక్షాల ధాటికి ఒక్కిరిబిక్కిరి అవుతోంది అన్నది మాత్రం వాస్తవం. మరి ఎలా ఉన్నా శాసనసలో అన్ని పక్షాల వాదనలు పూర్తిగా వినిపించాల్సిన అవసరం ఉంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP  Assembly  Chandrabbabu  Jagan  Call Money  Call Money in AP  

Other Articles