Narasimhan | Governor | AP | Telangana | Tapping, ESL Narasimhan

I will soon be a common man said govenor narasimhan

Narasimhan, Governor, AP, Telangana, Tapping, ESL Narasimhan

I will soon be a common man said Govenor Narasimhan Is Governor of Telangana and Andhra Pradesh ESL Narasimhan on his way out? This speculation gained ground on Thursday with his own remark while addressing a meeting here. While addressing the pharma meeting, Narasimhan said the corporate medicare sector was fleecing the common man.

గవర్నర్ గిరి పోతుంది.. మామూలు పౌరుడినవుతా: నరసింహన్

Posted: 07/24/2015 11:12 AM IST
I will soon be a common man said govenor narasimhan

అవును.. మీరు అనుకుంటున్నట్లు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్కు త్వరలోనే గవర్నర్ గిరి ఊడుతుంది.... అయితే గతంలోలాగా ఇదేదో గాలి వార్త కాదు. స్వయంగా నరసింహన్ చెప్పిన మాట. ఉమ్మడి ఏపికి గవర్నర్ గా ఉన్న నరసింహన్ ను విభజన తర్వాత కూడా తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా కొనసాగించింది కేంద్ర ప్రభుత్వం. అయితే గత కొంత కాలంగా రెండు రాష్ట్రాలలో చోటుచేసుకున్న పరిణామాలు గవర్నర్ కు కొత్త తలనొప్పులు తీసుకువచ్చింది. దాంతో గవర్నర్ నరసింహన్ మార్పు ఖాయం అంటూ చాలా పుకార్లు వచ్చాయి. నరసింహన్ ను తొలగించాలని... చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం మీద వత్తిడి తీసుకువస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి. అయితే కొన్ని రోజులు ఇదిగో.. అదిగో గవర్నర్ మార్పు జరగబోతోంది అంటూ వార్తలు వచ్చినా కానీ అలాంటిదేమీ జరగలేదు.

Also Read:  గవర్నర్ మార్పు, కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం లేదు

తాజాగా ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ త్వరలో తాను మామూలు వ్యక్తిగా మారుతున్నానని అంటూ వ్యాఖ్యానించడం  తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. అయితే ట్యాపింగ్ వివాదం మీద గవర్నర్ పై ఏపి ప్రభుత్వం గుర్రుగా ఉంది. హైదరాబాద్ లో శాంతి భద్రతలను గవర్నర్ పరిపక్షించాల్సింది పోయి.. తెలంగాణ ప్రభుత్వానికి వంతపాడుతున్నారని ఆరోపిస్తు ఏపి ప్రభుత్వం ఆరోపించింది. దీని మీద రాష్ట్రపతి, ప్రధాని మోదీ, హోంమంత్రితో పాటు పలువురు మంత్రులను కూడా కలిసి ఏపి ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు ఫిర్యాదు చేశారు.

Also Read:  నరసింహన్ ఊస్ట్.. నజ్మాకు గవర్నర్ పోస్ట్

ట్యాపింగ్ వివాదంలో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఏమీ చెయ్యకుండా ఉన్నారని.. ఓ రకంగా మొత్తం వ్యవహారానికి వంత పాడుతున్నారని ఏపి ప్రభుత్వం ప్రధానంగా ఆరోపిస్తు ఫిర్యాదు చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై గవర్నర్ నరసింహన్ ను పిలిచి తలంటినట్లు సమాచారం. అయితే ఒకానోక సమయంలో గవర్నర్ తీవ్ర వత్తిడికి గురై. తనను గవర్నర్ పదవి నుండి తప్పించాలని కోరారని దానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదని సమాచారం. మరి తాజాగా నరసింహన్ వ్యాఖ్యలతో పాత విషయాలు తెర మీదకు వచ్చాయి. తాజాగా గవర్నర్ చేసిన వ్యాఖ్యల ఆధారంగా గవర్నర్ గిరి నరసింహన్ కు దూరమవుతోందని స్పష్టమైంది. అయితే నరసింహన్ తాను స్వతహాగా గవర్నర్ గిరి నుండి తప్పుకోవాలని అనుకుంటున్నారా..? లేదా కేంద్ర ప్రభుత్వం తప్పిస్తోందా.? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అలాగే చంద్రబాబు ప్రభుత్వం మీద తీవ్ర ఆరోపణలు వస్తున్న సమయంలో గవర్నర్ ను తప్పించడం వల్ల అపఖ్యాతి వస్తుందని.. కాబట్టి వివాదం కాస్త చల్లబడ్డాక.. తీరిగ్గా  నరసింహన్ ను తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి. దీని మీద గవర్నర్ మాత్రమే క్లారిటీ ఇవ్వగలరు.

By Abhinavachary

Also Read:  నరసింహన్ గవర్నర్ గా కన్నా స్వామీగా సూపర్.?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Narasimhan  Governor  AP  Telangana  Tapping  ESL Narasimhan  

Other Articles