Mobile Service Provider not concentrating on ap capital city amaravathi | Mobile Phones

Mobile services not good in ap capital city amaravathi

amaravathi, ap capital city, amaravathi latest photos, ap capital city controversy, mobile services, amaravathi mobile services

Mobile Services not good in ap capital city amaravathi : Ap Capital City Amaravathi people getting more mobile problems for not providing good services their.

‘అమరావతి’ని కరుణించని మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు

Posted: 07/24/2015 11:22 AM IST
Mobile services not good in ap capital city amaravathi

చంద్రబాబు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపబడుతున్న రాజధాని ‘అమరావతి’ నిర్మాణంపై ప్రపంచవ్యాప్తంగా చర్యలు కొనసాగుతున్నాయి. మూడు మండలాలు, 29 గ్రామాల పరిధిలో రాజధాని ఆవిష్కరణకు సర్వం సిద్ధమవుతుండటంతో ఆ ప్రాంతంలో రియల్‌ ఎస్టేట్‌తో పాటు పలు వ్యాపారాల జోరు బాగానే పెరిగింది. విదేశాల్లో పేరుగాంచిన కొన్ని కంపెనీలు సైతం తమ సంస్థల్ని రాజధాని ప్రాంతంలో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ఆటోమొబైల్ కంపెనీలు తమ షోరూంల శాఖలను తెరిచేశాయి కూడా. ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని రాజధాని ప్రకటించినప్పటి నుంచి అక్కడ  సందర్శకుల రాకపోకలు పెరిగాయి. ఇక మారుతున్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని బ్యాంక్‌లు తమ శాఖలను ప్రారంభించాయి.

ఇంతవరకు బాగానే వుంది కానీ.. ఈ నయా రాజధానిని మొబైల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు మాత్రం చిన్న చూపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఆవిష్కరణకు సిద్ధమవుతున్న కొత్త రాజధానిలో ఇప్పటికి సరైన నెట్‌వర్క్‌ లేకపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ రాజధాని ప్రాంతంలో కొత్త కొత్త హోటళ్లు వెలుస్తున్నాయి.. రోజు రోజుకు ఖరీదైన కార్లు పెరుగుతున్నాయి.. ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు జరిగిపతున్నాయి కానీ.. అక్కడ అనేక గ్రామాల్లో ఏ మొబైల్‌ ఫోన్‌ పని చేయని పరిస్థితి ఇంకా నెలకని వుంది. ముఖ్యంగా తుళ్ళూరులో బీఎస్‌ఎన్‌ఎల్‌ మొబైల్‌ ఫోన్‌లు సైతం మొరాయిస్తున్నాయంటే.. అక్కడ పరిస్థితి ఎలా వుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ రాజధాని ప్రాంతాన్ని పర్యటిస్తున్న ప్రభుత్వ ఉన్నతాధికారులు, మంత్రులు అక్కడ అనేక గ్రామాల్లో సెల్‌ఫోన్‌లు పని చేయకపోవడంతో ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.

ఇదిలావుండగా.. అక్టోబర్‌లో రాజధానికి శంకుస్థాపన చేయటానికి ప్రధాని నరేంద్రమోదీ ఇక్కడికి వస్తున్నారు. అప్పటివరకైనా సెల్‌ కంపెనీలు స్పందించి సిగ్నలింగ్‌ వ్యవస్థను మెరుగుపరుస్తారో లేదో వేచి చూడాల్సిందే! మానవ జీవితంలో నిత్యవసరంగా మారిన సెల్ ఫోన్ల సర్వీసులు రాజధాని ప్రాంతంలో సరిగ్గా లేకపోవడంతో అక్కడి ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ap capital city  amaravathi  mobile services  

Other Articles