Shiva sena | Modi | NDA Govt | Uddav Thakre | Parliament sessions, Congress party

The shiv sena was spiked to modi government

Shiva sena, Modi, NDA Govt, Uddav Thakre, Parliament sessions, Congress party

The Shiv Sena was spiked to modi government. Shivasena party makes modi govt troubles in this parliament sessions.

మోదీ సర్కార్ కు శివసేన మేకులా తయారైంది

Posted: 07/24/2015 10:29 AM IST
The shiv sena was spiked to modi government

ఎన్డీయే సర్కార్ లో మిత్రపక్షంగా ఉంటూ ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యడం మోదీ సర్కార్ ను ఇరుకున పెట్టడం శివసేనకు శరామామూలే. మహారాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఠశివసేన భాగస్వామ్య పార్టీగా ఉన్నా కూడా.. మిత్రపక్షం అనే భావన లేకుండా ముక్కు సూటిగా కడిగిపారేయడం శివసేన నాయకుల స్పెషల్. తాజాగా ముంబై మేయర్ మోదీ పాలన బాగానే ఉంది.. కానీ అప్పుడప్పుడు మోదీ హిట్లర్ లాగా ఉన్నాడేమో అన్న అనుమానం కలుగుతోందని అనడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. గతంలో కాంగ్రెస్ పార్టీ యువ కిశోరం రాహుల్ గాంధీ మోదీ గురించి హిట్లర్ అని సంబోధించారు. అయితే రాహుల్ ప్రతిపక్ష పార్టీ నేత కాబట్టి అంటే అన్నారు కానీ స్వపక్ష నేతలైన శివసేన నాయకులు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడం ఎంతమాత్రం మంచిది కాదు. అయితే మోదీ సర్కార్ ను భయపెట్టాలన్నది శివసేన ఉద్దేశం కాదు. మోదీని ఉన్నట్టుండి ఆకాశానికెత్తడం.. మరుక్షణం కారాలు మిరియాలు నూరడం శివసేన పార్టీ స్ట్రాటజీ. ఇది ఎవ్వరికీ అర్థం కాదు.. ఎవరికీ సాధ్యపడదు కూడా.

Also Read:  మోదీ అంటే హిట్లర్ అంటున్న ముంబై మేయర్

తాజాగా అలాంటి వ్యాఖ్యలే చేశారు శివసేన చీఫ్ ఉద్దవ్ ధాక్రే. అచ్చే దిన్ అచ్చే దిన్ అన్నారు. మోదీ గారు మరి మాకు మాత్రం కనిపించడం లేదు అని అన్నారు. శివసేన పత్రిక సామ్నాలో ఉద్దవ్ మోదీ సర్కార్ మీద విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో భారత ప్రజానీకానికి అచ్చే దిన్ అనేవాలేహై... అంటూ ఊరించిన  మోదీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత  ఎలాంటి మార్పు రావడం లేదు.. రాలేదు అని అన్నారు. మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది అయిపోయింది..ఏం మార్పు వచ్చింది..? అని అచ్చే దిన్ ఛాయలు కూడా కనిపించడం లేదని ఉద్దవ్ సామ్నా పత్రికలో వివరించారు. గతంలో పేపర్లలో పరమ బోర్ కొట్టిన వార్తలే ఇప్పుడూ వస్తున్నాయని.. ఏ రోజు పేపర్ తిరగేసినా కానీ ఈ వార్తలను ఎక్కడో చదివిన భావన కలుగుతోందని అన్నారు. పనిలో పనిగా కేంద్రంతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వం మీద కూడా విమర్శలు చేశారు. కేంద్రంతో పాటుగా మహారాష్ట్ర పరిస్థితిలోనూ ఎలాంటి మెరుగుదల కనిపించడం లేదని ఉద్దవ్ థాక్రే వ్యాఖ్యానించారు.

Also Read:  బిజెపి ప్లాన్ కేక... కాంగ్రెస్ కు పక్కాగా చెక్

గతంలో కూడా శివసేన అధికార బిజెపి పార్టీ మీద విమర్శలు గుప్పించింది. అయితే తాజాగా పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమై రెండో రోజులు గడిచిన తర్వాత ఇలా ఎన్డీయే మిత్రపక్షంగా ఉంటున్న శివసేన ఆరోపణలు చెయ్యడం... కాంగ్రెస్ పార్టీకి, ప్రతిపక్షాలకు మంచి అవకాశాన్ని కల్పించింది. ముంబై మేయర్ మోదీని హిట్లర్ తో పోల్చడం.. శివసేన మోదీ సర్కార్ అచ్చే దిన్ మీద కామెంట్ చెయ్యడం లాంటివి కాంగ్రెస్ పార్టీకి బాగా కలిసివచ్చే అంశాలు. అయితే శివసేన కామెంట్లను బిజెపి పార్టీ సీరియస్ గా తీసుకున్న సందర్భాలు తక్కువ. అయితే ఒకానొక సమయంలో పార్టీ శివసేనతో తెగదెంపులు చేసుకుందామని అనుకున్నా కానీ.. చివరకు చేసుకోలేదు. ఒక్కసారి పార్టీ శివసేన నుండి దూరమైతే భవిష్యత్ కాలంలో తీవ్ర పరిణామాలు ఎదురు కావాల్సి వస్తుందని బిజెపి అగ్రనాయకులు భావిస్తున్నారు. మొత్తానికి పక్కలోనే ఉంటూ మేకులా తయారైంది శివసేన.

By Abhinavachary

Also Read:  ప్రధానిపై సూటిగా ప్రశ్నలవర్షం కురిపించిన యువరాజు..!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shiva sena  Modi  NDA Govt  Uddav Thakre  Parliament sessions  Congress party  

Other Articles