Hitler, Modi, Mumbai Mayor, Snehal Ambekar, Shivasena, Rahul Gandhi

Mumbai mayor compares modi with hitler

Hitler, Modi, Mumbai Mayor, Snehal Ambekar, Shivasena, Rahul Gandhi

Mumbai mayor compares Modi with Hitler. Mumbai Mayor and Shiv Sena leader Snehal Ambekar has compared Prime Minister Narendra Modi with the late German dictator Adolf Hitler. In an interview with the Afternoon Despatch & Courier, 43-year-old Ambekar also fancied herself akin to a chief minister and desired a red-beacon vehicle which bestows status on the position she occupies.

మోదీ అంటే హిట్లర్ అంటున్న ముంబై మేయర్

Posted: 07/20/2015 03:24 PM IST
Mumbai mayor compares modi with hitler

ప్రధాని మోడీని జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్‌తో పోల్చారు ముంబై మేయర్ మరియు శివసేన నాయకురాలు స్నేహాళ్ అంబేకర్. డెస్పాచ్ అండ్ కొరియర్‌కు ఇంటర్యూ ఇస్తూ మోడీని పొగుడుతూనే చురకలేశారు అంబేకర్. తన పని తని చేసుకుంటూ పోయే మోడీని ప్రశంసించకుండా ఉండలేనని..అయితే, కొంత వరకు అతని పాలన హిట్లరు పాలన గుర్తుకు తెస్తుందని చెప్పారామే. అధికారం అంతా ఒకే వ్యక్తి చేతిలో కేంద్రీకృతమైతే ఇలాగే ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ముంబయి మొదటి దళిత మేయర్ అయిన స్నేహాల్ అంబేకర్ ఎర్ర బుగ్గ కారు వివాదంతో మొదటిసారి వెలుగులోకి వచ్చారు. అయితే గతంలో రాహుల్ గాంధీ మోదీని హిట్లర్ తో పోల్చడం గమనార్హం.

నగర మేయర్ పదవి ముఖ్యమంత్రి పదవిని పోలినదే అని, ఎర్ర బుగ్గ కారు మేయర్ పదవి హోదాని మరింత పెంచుతుందని ఆమె అన్నారు. అయితే మేయర్ మాటలతో నిప్పు రాజుకుంది. బిజెపి అనుకూల వర్గాలు, మోదీ అభిమానులు మేయర్ మీద కారాలు మిరియాలు నూరుతుండగా, ప్రతిపక్షాలు మాత్రం సమర్థిస్తున్నాయి. మోదీ పాలనను చూస్తే అలాగే అనిపిస్తోందని.. హిట్లర్ కు మోదీకి పెద్దగా తేడా లేదని ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. మరి మోదీ దీని మీద స్పందిస్తారో లేదా అవినీతి ఆరోపణల మీద నోరు మెదపని విధంగానే ఉంటారో చూడాలి. అయితే పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు ఇలా ఓ మేయర్ ప్రధానిని ఉద్దేశించి మాట్లాడటం వార్తల్లో నిలిచింది. మరి పార్లమెంట్ సమావేశాల్లో దీని మీద ఎలాంటి దుమారం రేగుతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hitler  Modi  Mumbai Mayor  Snehal Ambekar  Shivasena  Rahul Gandhi  

Other Articles