nara Brahmani | Amaravathi | Baahubali | Benefir show of Baahubali, AP, Chandrababu naidu, Balakrishna

Nara barhmani received the cheque worth of 25 lakhs for amaravathi developmenment

nara Brahmani, Amaravathi, Baahubali, Benefir show of Baahubali, AP, Chandrababu naidu, Balakrishna

Nara Barhmani received the Cheque worth of 25 lakhs for amaravathi developmenment. Sai Korrapati gave the cheque to Nara Brahmani.

నారా బ్రాహ్మణికి బాహుబలి ‘చెక్’ కష్టాలు!

Posted: 07/13/2015 09:57 AM IST
Nara barhmani received the cheque worth of 25 lakhs for amaravathi developmenment

బాలకృష్ణ కూతురు, చంద్రబాబు కొడులు, నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణి. అటు సినిమా నేపథ్య ఇటు రాజకీయ నేపథ్యం ఉన్న నారా బ్రాహ్మణికి కొత్తగా బాహుబలి కష్టాలు వచ్చిపడ్డాయి. అదేంటి నారా బ్రాహ్మణికి బాహుబలి కష్టాలెందుకు వస్తాయనుకుంటున్నారా..? అసలు ఆమెకు బాహుబలి సినిమాకు ఏంటి సంబందం..? అసలు వివాదం ఎందుకు మొదలైంది...? ఎక్కడ .? అని ప్రశ్నలు తలెత్తుతున్నాయా..? అన్నింటికి సమాధానం ఒక్కటే. కృష్ణా జిల్లాలో బాహుబలి సినిమా బెనిఫిట్ ఫోలు 30 ధియేటర్లలో ప్రధర్శించారు అలా సినిమా వల్ల వచ్చిన దాదాపు పాతిక లక్షల రూపాయలు రాగా వాటిని నిర్మాత సాయి కొర్రపాటి రాజధాని నిర్మాణానికి ఇవ్వాలని నిర్ణయించారు.

narabrahmani-cheque

Also Read:  ఏపి రాజధాని కోసం సాయికొర్రపాటి భారీ విరాళం

బాహుబలి బెనిఫిట్ షో ద్వారా వచ్చిన పాతిక లక్షల రూపాయలను అమరావతి కోసం ఇవ్వాలని సాయి కొర్రపాటి నిర్ణియించుకోవడం, చెక్ ను అందించడం కూడా అయిపోయింది. అయితే ఆ చెక్ ఎవరికి ఇచ్చారు అన్నదే తాజా వివాదానికి తెర తీసింది. ప్రభుత్వానికి అందించాల్సిన చెక్ లను మామూలుగా అయితే ముఖ్యమంత్రికో లేదా ప్రభుత్వ అధికారులకో అందించడం మామూలే. కానీ చంద్రబాబు నాయుడు కోడలు నారా బ్రాహ్మణికి చెక్ ను అందించడం వివాదాస్పదంగా మారింది. నారా బ్రాహ్మణికి అటు ప్రభుత్వంతో కానీ అధికారులతో కానీ ఎలాంటి సంబందం లేదు. కేవలం ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోడలు అన్న హోదా తో మాత్రమే ఇలా రాజధానికి సంబందించిన చెక్ ను అందుకోవడం ఏంటని కొంత మంది విమర్శిస్తున్నారు.

Also Read:  కలెక్షన్లలో బాహుబలి కొత్త రికార్డులు

పాతిక లక్షల చెక్ ను అమరావతికి విరాళంగా నిర్మాత సాయి కొర్రపాటి నారా బ్రాహ్మణికి అందిచారు. అయితే నారా బ్రాహ్మణి చెక్ ను ఎలా తీసుకుంటందని కొంత మంది ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు నాయుడు కుటుంబానికి చెందిన వ్యక్తి అయితే చాలు ఏపి ప్రభుత్వం వారి చెప్పుచేతుల్లో ఉంది అన్నట్లుగా తాజా ఘటన ఉంది అని కొంత మంది అంటున్నారు. చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు మొత్తం ఏపికి ప్రతినిధులుగా వ్యవహరించడం ఏంటని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. అయినా చెక్ ఎవరు అందుకున్నా కానీ ఎవరి పేరు మీద చెక్ పాస్ అయిందన్నది ముఖ్యమని మని కొందరి వాదన. మొత్తానికి ఎప్పుడూ వివాదాలతో వార్తలకెక్కని నారా బ్రాహ్మణి కూడా తాజాగా వివాదానికి తెర తీసింది. మరి దీని మీద అటు చంద్రబాబు కానీ ఇటు బాలకృష్ణ  కానీ ఎలా స్పందిస్తారో చూడాలి.

By Abhiavachary

Also Read:  బాహు బాహు.. బాహుబలి.. శాలిటైల్ రైట్స్ కూడా రికార్డే..!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nara Brahmani  Amaravathi  Baahubali  Benefir show of Baahubali  AP  Chandrababu naidu  Balakrishna  

Other Articles