Telangana | CM | KCR | Iftar dinner | Nizam colleger grounds

Telangana cm kcr attend the iftar dinner in the nizam grounds

Telangana, CM, KCR, Iftar dinner, Nizam colleger grounds

Telangana Cm KCR attend the Iftar dinner in the Nizam Grounds. He said that by the grace of allah and support of the people telangana state came.

అల్లా దయ ఉంది.. ఇంకా మంచి పనులు చేద్దాం: కేసీఆర్

Posted: 07/13/2015 08:05 AM IST
Telangana cm kcr attend the iftar dinner in the nizam grounds

తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. అల్లా దయతోనే తెలంగాణ రాష్ర్టం సాధ్యమైందని అన్నారు. మై వతన్ కా బేటా హు. ఆప్ కా బేటా హు.. అంటూ ప్రసంగం ప్రారంభించిన కేసీఆర్ రాష్ర్టాభివృద్ధిలో సహకారం అందించాలని అర్థించారు. మంచి పనులు, మంచి కార్యాలతో ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. సామరస్యానికి తెంలగాణ ప్రతీక అని ప్రపంచంలో ఇలాంటి ప్రదేశం మరెక్కడా ఉండదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వర్ధిల్లిన ఒకనాటి గంగాజమునా తహెజీబ్ సంప్రదాయాన్ని తిరిగి తీసుకువద్దామని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. రాష్ర్టాభివృద్ధికి అందరూ సహకరించాలని ఈ భూమి తల్లి బిడ్డగా, మీ కొడుకుగా విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. ప్రభుత్వపరంగా తాము ఇప్పటిదాకా చేసింది చాలా తక్కువేనన్న కేసీఆర్, ముందుముందు ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు.

Also Read:  ముస్లింలకు అండగా ఉంటాం: కెటిఆర్

కొందరు మన చెరుపును కోరుకుంటున్నారని అంటూ.. లక్షమంది మన చెడుకోరుకున్నా సరే.. భగవంతుడి అనుగ్రహం ప్రకారమే ఏదైనా జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అస్వస్థతతో బాధపడుతున్నప్పటికీ విందుకు హాజరైన కేసీఆర్ రాష్ట్ర ముస్లింలందరికీ రంజాన్ పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళలా అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.అందరూ సహకరిస్తే మంచి పనులు, పుణ్యకార్యాలతో ముందుకు సాగుతామన్నారు. ఇప్పటిదాకా ప్రజలకు తాము చేసింది తక్కువేనని, ముందు ముందు చాలా చాలా చేయాల్సి ఉందని పేర్కొన్నారు. విందుకు హాజరైన, మతపెద్దలు, ప్రముఖులకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఒకనాడు మతసామరస్యంలో ప్రపంచానికే ఆదర్శంగా నిలించిందని, గంగా జమున సంప్రదాయం, సంస్కృతికి ప్రతీక అని పలువురు మనను ప్రస్తుతించారని చెప్పారు. 1927లో జాతిపిత మహాత్మాగాంధీ హైదరాబాద్ సందర్శన సందర్భంగా వివేకవర్ధని కాలేజీలో ప్రసంగిస్తూ ఇక్కడి రాజులు, ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో బాగున్నాయని ప్రశంసించారని గుర్తుచేశారు.

Also Read:  ముస్లింలకు ఓటింగ్ హక్కును తొలగించండి.. శివసేన ఎంపీ

తెలంగాణ ప్రాంతపు పాత సువాసనలను తిరిగి తప్పకుండా పునరుద్ధరిస్తామన్నారు. రంజాన్ పర్వదినాలను పురస్కరించుకుని ఈసారి లక్షా 95వేల మంది నిరుపేదలకు బట్టలు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని 195 మసీదులలో ఆదివారం ప్రభుత్వం తరఫున దావతే ఇఫ్తార్ ఏర్పాటు చేశామని చెప్పారు. మన పూర్వ సంప్రదాయాలు, సంస్కృతిని తిరిగి పాదుకొల్పే దిశగా ఇది చిన్న ప్రయత్నమని కేసీఆర్ అన్నారు. రాబోయే రోజుల్లో ఇదే సంప్రదాయాన్ని పాటిస్తూ ముందుకు నడవాల్సిన అవసరం ఉందన్నారు. ముస్లింల సంక్షేమం కోసం ఇచ్చిన హామీలన్నింటినీ త్వరలోనే నెరవేరుస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణలోని ముస్లింలను గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడంతో వారు అన్నిరంగాల్లోనూ వెనుకబడ్డారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముస్లింల సంక్షేమం కోసం అనేక పథకాలు రూపొందించామని తెలిపారు.

By Abhinavachary

Also Read:  ముస్లిం కాబట్టే.. సల్మాన్ కు బెయిల్.. బిజేపీ ఎంపీ వివాదాస్పదవ్యాఖ్యలు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  CM  KCR  Iftar dinner  Nizam colleger grounds  

Other Articles