Cilantro Health Benefits Which Decrease Digestive system Problems | Health tips | Healthy foods

Cilantro health benefits healthy foods home remedies

Cilantro health tips, Cilantro health benefits, Cilantro home remedies, Cilantro beauty benefits, Cilantro tips, health tips, healthy tips, healthy foods

Cilantro Health Benefits Healthy foods home remedies : The Health Benefits With Cilantro Which Help To Decrease Digestive system Problems.

వేసవిలో కొత్తిమీర తప్పనిసరి.. లేకపోతే!

Posted: 05/12/2015 01:04 PM IST
Cilantro health benefits healthy foods home remedies

వేసవికాలంలో సూర్యతాపం అధికంగా వుండటంతో రకరకాల వ్యాధులు సంక్రమించే అవకాశాలు వుంటాయి. ముఖ్యంగా శరీరంలో వ్యాధినిరోధక శక్తి లోపిస్తుంది. అందుకే.. అధికంగా నీరు తీసుకోవడంతోపాటు ఆరోగ్యకరమైన ఆహారం సేవించాలని ఆరోగ్య నిపుణులు సలహాలు ఇస్తున్నారు. వేసవిలో ఆయిల్, జంక్ ఫుడ్స్ వంటివి తినడం పూర్తిగా తగ్గిస్తే చాలామంచిదని వారంటున్నారు. అలా చేస్తే.. జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని వారు చెబుతున్నారు. అలాగే వేసవిలో సాధ్యమైనంత వరకు కారం (స్పైసీ ఫుడ్స్) తినడం తగ్గించాలి. అలాకాకుండా ఆయిల్స్, జంక్, కారంగా వున్న ఫుడ్స్ తీసుకుంటే.. ఎన్నోసమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని వారంటున్నారు. అందుకే వాటిని పూర్తిగా తగ్గిస్తే మంచిది.

ఇకపోతే.. వేసవి కాలంలో తీసుకునే ఆరోగ్యకరమైన డైట్‌లో కొత్తిమీర, సోంపు, అల్లం వంటి వాటిని తప్పనిసరిగా చేర్చుకుంటే ఆరోగ్యంగా వుండవచ్చునని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. ఇవి జీర్ణవ్యవస్థను, జీర్ణక్రియలను మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా కొత్తిమీర ఖచ్చితంగా రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఇందులో వుండే పోషక విలువలు జీర్ణవ్యవస్థను మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయని, కడుపు సంబంధిత సమస్యల నుంచి దూరంగా వుంచుతాయని వారు తెలుపుతున్నారు. జీర్ణవ్యవస్థ హెల్తీగా ఉండాలంటే, వేసవిలో సాధ్యమైనంత వరకూ పెరుగు, మజ్జిగ, లస్సీ వంటి చల్లని పదార్థాలు తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యను నివారించుకోవచ్చు. వీటిల్లో కూడా కొత్తిమీర చేర్చుకుంటే చాలా మంచిది.

అలాగే రెగ్యులర్‌గా తీసుకొనే ప్రోటీన్ ఫుడ్స్ వేసవిలో మితంగా తీసుకుంటే ఎంతో శ్రేయస్కరం. ఒకేసారి కాకుండా రోజులో మూడు నాలుగు సార్లు తీసుకోవడం వల్ల ఆకలి అరికడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పోషకాలు అధికంగా నిల్వవుండే ఆహారాలు ప్రతిరోజూ తీసుకుంటే ఎటువంటి సమస్యలు దరికి చేరవని వారు వెల్లడిస్తున్నారు. కాబట్టి.. పోషకాహారం తీసుకోండి.. ఆరోగ్యంగా వుండండని సూచిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cilantro  Health Tips  healthy foods  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more