summer healthy foods | health tips | water health benefits

Summer healthy foods nutrients values

summer health foods, healthy food items, nutrient foods, summer foods, summer fruit juices, healthy fruit juices, summer fruits, health fruits, healthy water, water health benefits

summer healthy foods nutrients values : There are lots of foods are available which contains more nutrients. This will increase the healthy levels and decrease heat content from body.

వేసవిలో తీసుకోవాల్సిన పోషకాహారాలు..

Posted: 04/14/2015 08:31 PM IST
Summer healthy foods nutrients values

వేసవికాలం వచ్చిందంటే చాలు.. సూర్యతాపం వల్ల రకరకాల రోగాలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా శరీరంలో వేడిశాతం పెరుగుతుందని, తద్వారా ఆకలి ఎక్కువ కాకపోవడం సమస్య అధికమవుతుందని అంటున్నారు. అలా భోజనం చేయకపోవడంతో శరీరంలో పోషక విలువలు తగ్గి నీరసించిపోతారు. కాబట్టి.. ఇటువంటి పరిస్థితి రాకుండా వుండాలంటే.. కొన్ని పోషకాహారాలు తీసుకుంటే ఆరోగ్యంగా వుండవచ్చునని వారు సలహా ఇస్తున్నారు.

వేసవికాలంలో శరీరంలోని వేడి తగ్గించాలంటే.. ఎక్కువగా నీటిని తాగాలి. సాధారణంగా తీసుకొనే స్థాయి కంటే వేసవిలో మరింత ఎక్కువగా నీటిని తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. అలాగే సిట్రస్, ఆరెంజ్ లాంటి పండ్లు తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే.. వాటిల్లో శరీరానికి అవసరమయ్యే ‘విటమిన్ సి’తోపాటు వాటర్ కంటెంట్ అధిక మోతాదులో వుంటుంది. ఇకపోతే.. ఒక గ్లాసు చల్లటి పాలలో ఒకటి లేదా రెండు చుక్కల బాదం ఆయిల్, బాదం పౌడర్ కూడా మిక్స్ చేసి తీసుకోవచ్చు. ఇక వెజిటేరియన్ ఫుడ్స్‌లో వాటర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల వీటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. అంతేకాదు మాంసాహారాలతో పోల్చితే వెజిటేరియన్ ఫుడ్స్‌లో విటమిన్స్ కూడా అధికంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

వేసవిలో బాడీ హీట్‌ను తగ్గించే మరో ఉత్తమ హోం రెమెడీ పెరుగు అన్నం. ఈ ఆహారాన్ని తినే ముందు కొద్దిగా నీళ్ళు మిక్స్ చేస్తే ఫలితం మరింత ఎక్కువగా ఉంటుంది. వెన్న తీసిన మజ్జిగను ప్రతిరోజూ త్రాగడం వల్ల వేసవి తాపం తీర్చడంతోపాటు శరీరంలో వేడి మటుమాయం అవుతుంది. ఈ నియమాలను పాటిస్తే.. శరీరంలో వేడి శాతాన్ని తగ్గించుకొని నిత్యం ఆరోగ్యంగా వుండవచ్చునని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : health tips  summer healthy foods  water health benefits  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more