Orange juice sugar content calories fruits

orange juice, orange juice sugar content, fruit juices, healthy fruit juices, fruit juices, heart diseases, heart pain, heart problems

orange juice sugar content calories fruits : Orange juice contains more sugar content. So it is better to drop drink orange everyday.

ఆరేంజ్ జ్యూస్ తాగుతున్నారా..? అయితే జాగ్రత్త!

Posted: 03/09/2015 04:20 PM IST
Orange juice sugar content calories fruits

సాధారణంగా ఫ్రూట్స్ లో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో విటమిన్లు, ఇతర పోషకాలు అధిక మోతాదులో నిల్వవుంటాయి. అందుకే.. వాటిని తినడం లేదా జ్యూస్ గా చేసుకుని తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు కూడా సలహాలు ఇస్తున్నారు. అంతెందుకు.. జ్వరం లేదా ఇతర చిరుజబ్బులు వచ్చినప్పుడు ఫ్రూట్స్ ఎక్కువ వాడాల్సిందిగా వైద్యులు కూడా సూచిస్తారు. అటు ఆరోగ్యపరంగా మేలు చేయడంతోపాటు తాగడానికి రుచికరంగా వుంటాయి కాబట్టి.. ప్రతిఒక్కరూ పళ్లరసాలు తాగేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతారు. అలాగని ప్రతిరోజూ పళ్లరసాలు తాగితే మాత్రం ప్రమాదమే!

రోజూ తియ్యటి పళ్లరసాలు తాగితే ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫ్రూట్ జ్యూస్ రోజూ తాగేవాళ్లలో రక్తపీడనం బాగా పెరుగుతుందని వాళ్లు చెబుతున్నారు. దాంతో హార్ట్ ఎటాక్ రిస్క్ లేదా యాంజినా (ఛాతి నొప్పి) ఏర్పడే ప్రమాదం వుందని నిపుణులు పేర్కొంటున్నారు. నిజానికి పళ్ల రసాల్లో అవసరమైన విటమిన్లు ఉన్నమాట వాస్తవమే కానీ వాటితోపాటు అధిక మొత్తంలో చక్కెర కూడా ఉంటుందనే విషయాన్ని మరిచిపోకూడదని వాళ్లు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా ఆరేంజ్ జ్యూస్ లో అయితే చక్కెరశాతం ఊహించిన దానికంటే ఎక్కువ మోతాదులో వుంటుందని నిపుణులు తమ పరిశోధనల ద్వారా స్పష్టం చేస్తున్నారు.

ఆరోగ్య నిపుణులు నిర్వహించిన పరిశోధనల్లో... ఆరేంజ్ జ్యూస్, స్వీటెన్డ్ డ్రింక్‌లంత హానికరం అని తేలింది. 250 మిల్లీలీటర్ల ఆరేంజ్ జ్యూస్ లో 115 కాలరీలు లేదా ఏడు టీ స్పూన్ల చక్కెర ఉంటుంది. కానీ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్క ప్రకారం రోజుకి ఆరు స్పూన్ల చక్కెర మాత్రమే వాడాలి. అందుచేత ఆరెంజ్ జ్యూస్‌ను పంచదార కలపకుండా తాగాలి. లేకుంటే ఆరెంజ్ జ్యూస్‌లో కాస్త నీటి మోతాదు పెంచాలి. రోజూ కాకుండా వారానికి రెండు సార్లు లేదా మూడు సార్లు ఆరెంజ్ జ్యూస్ తీసుకోవచ్చు. అలాగే తక్కువ మోతాదులో తీసుకుంటే ఇంకా మంచిది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : orange juice  heart diseases  fruit juices  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more