Mango fruits health benefits health diseases

mango fruits, mango fruits health benefits, health tips, mango health tips, cancer symptoms, heart diseases, heart attack problems

mango fruits health benefits health diseases

మామిడివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Posted: 11/28/2014 02:49 PM IST
Mango fruits health benefits health diseases

మామిడిపండు పళ్లకే రారాజు అంటారని ప్రతిఒక్కరికి తెలిసిందే! ఇది తినడానికి ఎంత రుచికరంగా వుంటుందో.. అదేవిధంగా ఆరోగ్యానికి అంతే మంచిది. మానవ శరీరానికి అవసరమయ్యే పోషక విలువలు ఇందులో బ్రహ్మాండంగా వుంటాయి. ముఖ్యంగా పురుషులు దీనిని ప్రతిరోజూ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. శరీరంలో వ్యాధినిరోధకశక్తిని పెంచి, చిన్నచిన్న జబ్బుల నుంచి దూరంగా వుంచుతుంది... అనవసరమైన క్యాలరీలను తొలగించేసి శరీర బరువును అదుపులో వుంచుతుంది. ఇంకా రకరకాల ఆరోగ్యప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో తెలుసుకుందాం...

1. మామిడిపండులో శరీరానికి అవసరమయ్యే జింక్, పొటాషియం, సెలీనియం వంటి ఖనిజాలు అధిక మోతాదులో వుంటాయి. ఇవి శరీర అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతాయి.

2. నిజానికి మామిడిపండు తీసుకుంటే శరీరంలో వేడిశాతం పెరుగుతుంది. దీంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే నడుముచుట్టూ వుండే కొవ్వును తగ్గిస్తుంది. ఇంకా ఇందులో జీవక్రియను పెంచు ఫైబర్ అధికంగా వుంటుంది.

3. మామిడిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మోతాదులో లభ్యమవుతాయి. ఇవి ప్రోస్టేట్ క్యాన్సర్ నుంచి లుకేమియా వరకు అనేక రకాల క్యాన్సర్ లను తగ్గించడంలో ప్రముఖపాత్ర పోషిస్తాయి. అంతేకాక.. శరీరంలో కొలెస్టిరాల్’ను తగ్గించి.. గుండెసంబంధిత వ్యాధుల నుంచి దూరంగా వుంచుతుంది.

4. అప్పుడప్పుడు కొంతమందికి అజీర్ణం సమస్య వస్తుంటుంది. అప్పుడు అది ఆమ్లత్వానికి దారితీస్తుంది. అటువంటి సమయంలో మామిడిపళ్లను తీసుకుంటే.. అందులోని మాలిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్ లు శరీరంలోని ఆల్కలీన్ స్థాయిల సమతౌల్యం కోసం సహాయపడుతాయి.

5. మామిడిలో ఇంకొక గుణం కూడా వుంది. ముఖ్యంగా పురుషులు మామిడికాయను రెగ్యులర్ గా తీసుకుంటే.. అందులో వుండే విటమిన్-ఈ సెక్స్ డ్రైవ్ ను పెంచుతుంది. ఇది పురుషుల్లోని విర్లిటిని పెంచుతుంది. ఇటువంటి లక్షణాలను కలిగి వుండటం వల్ల మామిడిని ‘లవ్ ఫ్రూట్’ అని కూడా అంటారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mango fruits  health tips  health diseases  cancer symptoms  telugu news  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more