Former Aussie Cricketer Michael Slater Hospitalized జైలు శిక్ష తప్పించుకుని.. మెంటల్ ఆసుపత్రికి అసీస్ క్రికెటర్

Former australia star cricketer avoids jail taken to mental health hospital

Michael Slater, Michael Slater hospital, Australia, mental hospital, jail, domestic violence case, Former Australia batsman, harassment, Cricket

Former Australia batsman Michael Slater avoided jail on Wednesday after a Sydney court dismissed domestic violence charges against him on mental health grounds, Australian state media reported. Slater, 52, was arrested by police in October and charged with harassment and intimidation of his ex-wife following an allegation of domestic violence.

జైలు శిక్ష తప్పించుకుని.. మెంటల్ ఆసుపత్రికి అసీస్ క్రికెటర్

Posted: 04/27/2022 09:00 PM IST
Former australia star cricketer avoids jail taken to mental health hospital

ఆస్ట్రేలియా టీమ్‌ మాజీ క్రికెటర్‌ మైకేల్‌ స్లేటర్‌ మూడు వారాల పాటు మెంటల హాస్పిటల్‌లో గడపనున్నాడు. బుధవారం సిడ్నీ కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు అతన్ని అధికారులు పిచ్చాసుపత్రికి తరలించారు. డొమెస్టిక్‌ వయొలెన్స్‌ కింద గతేడాది అక్టోబర్‌లో అతనిపై కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు బుధవారం తీర్పు వెల్లడించగా.. అతని మానసిక పరిస్థితి దృష్ట్యా జైలు శిక్ష విధించకుండా మెంటల్‌ హెల్త్‌ యూనిట్‌కు తరలించాలని ఆదేశించింది.

52 ఏళ్ల స్లేటర్‌ను గతేడాది అక్టోబర్‌లో పోలీసులు అరెస్ట్‌ చేశారు. తన మాజీ భార్యను వేధిస్తున్నాడని అతనిపై కేసు పెట్టారు. ఆ తర్వాత కోర్టు ఆదేశాలను ధిక్కరించి ఆమెను భయపెట్టేలా మెసేజ్‌లు, కాల్స్‌ చేశాడంటూ మరో అభియోగం అతనిపై మోపారు. దీనిపై బుధవారం అక్కడి వేవెర్లీ లోకల్‌ కోర్టు మెజిస్ట్రేట్‌ రాస్‌ హడ్సన్‌ తీర్పు వెల్లడించారు. స్లేటర్‌కు జైలు శిక్ష విధించకుండా మూడు వారాల పాటు మెంటల్‌ హాస్పిటల్‌లో ఉంచాలని ఆదేశించారు.

గత ఫిబ్రవరి నెల నుంచి స్లేటర్‌కు తన మానిసక స్థితి గురించి తెలిసి మందులు వాడాలని నిర్ణయించుకున్నట్లు ఈ సందర్భంగా జడ్జి హడ్సన్‌ చెప్పారు. థెరపీ, కౌన్సిలింగ్‌కు అతడు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. మంగళవారం స్లేటర్‌ను నిర్బంధించిన పోలీసులు.. అతన్ని చికిత్స కోసం సిడ్నీ హాస్పిటల్‌లోని మానసిక విభాగానికి తీసుకెళ్లారు. దీంతో బుధవారం స్లేటర్‌ కోర్టుకు రాలేకపోయాడు. స్లేటర్‌ ఇప్పటికే ఎన్నో మానిసక ఆరోగ్య కేంద్రాల్లో 100 రోజులు గడపటంతోపాటు ఐదుగురు సైకియాట్రిస్టులను కలిశాడు.

ఆస్ట్రేలియా తరఫున 1993-2001 మధ్య 74 టెస్టులు, 42 వన్డేల్లో ప్రాతినిధ్యం వహించాడు. తర్వాత కామెంటేటర్‌గా మారాడు. అయితే గతేడాది ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌పై సోషల్‌ మీడియాలో తీవ్రంగా ధ్వజమెత్తడంతో సెవెన్‌ నెట్‌వర్క్‌ అతన్ని కామెంటేటర్‌ బాధ్యతల నుంచి తొలగించింది. గతేడాది కొవిడ్‌ కారణంగా ఇండియా నుంచి స్వదేశానికి తిరిగి వచ్చేందుకు కూడా ఆస్ట్రేలియన్లను అనుమతించకపోవడంతో.. ప్రధాని మోరిసన్‌ చేతులకు రక్తం అంటుకుంది అంటూ స్లేటర్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles