Australian cricket icon Shane Warne passes away at 52 ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్‌వార్న్‌ హఠాన్మరణం

Shane warne australia s legendary legspinner dies aged 52

Shane Warne, Shane Warne dies, Shane Warne heart attack, Shane Warne dead, Shane Warne news, Shane Warne, spin wizard, leg spinner, Australia, Cardiac Arrest, Indian Premier league, Rajasthan royals, sports news, Cricket news, Cricket, sports

Shane Warne, one of cricket's all-time greats, has died of a suspected heart attack at the age of 52. Warne, who was named as one of Wisden's Five Cricketers of the Century, claimed 708 Test wickets in a 15-year career for Australia between 1992 and 2007, and was also a World Cup winner in 1999. According to a brief statement given to Fox News by Warne's management, he passed away in Thailand of a suspected heart attack.

ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్‌వార్న్‌ హఠాన్మరణం

Posted: 03/04/2022 09:49 PM IST
Shane warne australia s legendary legspinner dies aged 52

ఆస్ట్రేలియా క్రికెట్‌ దిగ్గజం షేన్‌వార్న్‌(52) కన్నుమూశారు. ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో ఉన్న వార్న్‌ తన గదిలో అచేతనంగా పడి ఉండటంతో విల్లా సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. గుండెపోటుతో తుది శ్వాస విడిచారని ప్రాథమికంగా వైద్యులు పేర్కొన్నారు. క్రికెట్‌ ఆస్ట్రేలియాకు షేన్‌వార్న్‌ విశేష సేవలందించారు. 1992లో జాతీయ జట్టుకు ఎంపికైన వార్న్‌ ఆసీస్‌ జట్టులో కీలక బౌలర్ గా ఎదిగాడు. దాదాపు 15 ఏళ్లపాటు సేవలందించిన వార్న్ 2007లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

ఆసీస్‌ తరపున మొత్తం 145 టెస్టులు ఆడిన షేన్‌ వార్న్‌ 708 వికెట్లు తీశారు. 194 వన్డేల్లో 293 వికెట్లు పడగొట్టారు. టెస్టుల్లో 37సార్లు 5 వికెట్లు తీయగా, 10 సార్లు 10 వికెట్లు తీసిన ఆటగాడిగా షేన్‌ వార్న్‌ రికార్డు సృష్టించారు. ఇక టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా చరిత్రకెక్కాడు. వార్న్‌ కంటే ముత్తయ్య మురళీధరన్ (800) ముందున్నాడు. సచిన్‌-వార్న్‌, లారా-వార్న్‌ పోరాటం క్రికెట్ అభిమానులను ఎంతో అలరించింది. వార్న్‌ మృతి పట్ల పలువురు క్రికెటర్లు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సామాజిక మాధ్యమాల వేదికగా సందేశాలు పెట్టారు.

రాజస్థాన్ రాయల్స్ విజయపథంలోనూ..

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో రాజస్థాన్ రాయల్స్ జట్టును విజయపథంలో నిలపడంలోనూ షేర్ వార్న్ అందించిన సేవలు ఎనలేనివి. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టు  తొలి ఎడిషన్‌లోనే ఛాంపియన్‌గా నిలిపిన ఘనత ఆయనదే. కెప్టెన్‌, మెంటార్‌గా ఆర్‌ఆర్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్‌మెంట్ ప్రకటించి మరీ ఐపీఎల్‌లో రాజస్థాన్‌ జట్టు పగ్గాలను చేపట్టడం విశేషం. ఇటు సీనియర్లు, యువ ఆటగాళ్లను సమతూకం చేసుకుంటూ రాజస్థాన్‌కు టైటిల్‌ను సాధించి పెట్టాడు. 2011 వరకు రాజస్థాన్‌కు సారథిగా వ్యవహరించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles