Smriti Mandhana tops ICC womens Cricketer 2021 స్మృతి మంధానను వరించిన ఐసీసీ పురస్కారం..

Smriti mandhana named icc women s cricketer of the year

Smriti Mandhana wins ICC womens Cricketer of the Year, Smriti Mandhana, icc award, 2021 women cricketer of the year, Rachael Heyhoe Flint Trophy, Tammy Beaumont, Lizelle Lee. Gaby Lewis, woman cricketer, India vs Australia, Indian women cricket team, Team india, spots news, cricket news, sports, cricket

India’s swashbuckling opener Smriti Mandhana was named the ICC Women’s Cricketer of the Year for her incredible run of form across all formats in 2021. Mandhana was short-listed for the top award — the Rachael Heyhoe Flint Trophy — along with Tammy Beaumont of England, Lizelle Lee of South Africa and Gaby Lewis of Ireland, the ICC said in a statement.

జయహో స్మృతి మంధాన.. టీమిండియా క్రికెటర్ కు ఐసీసీ పురస్కారం

Posted: 01/24/2022 08:13 PM IST
Smriti mandhana named icc women s cricketer of the year

భారత మహిళా క్రికెటర్‌ స్మృతి మంధానకు సముచిత గౌరవం దక్కింది. 2021 ఏడాదికి గానూ ఆమె ఐసీసీ వుమెన్స్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు గెలుచుకుంది. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో పరిమిత ఓవర్ల సిరీస్‌లలో భాగంగా భారత్‌ కేవలం రెండే మ్యాచ్‌లలో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ రెండు విజయాల్లోనూ ఓపెనర్‌ స్మృతి కీలక పాత్ర పోషించింది. రెండో వన్డేల్లో 80 పరుగులతో అజేయంగా నిలిచిన ఆమె... చివరి టీ20 మ్యాచ్‌లో 48 పరుగులు చేసింది. అదే విధంగా.... ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్‌లో 78 పరుగులు సాధించిన ఆమె... మ్యాచ్‌ డ్రా కావడంలో తన వంతు పాత్ర పోషించింది.

అంతేగాక భారత్‌ గెలిచిన ఏకైక వన్డే సిరీస్‌లో 49 పరుగులతో రాణించింది. ఇక టీ20 సిరీస్‌లో భాగంగా 15 బంతుల్లో కీలకమైన 29 పరుగులతో పాటు అర్ధ సెంచరీ సాధించి సత్తా చాటింది. అంతేగాక ఆస్ట్రేలియాతో సిరీస్‌లో భాగంగా రెండో వన్డేలో స్మృతి మంధాన 86 పరుగులు చేసింది. ఇక కంగారూలతో జరిగిన ఏకైక టెస్టులో సెంచరీ సాధించింది. ఇలా పలు మ్యాచ్‌లలో అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న స్మృతిని ఐసీసీ వుమెన్స్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా ఎంపిక చేసింది. ఐసీసీ వుమెన్స్‌ టీ20 క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2021 అవార్డును ఇంగ్లండ్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ టమీ బేమౌంట్‌ గెలుచుకున్న సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles