Ravi Shastri Shares His Views On Rohit Sharma's Captaincy రోహిత్ శర్మ కెప్టెన్ బాధ్యతలపై రవిశాస్త్రీ ఏమన్నాడంటే..!

Ravi shastri makes comment on rohit sharma becoming india s odi and t20i captain

Rohit Sharma, Virat Kohli, Ravi Shastri, Ind vs SA T20 series, ODI Series, TeamIndia, BCCI, , Ind vs SA ODI series, South Africa vs India, indida vs south africa, ind vs sa, Cricket news, Sports news, cricket, sports

Ravi Shastri said, "Rohit Sharma is not overawed; he always does what is best for the team. He marshalls all the resources of the team unlike, let’s say, in football." The 59-year old then also gave his thoughts on Virat Kohli giving up captaincy in the shorter format, stating that he agreed with him '100%.'

రోహిత్ శర్మ కెప్టెన్ బాధ్యతలపై రవిశాస్త్రీ ఏమన్నాడంటే..!

Posted: 12/10/2021 05:16 PM IST
Ravi shastri makes comment on rohit sharma becoming india s odi and t20i captain

టీ20 కెప్టెన్సీ పగ్గాలను చేపట్టిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు వన్డే నాయకత్వ బాధ్యతలను బీసీసీఐ అప్పగించిన సంగతి తెలిసిందే. రోహిత్ తో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రికి కొన్నేళ్లుగా అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో రోహిత్ గురించి రవిశాస్త్రి తన అభిప్రాయాలను పంచుకున్నారు. రోహిత్ తన కోసం మితిమీరి ఆడే ప్రయత్నం చేయడని... టీమ్ అవసరాలకు తగ్గట్టుగా ఆడటం ఆయన గొప్పదనమని కితాబునిచ్చారు. జట్టులో ఉన్న అన్ని వనరులను సక్రమంగా ఉపయోగించుకోవడంలో రోహిత్ దిట్ట అని అన్నారు.

కోహ్లీ గురించి మాట్లాడుతూ ఆయనొక తెలివైన కెప్టెన్ అని చెప్పారు. అయితే కెప్టెన్ గా జట్టు సాధించిన విజయాలను మాత్రమే జనం పట్టించుకుంటారని...  నీవు ఎన్ని పరుగులు చేశావు, ఎలా పరుగులు చేశావనే విషయం వారికి అనవసరమని శాస్త్రి తెలిపారు. కోహ్లీ చాలా గొప్పగా ఎదిగాడని, ఎంతో మెచ్యూరిటీ ఉన్న ఆటగాడని కితాబునిచ్చారు. ఇండియా టీమ్ కు కెప్టెన్ గా వ్యవహరించడం అంత సులభమైన విషయం కాదని అన్నారు. కెప్టెన్ గా సాధించిన దానికి కోహ్లీ ఎంతో గర్వపడాలని చెప్పారు.

ఇక వచ్చే ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికాతో జరగబోయే మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ కు రోహిత్ శర్మ పూర్తి స్థాయి కెప్టెన్ గా బాధ్యతలను స్వీకరించబోతున్నాడు. వన్డే కెప్టెన్ గా రోహిత్ ను నియమిస్తున్నట్టు బుధవారం బీసీసీఐ ప్రకటించింది. రోహిత్ శర్మ ఇప్పటికే 32 లిమిటెడ్ ఓవర్ల మ్యాచ్ లకు నాయకత్వం వహించాడు. వీటిలో 26 మ్యాచ్ లను గెలిపించిన ఘనత ఆయన సొంతం. రోహిత్ నాయకత్వంలోనే టీమిండియా అంతర్జాతీయ టోర్నీలైన నిదహాస్ ట్రోఫీ, 2018 ఆసియా కప్ లను గెలుపొందింది. ఐపీఎల్ లో కూడా అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా రోహిత్ కు పేరుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rohit Sharma  Virat Kohli  Ravi Shastri  Ind vs SA  india vs south africa  TeamIndia  BCCI  cricket  sports  

Other Articles