'Smart Ball' to feature in CPL cricket క్రికెట్ లో స్మార్ట్ బాల్ ప్రయోగానికి అంకురార్పణ..

Cpl to become the first league to use smart ball for its matches

Smart Ball, Caribbean Premier League, sports technology company, Sportcor, Kookaburra, electronic chip, sensors, data, Cricket, sports

Caribbean Premier League (CPL) will start the usage of ‘smart balls’ for its matches from this season onwards. The ball was brought forth by a sports technology company called Sportcor in collaboration with Kookaburra.

క్రికెట్ లో స్మార్ట్ బాల్ ప్రయోగం.. సీపీఎల్ తో అంకురార్పణ..

Posted: 08/27/2021 10:00 PM IST
Cpl to become the first league to use smart ball for its matches

క్రికెట్ లో అప్పటికీ.. ఇప్పటికీ ఎన్నెన్నో మార్పులు వచ్చాయి. ప్రస్తుతం ఇది బ్యాట్స్ మెన్ గేమ్ లా తలపిస్తుందన్న అరోపణలూ వున్నాయి. అయితే దానిని సిరిదిద్దాల్సిన బాధ్యతను తీసుకున్న ఐసీసీ ఈ జంటిల్ మెన్ గేమ్ లో మరో అంకురార్పణకు శ్రీకారం చుట్టింది. బ్యాట్ ను బంతి ఎడ్జ్ తీసుకున్నా.. ఎల్బీడబ్ల్యూలను పక్కాగా అంచనా వేయాలన్నా.. బంతి గమనాన్ని తెలుసుకోవాలన్నా.. టెక్నాలజీతో సులువైపోతోంది. వీటిని గుర్తించేందుకు ఇప్పటికే స్నిక్కో మీటర్, హాట్ స్పాట్, అల్ట్రా ఎడ్జ్, హాక్ ఐ, స్పైడర్ కెమెరాలు, స్పీడ్ గన్నులు, ఎల్ఈడీ స్టంపులు, వాటికి మైక్రోఫోన్ ల వంటి ఎన్నెన్నో సాంకేతికతలను వినియోగిస్తోంది ఐసీసీ.

అయినా బ్యాట్స్ మెన్లకు ఫేవర్ గానే ఈ గేమ్ వుందన్న ఎడ్జ్ మాత్రం తొలగించుకోలేకపోయింది. దీంతో ఇక ఈ వాదనను కూడా పూర్తిగా చెరిపేందుకు తాజాగా చేయనున్న అంకురార్ఫణ శ్రీకారం చుట్టునుంది. అదే స్మార్ట్ బాల్. బంతి గమనాన్ని, వేగాన్ని, బౌన్స్ అయిన విధానాన్ని లెక్కించేందుకు ప్రత్యేకంగా తయారు చేసిన బంతి ఇది. అందులో భాగంగా బంతి లోపల ఓ స్మార్ట్ చిప్ ను పెడతారు. దానిని ఓ సిస్టమ్ లేదా.. ఓ యాప్ నకు అనుసంధానిస్తారు. బౌలర్ చేతి నుంచి బంతి విడుదలైనప్పటి నుంచి.. పిచ్ పై పడి కీపర్ చేతుల్లోకి లేదా బ్యాట్ కు తగిలేవరకు బంతి వేగం, గమనాన్ని ఆ చిప్ లెక్కిస్తుంది.

ఆ వివరాలన్నింటినీ అప్పటికే అనుసంధానించిన యాప్ కు పంపిస్తుంది. ఈ బాల్ ను ప్రస్తుతం నడుస్తున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్ లో ప్రయోగాత్మకంగా వాడుతున్నారు. ఇంకా అంతర్జాతీయ క్రికెట్ కు అనుమతి లభించలేదు. శిక్షణ తీసుకుంటున్న క్రికెటర్లు తమ పెర్ఫార్మెన్స్ ను మెరుగుపరుచుకునేందుకు శిక్షణలో ఈ బంతులను వాడనున్నట్టు తెలుస్తోంది. కూకాబుర్రా సంస్థ ఈ స్మార్ట్ బాల్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles